అమెరికన్ కంపెనీ అంకర్ అదిరిపోయే రోబోట్ వాక్యూమ్ 'రోబోవాక్ జి ఎక్స్ 8' హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏఐ మ్యాప్ 2.0 టెక్నాలజీతో మనిషి చేసే పనులన్నింటిని ఇదే చేస్తుంది.
రోబోవాక్ జి ఎక్స్ 8 ఫీచర్లు
ఇళ్లలోని జంతు ప్రేమికులకు మరింత సౌకర్యంగా రోబోవాక్ జి ఎక్స్ 8 గా ఉండనుంది. ఇందులో ఉండే ఐపాత్ లేజర్ నావిగేషన్, ట్విన్ టర్బైన్ టెక్నాలజీ అండ్ వైఫై ఫీచర్లు ఇంటిని క్లీన్ చేసే సమయంలో అడ్డంగా ఉన్న మూగజీవాల్ని తప్పుకొని వెళ్లిపోతుందని అంకర్ ప్రతినిధులు తెలిపారు. గుండ్రంగా ఉండే రోబోవాక్ జి ఎక్స్ 8 ఇంట్లో మనుషులు శుభ్రం చేయలేని ప్రాంతాల్ని సులభంగా చేరుకుంటుంది. ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తుంది.
ధర ఎంతంటే..?
అల్ట్రా-ప్యాక్ డస్ట్-కంప్రెషన్ టెక్నాలజీ డస్ట్ బాక్స్ వాల్యూమ్ వినియోగాన్ని పెంచుతుంది. తద్వారా మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ డస్ట్‌ను సేకరిస్తుంది. డస్ట్ తక్కువగా ఉన్నప్పుడు దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ను మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన పనిలేకుండా నో గో జోన్ , మల్టీ ఫ్లోర్ మ్యాపింగ్ తో పనిచేస్తుంది. పెట్ హెయిర్ క్లీనింగ్, టూ-ఇన్-వన్ వాక్యూమ్, మ్యాపింగ్ 2000పీఏ ఎక్స్2 సెక్షన్ పవర్‌తో లేజర్ నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. ధర రూ. 34,999/- 12 నెలల వారంటీతో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment