సెల్ఫ్‌ క్లీనింగ్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ - ధర ఎంతో తెలుసా? | Self cleaning roborock S7 Max Ultra Vacuum cleaner price and details | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ క్లీనింగ్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ - ధర ఎంతో తెలుసా?

Published Sun, Jul 23 2023 8:36 AM | Last Updated on Sun, Jul 23 2023 8:38 AM

Self cleaning roborock S7 Max Ultra Vacuum cleaner price and details - Sakshi

విద్యుత్తుతో పనిచేసే వాక్యూమ్‌ క్లీనర్లు ఇప్పటికే చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోబో వాక్యూమ్‌ క్లీనర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోబో వాక్యూమ్‌ క్లీనర్లు గదిలోని చెత్తను పూర్తిగా తొలగించాక, వాటిలోని అర చెత్తతో నిండిపోతోంది. 

ఆ చెత్తను మనం తొలగించాల్సి ఉంటుంది. అయితే, చైనీస్‌ హైటెక్‌ కంపెనీ ‘జియావోమీ’ ఇటీవల సెల్ఫ్‌ క్లీనింగ్‌ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రోబోరాక్‌ ఎస్‌7 మాక్స్‌ అల్ట్రా’ పేరుతో తెచ్చిన ఈ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ గదిలోని చెత్తను తొలగించాక, తనను తాను శుభ్రం చేసుకుంటుంది.

(ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!)

ఇందులోని సెన్సర్లు గదిలోని చెత్తను రకాల వారీగా గుర్తించి, అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. సూక్ష్మమైన ధూళికణాలను కూడా ఏరివేసేందుకు ఇవి దోహదపడతాయి. గదిలో అడ్డదిడ్డంగా వస్తువులు పడి ఉంటే, అడ్డంకులను దాటుకుని మరీ ఈ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ పనిచేస్తుంది. దీని ధర 1299 డాలర్లు (రూ.1,06,581).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement