
ఆఫీసులో పనిచేసే రోబో గురించి వినుంటారు, రెస్టారెంట్లలో పనిచేసే రోబోలను గురించి వినుంటారు, ఆఖరికి ఇంట్లో పనిచేసే రోబోలను కూడా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ.. గుడ్లను (Eggs) సేకరించే రోబోలను గురించి విన్నారా?, బహుశా ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇలాంటిది కూడా ఒకటుందని తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి మరి.
ఎన్ఐటీ కాలికట్ (NIT Calicut).. గుడ్లను సేకరించడానికి ఓ ప్రత్యేకమైన రోబోట్‌ను రూపొందించింది. దీనిపేరు 'అవిబోట్' (AVIBOT). ఇది కోళ్ల ఫారాలలో గుడ్లను పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా సేకరిస్తుంది. కాబట్టి వర్కర్స్ అవసరం, ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల పరిశ్రమలు నిర్వహించేవారు.. గుడ్లను సేకరించడానికి ఇలాంటి రోబోట్స్ ఉపయోగించవచ్చు.

అవిబోట్ ఉపయోగాలు
➤సాధారణంగా ఎక్కడైనా గుడ్లను సేకరించడానికి మనుషులను ఉపయోగిస్తారు. కానీ ఈ అవిబోట్ స్వయంగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి లేబర్ ఖర్చులు తగ్గుతాయి.
➤అవిబోట్ చాలా వేగంగా గుడ్లను సేకరిస్తుంది. ఉదాహరణకు మనుషులు రెండు గంటల్లో గుడ్లను కలెక్ట్ చేస్తే.. ఈ రోబోట్ ఒక గంటలో పని పూర్తి చేస్తుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. యజమాని లేదా నిర్వాహకులు ఇతర ముఖ్యమైన పనులపై దృష్టిపెట్టవచ్చు.
➤రోబోట్ చాలా జాగ్రత్తగా గుడ్లను సేకరిస్తుంది. కాబట్టి పగిలిపోయే గుడ్ల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల యజమాని లాభం పొందవచ్చు. అంతే కాకుండా గుడ్డు ఉత్పత్తి రేట్లకు సంబంధించిన డేటాను సేకరించడం, రైతుల కార్యకలాపాలను పర్యవేక్షించడం, మెరుగుపరచడం వంటి వాటిలో కూడా సహాయపడుతుంది.
ఇదీ చదవండి: ఉండగా మరమనిషి తోడుగా.. పనిమనిషి ఎందుకు దండగ!
Comments
Please login to add a commentAdd a comment