ఇంటి శుభ్రం.. ఇలా సులభం | Now, house floor can be cleaned easy with Vacuum Cleaner | Sakshi
Sakshi News home page

ఇంటి శుభ్రం.. ఇలా సులభం

Published Sat, Nov 2 2013 5:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM

ఇంటి శుభ్రం.. ఇలా సులభం

ఇంటి శుభ్రం.. ఇలా సులభం

 సాక్షి, హైదరాబాద్: ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లంతా మెరవాలంటే ఎలా? కొంత సమయాన్ని వెచ్చించి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే చాలు ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు.
 
 ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్‌మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.
 కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని తరుచుగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యూమ్  క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలి.
 
 గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు.
 
 మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనిగర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్‌లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి.
 
 వంటింట్లో..: స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement