marble flooring
-
ఇంటి అందం రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్: ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. అంటే ఇల్లు ఎంత అందం.. శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని దానర్థం. అలా అని ప్రతి పండక్కీ ఇంటికి రంగులు వేయించడం కాసింత కష్టమే. అందుకే ఇంట్లోని ఫర్నిచర్‌ను, సామగ్రిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అందనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండీ మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. కార్పెట్లు..: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వాక్యూమ్క్లీనర్తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరక లు తొలిగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు. మైక్రోఓవెన్: దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. వంటింట్లో..: స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి. -
రంగు పడుద్ది!
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢ మాసం ముగిసిందంటే చాలు పండుగల సందడి మొదలవుతుంది. షాపింగ్ హడావుడి, వాహనాల కొనుగోళ్లతో ఇళ్లంతా హడావుడిగా తయారవుతుంది. ఇంటికి రంగులు వేయించడంతో పండుగల ఆనందాన్ని రెట్టింపుచేసుకోవచ్చు. ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. మరెలా? రంగులు వేయకున్నా ఇల్లంతా మెరిసిపోవాలంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. పండగ సీజన్ ఆరంభం కావడంతో ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లంతా మెరుపులు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్దతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలి. ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే సుమా. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూలను బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి తరచూ వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరక లు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యూమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి. గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు లాంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జెంట్లతో శుభ్రం చేయండి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయరాదు. వంటింట్లో: బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటిం ట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి. -
ఇంటి శుభ్రం.. ఇలా సులభం
సాక్షి, హైదరాబాద్: ఇంటికి రంగుల్ని వేయించడం అందరికీ కుదరకపోవచ్చు. రంగులు వేయకున్నా ఇల్లంతా మెరవాలంటే ఎలా? కొంత సమయాన్ని వెచ్చించి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే చాలు ఇంటిని అందంగా తీర్చిదిద్దవచ్చు. ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరుచూ నిర్వహణ ఉన్నప్పుడే. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించుకోవాలి. దీని కోసం డోర్మ్యాట్ల వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూ, చెప్పులను బయటే విప్పి ఇంట్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక చూడండి మీ ఫ్లోరింగ్ మెరిసిపోతుంది. కార్పెట్లు: కార్పెట్లు దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిని తరుచుగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్లపై టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావుకప్పు తినే సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఆ పేస్టును ఆరనిచ్చి, వాక్యూమ్ క్లీనర్‌తో మరకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. గోడలు: గోడలను తరుచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. దీంతో ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయకూడదు. మైక్రోఓవెన్: మైక్రోఓవెన్‌ను అధికంగా వాడటం వల్ల ఎక్కువగా మురికిపడుతుంది. దీన్ని శుభ్రం చేయడానికి సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనిగర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడి చేయాలి. దీంతో గట్టిగా ఉండే ఆహారపదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి. వంటింట్లో..: స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు, నీటిలోని ఉప్పు పేరుకుపోవడం వల్ల చూడడానికి వికారంగా కన్పిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసేలా కన్పించాలంటే ఆల్కహాల్‌తో తుడవాలి. నల్లాపైన ఏర్పడే నీటి మర కల్ని టూత్‌పేస్టుతో రుద్దడం ద్వారా తొలగించవచ్చు. వంటింట్లోని సింక్ పరిశుభ్రంగా కన్పించాలంటే నాలుగు పాళ్ల ఉప్పుకు ఒక పాలు వెనిగర్ కలిపి ప్రయత్నించండి. -
పాలరాతిలో పలికెను అందాలు!
ఇంటి అలంకరణ ఎలా ఉండాలి? ఒకసారి చూసినవాళ్లు తల తిప్పి మళ్లీ చూసేలా ఉండాలి. ఇప్పుడు ఇళ్లకు పాలరాతి ఫ్లోరింగ్ చాలా సాధారణమైన విషయమైంది. మరి పాలరాతి నేలకు దీటుగా కనిపించాలంటే... ఇంటి అలంకరణ ఎలా ఉండాలి? అది పాలరాతి బొమ్మలతో అయితేనే సాధ్యం. ఇక్కడ కనిపిస్తున్న పాలరాతి టైమ్‌పీస్, ఫ్లవర్‌వాజ్, పెన్‌స్టాండ్, వాల్ హ్యాంగింగ్ ... వగైరా పాలరాతితో తయారైనవి. మార్బుల్ ఫ్లోరింగ్‌కు మ్యాచింగ్‌గా మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్స్ వచ్చేశాయి. మరి ఆ టేబుల్ మీద ఉపయోగించే టిష్యూ పేపర్ హోల్డర్, మంచి నీటిగ్లాసుల మూతలు, జ్యూస్ గ్లాసుల వంటివి కూడా మార్బుల్వే. అలాగే సోఫా సెట్ కార్నర్లో పెట్టిన పాలరాతి అమ్మాయి... ఇంటికి వచ్చిన అతిథులను ఆశ్చర్యంగా చూస్తుంటారు. బెడ్రూమ్లోకి అడుగుపెడితే బెడ్ల్యాంపు కూడా అంతే స్టయిల్‌గా ఉండాలి కదా! అందుకే ఈ లాంతరు మోడల్ ల్యాంప్.