పాలరాతిలో పలికెను అందాలు!
ఇంటి అలంకరణ ఎలా ఉండాలి? ఒకసారి చూసినవాళ్లు తల తిప్పి మళ్లీ చూసేలా ఉండాలి. ఇప్పుడు ఇళ్లకు పాలరాతి ఫ్లోరింగ్ చాలా సాధారణమైన విషయమైంది. మరి పాలరాతి నేలకు దీటుగా కనిపించాలంటే... ఇంటి అలంకరణ ఎలా ఉండాలి? అది పాలరాతి బొమ్మలతో అయితేనే సాధ్యం. ఇక్కడ కనిపిస్తున్న పాలరాతి టైమ్‌పీస్, ఫ్లవర్‌వాజ్, పెన్‌స్టాండ్, వాల్ హ్యాంగింగ్ ... వగైరా పాలరాతితో తయారైనవి.
మార్బుల్ ఫ్లోరింగ్‌కు మ్యాచింగ్‌గా మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్స్ వచ్చేశాయి. మరి ఆ టేబుల్ మీద ఉపయోగించే టిష్యూ పేపర్ హోల్డర్, మంచి నీటిగ్లాసుల మూతలు, జ్యూస్ గ్లాసుల వంటివి కూడా మార్బుల్‌వే. అలాగే సోఫా సెట్ కార్నర్‌లో పెట్టిన పాలరాతి అమ్మాయి... ఇంటికి వచ్చిన అతిథులను ఆశ్చర్యంగా చూస్తుంటారు. బెడ్‌రూమ్‌లోకి అడుగుపెడితే బెడ్‌ల్యాంపు కూడా అంతే స్టయిల్‌గా ఉండాలి కదా! అందుకే ఈ లాంతరు మోడల్ ల్యాంప్.