వచ్చేశాయి.. ! బడ్జెట్‌ ఫ్రెండ్లీ రియల్‌మీ వాషింగ్‌మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? | Realme Launches Air Purifier Vacuum Cleaners Washing Machines In India | Sakshi
Sakshi News home page

Realme: వచ్చేశాయి.. ! బడ్జెట్‌ ఫ్రెండ్లీ రియల్‌మీ వాషింగ్‌మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?

Published Thu, Sep 30 2021 4:04 PM | Last Updated on Thu, Sep 30 2021 4:08 PM

Realme Launches Air Purifier Vacuum Cleaners Washing Machines In India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్ధ రియల్‌మీ భారత మార్కెట్‌లో మరింత పురోగతిని సాధించేందుకు గృహోపకరణాల రంగంలోకి అడుగుపెట్టింది. గృహోపకరణాల విభాగంలో ప్రముఖ చైనీస్‌ సంస్ధ షావోమీ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షావోమీ పోటీగా భారత మార్కెట్లలోకి వాషింగ్‌మెషిన్లను, వాక్యూమ్‌ క్లీనర్స్‌ను, ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌, రోబోట్‌ వాక్యూమ్‌ గృహోపకరణాలను  రియల్‌మీ లాంచ్‌చేసింది. 
చదవండి: AI స్వగతం: తప్పులు లేకుండా చెప్పే యాంకర్లు.. రైటర్లు

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌లో కొనుగోలుదారులకు ఈ ఉపకరణాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ గృహోపకరణాలను లాంచ్‌ సందర్భంగా రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్‌, రియల్‌మీ ఇండియా, యూరోప్‌, అండ్‌ లాటిన్‌ సీఈవో మాధవ్‌ సేత్‌ మాట్లాడుతూ..‘భారతీయులకు టెక్‌లైఫ్‌ను అందించేందుకు రియల్‌మీ ఎప్పుడు ముందుఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్‌ హోమ్‌ కేటగిరీని మెరుగుపరుస్తూ..భారత్‌లో రియల్‌మీ నెం.1 లైఫ్‌స్టైల్‌, టెక్‌లైఫ్‌ బ్రాండ్‌గా నిలిచేందుకు కంపెనీ కృషి చేస్తోంద’ని వెల్లడించారు. 

రియల్‌మీ గృహోపకరణాల ధరలు ఇలా ఉన్నాయి..!

  • రియల్‌మీ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో రూ. 1000 తగ్గింపు వర్తించనుంది. 
  • రియల్‌మీ హ్యండ్‌హెల్డ్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో రూ. 500 తగ్గింపు వర్తించనుంది. 
  • రియల్‌మీ టెక్‌లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధర రూ .24,999 అయితే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ .19,999 కే విక్రయించబడుతుంది.
  • ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో రియల్‌మీ రెండు కొత్త టాప్-లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను కూడా విడుదల చేసింది. వాషింగ్ మెషీన్ల ధర రూ .12,990(7.5 కిలోలు ),  రూ .15,990(8 కిలోలు). 

చదవండి: రోల్స్‌రాయిస్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కార్‌పై ఓ లుక్కేయండి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement