తలనొప్పిని తరిమేసే గాడ్జెట్‌.. ధర ఎంతంటే? | Gammacore Sapphire Reviews | Sakshi
Sakshi News home page

తలనొప్పిని తరిమేసే గాడ్జెట్‌.. ధర ఎంతంటే?

Published Sun, Sep 24 2023 7:33 AM | Last Updated on Sun, Sep 24 2023 7:34 AM

Gammacore Sapphire Reviews - Sakshi

తలనొప్పి చాలామందిని తరచు వేధించే సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలతో ఉపశమనం పొందడం తప్ప ఇప్పటివరకు నానా తలనొప్పులకు తగిన పరిష్కారమే లేదు. అయితే, ఈ చిన్న పరికరం ఎలాంటి మొండి తలనొప్పులనైనా చిటికెలో తరిమికొడుతుంది. 

అమెరికన్‌ కంపెనీ ‘గామాకోర్‌’ ఇటీవల ఈ పరికరాన్ని ‘గామాకోర్‌ సఫైర్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మెడవద్ద నరాలు ఉండేచోట పెట్టుకుని, ఆన్‌ చేసుకుంటే వైబ్రేట్‌ అవుతూ ‘వేగస్‌’నరాన్ని ఉత్తేజపరచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులనైనా, తరచుగా పీడించే మైగ్రేన్‌ వంటి తలనొప్పులనైనా ఇది నిమిషాల్లోనే తరిమికొడుతుంది. దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మాత్రల వాడకమే కాకుండా, వాటితో ఎదురయ్యే దుష్ఫ్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. దీని ధర 655 డాలర్లు (రూ.54,446) మాత్రమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement