headaches
-
విపరీతమైన తలనొప్పి అనడంతో స్కాన్ చేసి చూడగా..విస్తుపోయిన వైద్యులు!
కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అంతు చిక్కని మిస్టరీల్లా ఉంటాయి. ఏదైన వస్తువులను చిన్నపిల్లలు అయితే తెలియక మింగడం లేదా చెవుల్లోనూ, ముక్కులోనూ పెట్టుకోవడం జరుగుతుంది. అదే పెద్ద వాళ్ల శరీరాల్లో అలాంటి చిన్న వస్తువులు కనిపిస్తే ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడొక వ్యక్తి విషయంలో అలానే జరిగింది. స్కాన్ చేసి చూసిన వైద్యులు కూడా విస్తుపోయారు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో గత ఐదు నెలలుగా బాధపడుతున్నాడు. పలు వైద్య పరీక్షలు నిర్వహించి అతడు టెన్షన్‌కి సంబంధించిన న్యూమోసెఫాలస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. ఈ అరుదైన న్యూరోలాజికల్ పరిస్థితి కాస్త ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. నివారించేందుకు చికిత్సలో భాగంగా రోగి శరీర స్థితి గురించి క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే సిటీస్కాన్లు నిర్వహించగా బ్రెయిన్లో ఉన్న ఆ వస్తువుని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు వైద్యులు. రెండు చాప్‌స్టిక్‌లు అతని మెదడులో ఇరుక్కుని ఉన్నట్లు గుర్తించారు. అసలు అవి మెదడు వరకు ఎలా చేరాయనేది వైద్యులకు ఓ మిస్టరీలా అనిపించింది. ఆ పేషెంట్‌కి కూడా ఈ విషయం చెప్పగా.. ఐదు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు తెచ్చుకుంటూ..ఓ రోజు రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన గొడవలో ముఖంపై ఏదో వస్తువుతో గుచ్చినట్లు గుర్తు.. కానీ అది జరిగే చాలారోజులు అయ్యిందని చెప్పాడు. ఐతే అప్పుడు తనకు ఎలాంటి సమస్య, ఇబ్బంది గానీ అనిపించలేదని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దీంతో వైద్యులు పేపెంట్ ముక్కుని పరిశీలించగా..చాప్‌స్టిక్ గుచ్చిన గుర్తులు కనిపించడంతో ముక్కు ద్వారానే ఈ చాప్‌స్టిక్‌లు మెదడులోకి వెళ్లాయని నిర్థారణకు వచ్చారు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్‌కి ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ఆ చాప్ స్టిక్‌లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దయచేసి మీపై ఏదైనా దాడి జరిగినప్పుడూ పెద్ద దెబ్బలేం తగలలేదని నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు వైద్యులు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
తలనొప్పిని తరిమేసే గాడ్జెట్.. ధర ఎంతంటే?
తలనొప్పి చాలామందిని తరచు వేధించే సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలతో ఉపశమనం పొందడం తప్ప ఇప్పటివరకు నానా తలనొప్పులకు తగిన పరిష్కారమే లేదు. అయితే, ఈ చిన్న పరికరం ఎలాంటి మొండి తలనొప్పులనైనా చిటికెలో తరిమికొడుతుంది. అమెరికన్ కంపెనీ ‘గామాకోర్’ ఇటీవల ఈ పరికరాన్ని ‘గామాకోర్ సఫైర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మెడవద్ద నరాలు ఉండేచోట పెట్టుకుని, ఆన్ చేసుకుంటే వైబ్రేట్ అవుతూ ‘వేగస్’నరాన్ని ఉత్తేజపరచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులనైనా, తరచుగా పీడించే మైగ్రేన్ వంటి తలనొప్పులనైనా ఇది నిమిషాల్లోనే తరిమికొడుతుంది. దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మాత్రల వాడకమే కాకుండా, వాటితో ఎదురయ్యే దుష్ఫ్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. దీని ధర 655 డాలర్లు (రూ.54,446) మాత్రమే! -
ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కోవిడ్ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్టెక్లు తెలిపాయి. భారత్‌లో రికవరీ రేటు 92.89% భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కోవిడ్ సురక్ష మిషన్ కోసం ఈ నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. -
వేర్వేరు అవయవాలపై ఒత్తిడి ప్రభావం అధిమించండి
మీరు బాగా ఒత్తిడిలో ఉన్నారా? ఆ విషయం మీ శరీరం ద్వారానూ మీకు స్పష్టంగా తెలుస్తోందా? ఎందుకంటే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు కొందరిలో తలనొప్పి రావచ్చు. మరికొందరిలో ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇలా తల మొదలుకొని, పాదాల వరకు రకరకాల అవయవాల్లోని ఇబ్బందులు రకరకాల రూపాల్లో వ్యక్తమవుతాయి. మానసిక ఒత్తిడి మీలోని ఏ అవయవాన్ని ఎలా ప్రభావితం చేసి, ఏయే లక్షణాలను కనబరుస్తోందో... దాన్ని బట్టి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవి చాలా తేలికైనవి. అనుసరించి చూడండి. రిలాక్స్ అవ్వండి. తల, మెడ భాగాల్లో కొందరిలో ఒత్తిడి వల్ల తల గట్టిగా పట్టేసినట్లుగా అనిపిస్తుంది. నుదురు ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సన్నగా తలనొప్పి మొదలై తీవ్రం కావచ్చు. మరికొందరిలో తెలియని భారమంతా తమ భుజాలపైన ఉన్నట్లుగానూ, ఆ బరువు తమను కుంగదీస్తున్నట్లుగానూ ఉండవచ్చు. మెడ, భుజాల కండరాలు గట్టిగా పట్టేసినట్టు అనిపించవచ్చు. ఇది తగ్గాలంటే కొన్ని చిట్కాలివి... ►మొదట కుర్చీలో హాయిగా, సౌకర్యంగా కూర్చుని రిలాక్స్ అవ్వండి. చేతులు, కాళ్లు రిలాక్స్డ్గా ఉంచాలి. ►మీ ముఖాన్ని కుడి భుజం వైపుకు, మళ్ళీ ఎడమ భుజం వైపు తిప్పాలి. ఆ తర్వాత పైకీ, ఆ వెంటనే కిందకు వంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►మీ తలను మొదట ఎడమ భుజం వైపు తర్వాత ఛాతీ వైపుకు, అక్కడి నుంచి కుడి భుజం వైపుకు ఇలా గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇలా ఐదు సార్లు చేయాలి. ►నోటిని పెద్దగా తెరవాలి, కళ్ళను రెప్పలతో గట్టిగా నొక్కిపెట్టాలి. నోటితో గట్టిగా అరుస్తున్నట్టుగా నోరు తెరవాలి. కానీ ఎలాంటి శబ్దం చేయకూడదు. అలా విశాలంగా నోరు తెరచి గాలిని బాగా పీల్చాలి. మీకు బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఛాతి: ఒత్తిడి కారణంగా ఛాతీ చాలా బరువుగా ఉన్నట్లు అనిపించడం, శ్వాస గుండెల నిండా పూర్తిగా తీసుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ కింది విధంగా చేయండి. ►రిలాక్స్డ్గా కూర్చోవాలి. ఆ సమయంలో నడుమును నిటారుగా ఉంచాలి. ►కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ►ఐదు వరకు అంకెలు లెక్కపెడుతూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అలాగే మళ్లీ ఐదు అంకెలు లెక్కపెడుతూ శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ►వీలైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఉదరాన్ని బయటకు పెట్టాలి. అలాగే శ్వాసను వదలుతున్నప్పడు ఉదరాన్ని లాగినట్టుగా లోపలికి తీసుకోవాలి. ►ఇప్పుడు మీ ఉచ్ఛాస్వ–నిశ్శాస్వలను లెక్కించండి. ఈ లెక్కపెట్టడం రివర్స్‌లో జరగాలి. మీకు సమయం ఉంటే 60 నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ, సమయం లేకపోతే కనీసం 20 సంఖ్య నుంచి వెనక్కి సున్న వచ్చేంత వరకూ లెక్కించాలి. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఒక అంకె, శ్వాస వదిలినప్పుడు తర్వాత అంకె... ఇలా సున్న వరకు లెక్కించి, సున్న తర్వాత కళ్ళు తెరవాలి. ఛాతీ, మొండెం భాగాల్లో మీరు ఒత్తిడికి గురయ్యినప్పుడల్లా మీరు ఎలా నుంచున్నారో లేదా కూర్చొని ఉన్నారో మీ పోశ్చర్‌ను ఒకసారి గమనించుకోండి. సాధారణంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలామంది ఒంగిపోయి, తల ఒంచుకుని ఉంటారు. ఇది మీ వెన్ను మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ కింది చిట్కాలు పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ►మొదటగా మీకు తెలిసిందే... తలవంచుకుని లేదా తలవాల్చి ఉండవద్దు. నిటారుగా కూర్చోండి. ►ఎక్కువ సేపు కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండేవారు ప్రతి అరగంటకి ఒకసారి లేచి నిలబడి అక్కడికక్కడే ఒకటిరెండు నిమిషాలు నడవండి. ►నడుం నొప్పి వచ్చేవారికి భుజంగానసం చాలా బాగా పనిచేస్తుంది. కాళ్లు... పాదాలపై చాలామందిలో ఒత్తిడి తమ పాదాలపై ప్రభావం చూపుతుంది. మరీ ఒత్తిడికి గురైన చాలామందిలో పిక్కలు పట్టేయడం, కాళ్ల కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల కాళ్లు, పాదాలు ప్రభావితమయ్యేవారు ఈ కింది టిప్స్ పాటించాలి... ►కాళ్ళను కాస్తంత ఎత్తు మీద పీటలాంటిదానిపై పెట్టి ఉంచండి. ►మీ కాళ్ళను స్ట్రెచ్ చేసి మీ పాదాలను మీ వైపు తీసుకురావడానికి ప్రయత్నించండి, అలాగే దానికి వ్యతిరేక దిశలో మళ్లీ స్ట్రెచ్ చేయండి. ►నిలబడి గాని, కూర్చునిగాని ఒక కాలిని పైకి లేపి మడమను గుడ్రంగా రొటేట్ చేస్తున్నట్లుగా తిప్పాలి. మొదట కుడివైపుకు, తర్వాత ఎడమవైపుకు తిప్పాలి. రెండుకాళ్లతో ఇలా ఐదుసార్లు చేయాలి. ►పెడిక్యూర్ చేయడం /పాదాల మసాజ్ వల్ల కూడా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా... ►పైన పేర్కొన్న వాటన్నింటితో పాటు టెన్నిస్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, హాకీ లేదా క్రికెట్ వంటి ఆటలు కూడా ఆడుతుండటం మంచిది. ►ప్రతి రోజు ఒక గంట ఎరోబిక్స్ చేయడం మంచిది. టీవీ చూస్తూ డ్యాన్స్ కూడా చేయవచ్చు. ►వాకింగ్, జాగింగ్, స్విమింగ్ వీటిలో ఏదో ఒకటి రోజుకు గంట పాటు చేయాలి. వీటన్నింటి వల్ల మన గుండె , ఊపిరితిత్తులు, రక్తకణాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు, కీళ్ళు గట్టిపడతాయి. దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎండార్ఫిన్స్ వంటి మంచి హార్మోన్లు విడుదలయ్యి అవి ఒత్తిడిని కలిగించే రసాయనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కళ్లు ఒత్తిడి బాగా ఉన్నప్పుడు కొందరిలో కళ్లు నొప్పిగా ఉండటం, కళ్లు లాగినట్లు అనిపించడం, కళ్ల వెంట నీరుకారడం జరుగుతుంది. టీవీ, మొబైల్స్ ఎక్కువగా వాడటం, కంప్యూటర్‌పై ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా కళ్లపై ఒత్తిడి పడి ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. ►ప్రతి గంటకోసారి కళ్లను గట్టిగా కాకుండా, మృదువుగా మూసుకొని... కళ్లపై మునివేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది గుండ్రంగా చేయాలి. తొలుత క్లాక్‌వైజ్‌గా ఐదుసార్లు, ఆ తర్వాత యాంటీక్లాక్‌వైజ్‌గా మరో ఐదుసార్లు చేయాలి. ►కళ్లకు ఆహ్లాదంగా ఉండే రంగు (సూదింగ్ కలర్) లైట్ గ్రీన్. కాబట్టి కిటికీలోంచి పచ్చటి చెట్లను చూడవచ్చు. లేదా కంప్యూటర్ మానిటర్ పక్కన ఇన్డోర్ ప్లాంట్స్ పెట్టుకొని చూస్తుండటం కూడా మంచి పద్ధతి. ►కంప్యూటర్ / మొబైల్ ఫోన్స్‌లో రీడింగ్ మోడ్‌లో ఉంచి చదవడం మంచిది. ►రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లమీద తాజానీటిలో ముంచిన తడిగుడ్డ కాసేపు ఉంచుకోవడంమంచిది. వీటన్నింటివల్ల ప్రయోజనం కనిపించినప్పుడు ఒకసారి కంటి డాక్టర్‌ను సంప్రదించి తమ ఐ–సైట్ చెక్ చేయించుకోవాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పర్ఫ్యూమ్స్తో జాగ్రత్త!
ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా బాగా చవగ్గా లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి. ఈ చీప్ పర్ఫ్యూమ్స్ కారణంగా కొన్ని వ్యాధులు, సెంట్ల కారణంగా వచ్చే అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. పర్ఫ్యూమ్స్తో అనర్థాలివే... సెంట్స్ కారణంగా అనేక రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. అంతేకాదు... అలా సెంట్ వాసన సోకిన వెంటనే కొందరిలో మైగ్రేన్ సమస్య మొదలవుతుంది. ఇటీవల ఈ కారణంగా వచ్చే తలనొప్పులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. సెంట్స్ చర్మానికి తగలడంతో పాటు, వాటి వాసన వ్యాప్తిచెందడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ పేర్కొన్నారు. ఇలా ఉపయోగించామో లేదు... వెంటనే అలా అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల తాలూకు జాబితాను రూపొందించేందుకు యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఘాటైన సువాసనలు వెదజల్లే అనేక సుగంధ ద్రవ్యాలు చోటు చేసుకున్నాయి. మంచి వాసనలను వెదజల్లే వస్తువులు ఉదాహరణకు... కొన్ని ఘాటైన వాసనలు వెదజల్లే సబ్బులు, షాపూలు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు తేలింది. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు.వారి చర్మ ఆరోగ్యం గురించి డర్మటాలజిస్టు నిపుణులు చెప్పే మాటలిలా ఉన్నాయి. ‘కొందరు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ వంటివి జల్లుకుంటారు. అలా మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఘాటైన వాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కంటే... ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికిన ఫ్రెష్ అండర్ గార్మెంట్స్ తొడుక్కోవడమే ఆరోగ్యకరం’ అన్నది డర్మటాలజిస్టుల సలహా. -
బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు..
మా నాన్నగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య తరచూ కాళ్లూ–చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయని విపరీతంగా బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఏ పని మీదా దృష్టిపెట్టలేకపోతున్నారు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో విజయవాడ పెద్దాసుపత్రిలోని ‘న్యూరో’ డాక్టరుకు చూపించాం. వారు పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకొమ్మని చెప్పారు. ఆ కుటుంబంలో అందరమూ బెంగపడుతున్నాం. బ్రెయిన్ సర్జరీ అంటే ప్రాణాపాయం ఉంటుందని, ఏవైనా అవయవాలు కోల్పోవచ్చని చెబుతున్నారు. కొద్దికాలం కిందట ‘బ్రెయిన్ ట్యూమర్’కు ఏదో శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చిందని, అది చాలా సురక్షితమని, అవయవాలు పనిచేయకుండా పడిపోయే పరిస్థితి రాదనే విషయాన్ని తాను పేపర్లో చదివానని ఒక ఫ్రెండ్ చెప్పాడు. అంతకు మించి వివరాలేమీ ఇవ్వలేకపోయాడు. అదేం సర్జరీయో వివరంగా చెప్పండి. అది ఖరీదైనదేమోననే ఆందోళన కూడా ఉంది. ఈ సర్జరీలోని రిస్క్ ఏమిటో, ఫలితాలెలా ఉంటాయో కూడా దయచేసి వివరించండి. మీరు లేఖలో రాసినదాన్ని బట్టి చూస్తే... బహుశా మీ ఫ్రెండ్ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ’ గురించి పేపర్లో చదివి ఉంటారు. అదే విషయాన్ని మీకు చెప్పి ఉంటారు. మెదడులో గడ్డలు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. తలనొప్పి మొదలుకొని... శరీరంలోని వివిధ అవయవాల పనితీరు దెబ్బతీసేలా చేయడం వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అవయవాలు పనిచేయకపోవడం లాంటి తీవ్రమైన పరిణామాలు తలెత్తితే అది ఆ వ్యక్తి జీవననాణ్యతపై ప్రభావం చూపడంతో పాటు, తన సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.ఇక ఈ అధునాతన సర్జరీ విషయానికి వస్తే... ఇందులో మంచి కచ్చితత్వం ఉంటుంది. ఈ ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎమ్మారై (ఐఎమ్మారై) శస్త్రచికిత్స ప్రక్రియలో మళ్లీ మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాకుండా గడ్డలను సమూలంగా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. దీని సహాయంతో సర్జన్లు కేంద్రనాడీమండలం (సీఎన్ఎస్)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకు గుర్తించి కూకటివేళ్ల నుంచి తొలగించడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలను మెదడు నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే మెదడుకు శస్త్రచికిత్సలంటే అది ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుందేమోననే ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆధునిక న్యూరోసర్జరీ వైద్యవిభాగంలో మైక్రోస్కోప్‌లు ప్రవేశించడం వల్ల ఇప్పుడు అవే శస్త్రచికిత్సలను చాలా సురక్షితమైన రీతిలో చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగానైతే సర్జన్ మైక్రోస్కోప్ ద్వారా లోనికి చూస్తూన్నప్పుడు మెదడులోని భాగాలను ఊహించగలడు గానీ... లోపలి భాగాల్లోకి ప్రవేశించడం కష్టంగానూ, ప్రమాదాలతో కూడుకున్న రిస్కీ పనిగానూ ఉంటుంది. అయితే మనం సాధారణంగా వాడే జీపీఎస్లాగే... ఈ ఆపరేషన్‌లోనూ ముందుగానే న్యూరోనావిగేషన్ పద్ధతి ద్వారా మెదడులోని అంతర్గత భాగాలనూ విస్పష్టంగా గుర్తించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. నిమ్ ఎక్లిప్స్ వంటి ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్ను ఉపయోగించుకొని, మెదడులోని ఫంక్షనల్ ప్రాంతాలను... అంటే ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాలను గుర్తించి, శస్త్రచికిత్స సమయంలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది. మామూలుగానైతే శస్త్రచికిత్స చేస్తున్న ప్రదేశాన్ని ఒక మైక్రోస్కోపు... న్యూరోనావిగేషన్తో కలిసి కొన్ని భాగాలను కాంతిమంతంగా చూపించగలగుతుంది. కానీ అది మెదడులోని సాధారణ, అసాధారణ కణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు. దాంతో కొన్ని రకాల గడ్డలను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అవి కూడా మెదడు కణజాలంలాగే కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడంలో న్యూరో నావిగేషన్ సదుపాయం కొంతవరకు సహాయపడుతుంది. అయితే మెత్తని కణజాలంతో కూడిన మెదడు... సర్జరీ సమయంలో స్థిరంగా ఉండదు. కదలికలకు (షిఫ్ట్స్కు) గురవుతుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స ప్రారంభానికి ముందు న్యూరోనావిగేషన్ ద్వారా అందిన చిత్రాలు... ఆపరేషన్ కొనసాగించే సమయంలో అంతగా ఉపయోగపడవు. అందువల్ల స్పష్టత లేకుండానే తమ ఊహమేరకు సర్జన్లు శస్త్రచికిత్స కొనసాగించాల్సి రావడంతో చాలా సందర్భాల్లో మెదడులోని గడ్డలో కొంతభాగం అలాగే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయిన ఆ భాగం మళ్లీ పెద్ద గడ్డగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగానే మెదడు గడ్డల తొలగింపు ఆపరేషన్లలో చాలా సందర్భాల్లో మళ్లీ మళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో మెదడు కదిలిపోయే పరిస్థితిని ఎప్పటికప్పుడు అది తెలియజేస్తూ ఉంటుంది. శస్త్రచికిత్స కొంత పూర్తయిన తర్వాత ఇంకా గడ్డ భాగం ఏదైనా మిగిలి ఉందా, దాని అంచులు ఎంతమేరకు విస్తరించి ఉన్నాయి... వంటి అంశాలను అది స్పష్టంగా చూపిస్తుంటుంది. అందువల్ల ఈ సౌకర్యాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయించుకుంటే మళ్లీ మళ్లీ మెదడు సర్జరీలు చేయించాల్సిన అవసరం రాదు. మొత్తం ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాకపోతే కాస్తంత సమయం ఎక్కువగా పడుతుందంతే. ఈ ఎమ్మారై ఎలా సహాయపడుతుందంటే... ఎమ్మారై (మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్) సహాయంతో మన శరీర అంతర్భాగాల్లోని అవయవాలను స్పష్టమైన చిత్రాలుగా తీయవచ్చన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటివరకూ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తుల్లో శస్త్రచికిత్సకు ముందుగా ఈ ఎమ్మారై పరీక్ష చేస్తుంటారు. ఆపరేషన్ నిర్వహించాక... రెండో రోజున పేషెంట్‌ను మళ్లీ ఎమ్మారై గదికి తరలించి, మరోసారి పరీక్ష చేసి, ట్యూమర్‌ను ఏ మేరకు తొలగించామని పరిశీలిస్తుంటారు. ట్యూమర్ ఇంకా కొంత మిగిలి ఉన్నట్లు గమనిస్తే... మళ్లీ సర్జరీ చేస్తారు. దీంతో ట్యూమర్ మొత్తాన్ని తొలగించడానికి... ఈ విధంగా చాలాసార్లు సర్జరీలు చేయాల్సి వస్తుంటుంది. అదే ‘ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై’ శస్త్రచికిత్స సమయంలోనే స్కాన్‌ను నిర్వహిస్తూ ఉంటే... ఇక్కడికక్కడే అప్పటికప్పుడే శస్త్రచికిత్సలో అవసరమైన మార్పులు చేయడానికి వీలవుతుంది. అంటే దీనిద్వారా పదే పదే సర్జరీలు చేయాల్సిన అగత్యం తప్పుతుందన్నమాట. ఈ తరహా శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారైను సర్జన్లకు అందుబాటులో ఉంచే విధంగా ఆపరేషన్ థియేటర్‌ను ప్రత్యేకంగా రూపొందించాల్సింటుంది. దీనికి తోడుగా మైక్రోస్కోప్, న్యూరోనావిగేషన్ వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తారు. ఈ అత్యాధునిక పరికరాల సహాయంతో ఆపరేషన్ కొనసాగుతుండగానే నిమిషనిమిషానికీ ఎప్పటికప్పుడు మెదడు చిత్రాల(ఇమేజెస్)ను చూసే వీలుకలుగుతుంటుంది. ఈ ఇమేజెస్ అందుబాటులో ఉండటం వల్ల సర్జన్లు ట్యూమర్ పరిమాణాన్ని, విస్తరణను విస్పష్టంగా చూడగలుగుతారు. ఫలితంగా మూలాల నుంచి గడ్డను తొలగించగలుగుతారు. అంతేకాదు... ఆ శస్త్రచికిత్స జరిగే క్రమంలో మెదడులోని వివిధ కీలకప్రాంతాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చూస్తారు. దాంతో అవి అదుపుచేసే శరీర భాగాల పనితీరు దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కణితి ఉన్న ప్రదేశం వరకు పక్కాగా మార్క్ చేసి, మెదడులోని ఇతర కీలక భాగలు, ప్రధాన అవయవాలను నియంత్రించే వ్యవస్థలను ఎంతో జాగ్రత్తగా న్యూరో మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తూ... ఏ అవయవాన్నీ కోల్పోకుండా, దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ ఈ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్’ సహాయంతో సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీలు 90 శాతానికి పైగా విజయవంతమవుతున్నాయి. ఇక ఖర్చు విషయానికి వస్తే మామూలు సర్జరీలతో పోలిస్తే కేవలం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. అయితే మళ్లీమళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులను నివారించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది పెద్ద ఖర్చుగా భావించనక్కర్లేదు. ట్యూమర్ ఉన్న ప్రదేశం, సైజును బట్టి ఉండే రిస్క్ ఎలాంటి సర్జరీలలోనైనా ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఆధునిక పద్ధతిని ఉపయోగించుకొని శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!
నా వయసు 52 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడి పైపున మూతి వంకరపోతోంది. నీళ్లు ఒక్క పక్క నుంచి కారిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఏడవ నరం (ఫేషియల్ నర్వ్) తాత్కాలికంగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొందరిలో వైరల్ జ్వరాల తర్వాత, వాటి కారణంగా కూడా సమస్య రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది ఎంత మాత్రమూ నిజం కాదు. కొన్నిరకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి సంబంధించిన కండరాలకు ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇది తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన వారిలో దాని తీవ్రతను బట్టి అది నయమయ్యే సమయం ఆధారపడి ఉంటుంది. నూటికి 80 నుంచి 90 మందిలో మొదటి ఆరు నెలల్లో నయమవుతుంది. బెల్స్పాల్సీ ముఖానికి సంబంధించిన కండరాలకు తప్పించి, శరీరంలోని ఏ భాగాలనూ ప్రభావితం చేయదు. అయితే... చేయి, కాళ్లలో బలం కోల్పోయినా, మింగడంలో ఇబ్బంది ఏర్పడినా, కనుచూపులో మార్పు కనబడినా... ఈ లక్షణాలలో ఏవి కనిపించినా తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు అంతగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది. కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి...ఎందుకిలా? నా వయసు 33. గత కొన్నేళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తూ, తగ్గుతూ ఉంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. ఒక్కోసారి నా రోజువారీ పనులేవీ చేసుకోలేనంత తీవ్రంగా ఈ నొప్పి ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. నేను క్రీడాకారుణ్ణి కావడంతో అన్ని రకాల ఆటలు బాగా ఆడుతుంటాను. నాకు కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. అసలు ఈ సమస్య ఎందుకు కలుగుతుంది? హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి హోమియో ద్వారా పూర్తి పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగే గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు వయసు పెరగడం, గాయం కావడం, వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల : ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. ►కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్‌కు చికిత్స ఉందా? నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధిక ప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంవశిక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తారు. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఏసీ వల్లనే ఈ సమస్యా?
నా వయసు 36 ఏళ్లు. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు చెప్పినట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగిన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బీపీ), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా? నా వయసు 52 ఏళ్లు. కొన్ని ఆర్థిక సమస్యలతో ఇటీవల డబుల్‌షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నాను. నా పనిలో భాగంగా అకౌంట్స్ అన్నీ చాలా నిశితంగా చూడాల్సి ఉంటుంది. అందుకోసం చాలా ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా రాకూడదు కాబట్టి చాలా తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. ►పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ►చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ►కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి ►కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు ►రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ►భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితోనూ బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. వేసవిలో వ్యాయామం ఆపేయాలా? నేను ఫిబ్రవరిలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కాబట్టి వ్యాయామం ఆపేయడం మంచిదని కొందరు స్నేహితులు చెబుతున్నారు. దయచేసి నాకు ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితోపాటు ఖనిజ లవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలను నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ►ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. ►చెమటను పీల్చే కాటన్దుస్తులను ధరించండి. ►బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ►మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మెడ నొప్పి చేతులకూ పాకుతోంది!
నా వయసు 58 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతులకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎల్తైన దిండ్లు వాడటం ►మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టి ట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్నుంచి విముక్తి ఎలా? నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మకణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండిరంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ►వంశపారంపర్యం ►మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్య నుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్కుచికిత్సఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
మైగ్రేన్ తగ్గుతుందా?
నా వయసు 31 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన తలనొప్పి వస్తోంది. ఆఫీసులో ఏపనీ చేయలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. కారణాలు: తలలోని కొన్నిరకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతివెలుగు, గట్టిశబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు: ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉం్డటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ: కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియోచికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్‌కు మందులు ఉన్నాయా? నా వయసు 42 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మసమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పైల్స్ సమస్యకు పరిష్కారం చెప్పండి... నా వయసు 47 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? అమితంగా ఇబ్బంది కలిగించే సమస్యల్లో మొలల సమస్య ఒకటి. ఈ సమస్యలో మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. ►గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. ►గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. ►గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
బాబుకు తరచూ ఎందుకీ తలనొప్పి..?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. మాటిమాటికీ తలనొప్పితో చాలా బాధపడుతున్నాడు. గతంలో అప్పుడప్పుడు మాత్రమే తలనొప్పి వచ్చేది. కాని ఇటీవల చాలా తరచుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. కానీ మాకు ఆందోళనగా ఉంది. మా వాడి సమస్య ఏమిటి? – శ్రీరామ్‌కుమార్, గుడివాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తోపాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటిలోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల వస్తున్న తలనొప్పి అనే భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. నివారణ / చికిత్స ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. పాపకు మాటిమాటికీ జలుబు... తగ్గేదెలా? మా పాపకు ఎనిమిదేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఈమధ్య ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాధ్యపడటం లేదు. దాంతో రాత్రిళ్లు ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం అంతంతమాత్రమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – కె. సురేఖ, కర్నూలు మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా?
నా వయసు 39 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – డి. జ్ఞానేశ్వర్రావు, కంచికచర్ల గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నాయి నా వయసు 48 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? – ఎల్. లక్ష్మీబాయి, నిజామాబాద్ మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. ఇటీవలికాలంలో రోజురోజుకూ వేరికోస్ వెయిన్స్ వ్యాధి బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. అంటే శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు ∙ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు ∙కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామాధిలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ సైనసైటిస్ తగ్గుతుందా? నా వయసు 36 ఏళ్లు. చాలాకాలంగా ముక్కుతో గాలి పీల్చుకోవడం కష్టం కావడంతో పాటు తలనొప్పి సమస్యలతో బాధపడుతుంటాను. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అని చెప్పారు. చాలా రకాల మందులు వాడాను. వాడినప్పుడు కొద్దిపాటి ఉపశమనమేగానీ సమస్య తగ్గడం లేదు. హోమియోలో శాశ్వత చికిత్స ఉందా? – ఎస్. సురేందర్, వరంగల్ సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి వేడిమిని మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. సైనసైటిస్ వచ్చిన వారికి ∙తరచూ జలుబుగా ఉండటం ∙ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టం కావడం ∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం ∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం ∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం ∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్ఫెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్–రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... హెపార్ సల్ఫూరికమ్ అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. ∙మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టాక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
బాబుకు తరచూ తీవ్రమైన తలనొప్పి...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదకొండేళ్లు. తరచూ తలనొప్పి తో చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు తలనొప్పి చాలా అరుదుగా వచ్చేది. కానీ ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. – ఎల్. రామస్వామి, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. అయితే ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమందిలో దీని వల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. నివారణ / చికిత్స: ∙చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం ∙నుదుటిపై చల్లటి నీటితో అద్దడం ∙నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు యాస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం ∙నీళ్లు ఎక్కువగా తాగించడం ∙ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలామట్టుకు తగ్గించవచ్చు. అయితే ఇది చాలా తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. వర్షం,వాతావరణంఉంటే చాలు... ముక్కులుబిగదీసుకు పోతున్నాయి! మా పాప వయసు ఏడేళ్లు. కాస్తంత మబ్బు పట్టి వాన వచ్చేలాంటి వాతావరణం ఉంటే చాలు పాపకు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఏడుస్తోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. – జి. రమణి, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్లో కనిపిస్తాయి. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్)గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం వల్ల కూడా ఇది వస్తుంది. మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. పాపకు నోట్లో పొక్కులు... తగ్గేదెలా? మా పాప వయసు ఆరున్నర ఏళ్లు. కొద్ది రోజుల కిందట పాప గొంతు నొప్పి అంటే డాక్టర్‌కు చూపిం చాం. అప్పుడు తగ్గాయి కానీ మళ్లీ పాప నోటిలో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. గొంతు అంతా ఎర్రబారింది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి. – ఈశ్వరీబాయి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ∙ఉద్వేగపరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), ∙బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), ∙విటమిన్లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) ∙వైరల్ ఇన్ఫెక్షన్లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి) ∙గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, అబ్రేసివ్ ఫుడ్స్ వంటి కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా) ∙పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి.దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఇది వస్తున్నట్లు భావించవచ్చు.ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాలి. అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో చికిత్స తీసుకోండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కాంగ్రెస్‌లో టికెట్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కన్నడనాట మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు టికెట్ల పంపిణీ కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కర్ణాటక సర్కారులో ఉన్న మంత్రులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నేరుగా అధిష్టానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే అన్ని పార్టీలు తొలివిడతగా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాత్రం జాబితా విషయంలో స్పష్టతనీయటం లేదు. కన్నడ మంత్రుల్లో ఎనిమిది మంది.. తమ పిల్లలు, అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతుండటమే అసలు కారణం. అయితే పార్టీ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేయొచ్చని తెలుస్తోంది. సంతానంతోనే సమస్య! సీఎం సిద్దరామయ్య సైతం చాముండేశ్వరి (సిట్టింగ్), బదామీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తన కుమారుడు యతీంద్రకూ టికెట్ ఇప్పించుకోవాలని పోటీపడుతున్నారు. అయితే సిద్దరామయ్య (కుమారుడికి), హోం మంత్రి రామ లింగారెడ్డి (కూతురికి), మాజీ కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప (కూతురికి), మల్లికార్జున ఖర్గే (కుమారుడు – రాష్ట్ర ఐటీ మంత్రి)లు ఈ విషయంలో విజయం సాధించినట్లేనని తెలుస్తోంది. మార్గరెట్ అల్వా (కుమారుడు నివేదిత్ అల్వా), వీరప్ప మొయిలీ (కుమారుడు హర్ష మొయిలీ), పీసీసీ చీఫ్ పరమేశ్వర (కుమారుడు) మంత్రులు ఆర్వీ దేశ్‌పాండే (కుమారుడు), టీబీ జయచంద్ర (కుమారుడు)కూడా తమ వాళ్లకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జేడీఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ సిద్దరామయ్య, వద్దని ఖర్గే, వీరప్ప మొయిలీ పట్టుబడుతుండటమే ఈ జాబితా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే వాకౌట్లు..: శుక్ర వారం ఉదయం రాహుల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వీరప్ప మొయిలీ, పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి నేతలు వాకౌట్ చేసేంతవరకు వెళ్లింది. దీంతో మళ్లీ సాయంత్రం సమావేశమయ్యా రు. ఈ భేటీలో సోనియా పాల్గొన్నారు. -
కండరాలు పట్టేస్తున్నాయి... కారణమేమిటి?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. – సుధాకర్‌రావు, నల్లగొండ తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సాధారణ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి... తరచూ ఎందుకిలా? నా వయసు 32. గత 12 ఏళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తోంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇది తగ్గేదెలా? – వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే ఆ పదార్థాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. పక్షవాతానికి స్టెమ్‌సెల్ థెరపీ అందుబాటులో ఉందా? నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. – ఎల్. జీవన్‌రెడ్డి, కర్నూలు ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా చేయడం అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధన దశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తలకు రంధ్రం పొడిచి.. నెత్తురు తోడేస్తారు!
ఆధునిక వైద్యవిధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ చైనాకు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్.. వాషింగ్టన్ లోని ఓ ఆసుపత్రిలో ముగ్గురి డీఎన్ఏలతో శిశువుకు ప్రాణంపోశారనే వార్తలు ఇటీవలే విన్నాం.(ముగ్గురికి జన్మించిన బిడ్డ!) కాగా, ఆ డాక్టర్ గారి స్వదేశంలో మాత్రం ఇప్పటికీ పాత మోటు వైద్యవిధానాలనే అవలంబిస్తూ కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించిన ఓ వర్థమాన నటి.. కఠినమైన పద్ధతుల్ని తట్టుకోలేక ఊపిరి వదిలేసిన వార్త ఆ మధ్య చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.(వికటించిన వైద్యం.. వర్ధమాన నటి మృతి). ఇక ఈ ఫొటోలో మీరు చూస్తున్నది అలాంటి చైనీస్ మోటు వైద్యవిధానమే. ఇంతకీ ఆయనకొచ్చిన జబ్బేమిటంటే.. తలనొప్పి! అవును. మామూలు తలనొప్పి! రూపాయో, అర్ధరూపాయో ఖరీదుచేసే ట్యాబ్లెట్ కు తగ్గే తలనొప్పి! గరం చాయ్ తాగి కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గే తలనొప్పి! 'ఒకవేళ అతనిది మైగ్రేన్ అయినా కూడా చికిత్స చేసుకోవాల్సింది మాత్రం ఇలా కదు'అని నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్యుడు.. రోగి నుదుటన సూదిలాంటి పరికరంతో 'టప్' మని పంక్చర్ చేయగానే.. తలలో నుంచి ట్యాప్ తిప్పినట్లు రక్తం ధారలా కారుతుంది. అక్కడి నరాల్లో రక్తాన్ని బటికి పోవడం ద్వారా తలనొప్పి తగ్గిపోతుంది. ఈ విధానాన్ని 'వెని పంక్చర్'అని వ్యవహరిస్తారు. నేరుగా వెయిన్స్(నరాలు)లోని రక్తాన్ని బయటికి తీసే ఈ విధానం.. మనందరికీ తెలిసిన 'ఆక్యుపంక్చర్'(సూదులతో గుచ్చే వైద్యం)ను పోలిఉంటుంది. చేయాల్సిన నరానికి కాకుండా వేరేదానికి పంక్చర్ చేసినా.. పంక్చర్ గాయానికి ఇన్ ఫెక్షన్ సోకినా.. రోగిప్రాణాలకు భరోసాలేదీ విధానంలో. సోషల్ మీడియాలో చాలామంది చూసిన ఈ వీడియో మీకోసం.. -
తలకు రంధ్రం పొడిచి.. నెత్తురు తోడేస్తారు!
-
కిరికిరి
‘డిజిటల్ కీ’ వ్యవహారం కమిషనర్, ఎస్ఐలకు అందని ‘కీ’ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం దరఖాస్తుదారుల ఇబ్బందులు జిల్లాలోని పలు ఠాణాల్లో ఇదే సమస్య జోగిపేట: పోలీసు, మున్సిపల్ శాఖలకు డిజిటల్ కీ తలనొప్పులు పట్టుకున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ‘కీ’ పర్మిషన్ రాకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఫలితంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్లు, సెల్ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, టైటిల్ డీడ్ మిస్ అయితే.. వాటిని పొందాలంటే అవస్థలు పడాల్సిందే. ‘కీ’లేక కుదరని ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేఽ, వాటిని మండల పరిధిలోని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వారంలో వాటిని జారీ చేయాల్సి ఉంటుంది. జోగిపేట ఎస్సైగా టి.శ్రీధర్ గత నెల 15వ తేదిన బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ కీ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నా ఇప్పటి వరకు రాలేదు. జోగిపేట సర్కిల్ పరిధిలోని పెద్దశంకరంపేట పోలీసుస్టేషన్‌కు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైది కూడా ఇదే పరిస్థితి. గత నెలలో బదిలీ అయిన చాలా మంది ఎస్సైలకు ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. నగర పంచాయతీలో... నగర పంచాయతీ ద్వారా పొందే సర్టిపికెట్లన్నీ ముఖ్యమైనవే. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో నాన్‌అవెయ్‌లెబులిటీ సర్టిఫికెట్, వాటిల్లో మార్పులుచేర్పులు నగర పంచాయతీ ద్వారానే డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరిస్తారు. విదేశాలకు వెళ్లేవారికి తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ అవసరం. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పత్రాలు సకాలంలో జారీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూలై 12వ తేదిన కమిషనర్‌గా ఉన్న రవీందర్రావును పలు కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓ యాశ్మిన్‌భాషకు ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు గత నెల 29న రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 4వ ఆమె బాధ్యతలు చేపట్టినా డిజిటల్ కీ అనుమతి రాకపోవడంతో అనేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. సర్టిఫికెట్ కోసం 15 రోజులుగా తిరుగుతున్నా.. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోయిందని జూలై 23న జోగిపేట మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాలేదు. ఇదే విషయం ఎస్సైని అడిగితే డిజిటల్ కీ లేదని, కాబట్టి సర్టిఫికెట్ ధ్రువీకరించలేదని చెప్పారు. ఇంకా నెల పడుతుందన్నారు. - పొట్టిగల్ల కృష్ణ, డాకూర్ గ్రామం -
తలనొప్పి తగ్గేదెలా..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23 ఏళ్లు. నేను గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించడం లేదు. తలనొప్పితోబాటు వాంతులు కూడా అవుతున్నాయి. ఏ చిన్న శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మగారికి కూడా ఇలాగే తలనొప్పి వస్తుండేది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. -హారిక, వరంగల్ మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది ముఖ్యంగా యుక్తవయస్కులలో ఎక్కువగా వస్తుంటుంది. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఉన్నవారు వేళకు భోజనం చేయడం, నిద్రపోవడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. ఈ వ్యాధి ఉన్నవారు టీవీ ఎక్కువ చూడటం, బాగా ఎండలోగానీ / చలిలోగాని బయటకు వెళ్లడం చేయకూడదు. పని ఒత్తిడి ఎక్కువైనా ఈ తలనొప్పి రావచ్చు. సరైన పొజిషన్లో కూర్చొని పనిచేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా దీన్ని అదుపు చేయవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, కొన్ని మందులు వాడటం వల్ల జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి నాకు 26 ఏళ్లు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా ఉంటుంది. పరిష్కారం చెప్పండి. - తుషార్, హైదరాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువైనా, మానవ సంబంధాలలో మార్పుల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒత్తిడి తగ్గించే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. అయితే మీ తలనొప్పికి ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోడానికి ఒకసారి డాక్టర్‌కు చూపించండి. - డా.మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్,హైదరాబాద్ -
మూడొచ్చినప్పుడు మాడులోనొప్పి... సెక్సువల్ హెడేక్!
మెడి క్షనరీ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు కొందరికి అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులను సెక్సువల్ హెడేక్స్ అంటారు. చాలా అరుదుగా వచ్చే ఈ తలనొప్పులు సెక్స్ సమయంలో వచ్చి బాధిస్తుంటాయి. ఈ తలనొప్పులను వైద్యపరిభాషలో ‘కాయిటల్ సెఫలాల్జియా’ అంటారు. మళ్లీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి. తలనొప్పులను వర్గీకరించే ‘ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ డిజార్డర్’ (ఐసీహెచ్డీ) ప్రకారం... మళ్లీ ఈ తలనొప్పుల్లో రెండు రకాలు ఉన్నాయి. అది స్ఖలనం ముందు వచ్చే తలనొప్పి. దీన్ని ప్రీ-ఆర్గాజమిక్ హెడేక్ అంటారు. ఇక రెండోది స్ఖలనం అయ్యే సమయంలో వచ్చే తలనొప్పి. దీన్ని ఆర్గాజమిక్ హెడేక్ అంటారు. చాలా సందర్భాల్లో ఇది దానంతట అదే తగ్గుతుంది. ఒకవేళ ఆ తలనొప్పి అదేపనిగా కొనసాగుతుంటే... డాక్టర్లు మరేదైనా కారణం వల్ల ... అంటే ఇంట్రాక్రేనియల్ అన్యురిజమ్స్ (తలలోని రక్తనాళాలు ఉబ్బడం) లేదా మెదడులోని రక్తనాళం ఏదైనా తెగడం వల్ల అంతర్గత రక్తస్రావం, గుండెజబ్బులు మొదలైన అనేక కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తున్నాయేమోనని డాక్టర్లు పరిశీలిస్తారు. అలాంటి సమస్యలేమీ లేకపోతే ఇది నిరపాయకరం. -
హోమియో...హామీలు!
ఏప్రిల్ 10 పపంచ హోమియో దినం ఉష్ణం ఉష్ణేన శీతలం, వజ్రాన్ని వజ్రమే కోస్తుంది లాంటివి మన సామెతలే. వీటిని చాలాసార్లు వినే ఉంటారు. కానీ శామ్యూల్ హనీమన్ మహనీయుడు ఆ సిద్ధాంతాలను చికిత్స ప్రక్రియకు అన్వయింపజేశాడు. అలా అందరికీ అందుబాటులో ఉండే చవకైన, సులభమైన ఒక కొత్త చికిత్స ప్రక్రియకు నాంది పలికాడాయన. చాలా మందికి చికిత్స అంటే భయం. మరెంతో ఆందోళన. చేదు మందుల్ని మింగాల్సి వస్తుందనీ, మేని కోతల్ని భరించాల్సి వస్తుందనే బెంగ. వీటన్నింటినీ దూరం చేస్తూ... ‘‘రోగి కోరేదీ... వైద్యుడిచ్చేదీ ఒకటే అయితే...’’ అనే మనదైన మరో సామెతనూ నిజం చేసేలా మందుల్ని రూపొందించాడాయన. ఈ నెల 10న ఆయన పుట్టిన రోజు. దీన్ని ప్రపంచ హోమియో దినంగా జరుపుకుంటున్న సందర్భంగా... ఈ చికిత్స ప్రక్రియపై అవగాహనతో పాటు... మనకు రోజూ కనిపించే అనేక చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల కోసమే ఈ ప్రత్యేక కథనం. మీ హోమియో కిట్... జ్వరాలు (ఫీవర్స్) అనేక రుగ్మతలకు జ్వరం ఒక లక్షణం మాత్రమే. హోమియోలో లక్షణాల ఆధారంగా మందును నిర్ణయిస్తారు కాబట్టి జ్వరంతో పాటు ఆయా లక్షణాలను బట్టి వాడాల్సిన మందును నిర్ణయించుకోవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే... అతి ప్రేమ-ఆప్యాయతలు కనబరచడం, కోపం వంటి లక్షణాలు ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక పులుపు ఎక్కువగా ఇష్టపడేవారూ, జ్వరం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా మారిపోయేవారికి ఇది మంచి మందు. అకోనైట్: తీవ్రమైన జ్వరం (హైఫీవర్), అతి భయం, చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన చెందడం, తలనొప్పితో బాధపడటం, మాటిమాటికీ దగ్గు, జలుబు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంథరిస్: తరచూ మూత్రంలో మంట వల్ల తీవ్రమైన జ్వరం (హై ఫీవర్), విపరీతమైన కోపం, చలిజ్వరం, మూత్రంలో మంటరావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడాలి. మందు తీసుకున్న నాలుగు గంటల్లో జ్వరం తగ్గుతుంది. చైనా: మాటిమాటికీ చలిజ్వరం , సాయంకాలం జ్వరం, అన్ని విషయాలపై అసంతృప్తిగా ఉండటం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో నాలుగు వారాలు వాడటం వల్ల జ్వరం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది. బాప్టీషియా: లోజ్వరం, దీర్ఘకాలం జ్వరం కొనసాగడం వల్ల రక్తం విషపూరితం కావడం, దాహం తక్కువగా ఉండటం, చెమట వాసనతో ఉండటం లాంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు. ఆర్సినిక్ ఆల్బమ్: చలిజ్వరం, అతి దాహం, జ్వరం వచ్చినప్పుడు నిద్రలేకపోవడం, అర్ధరాత్రి నిద్రలేవడం, జ్వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవడం, భయపడటం, అభద్రతా భావం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉదయం-సాయంకాలం ఒక డోసు వాడితే జ్వరం తగ్గిపోతుంది. రస్టాక్స్: జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, నాలుక తడారిపోవడం, చలి ఎక్కువగా ఉండటం, నిద్రలేకపోవడం వంటి లక్షణాలకు ఈ మందును 200 పొటెన్సీలో ఒక్క డోసు వాడాలి. స్పంజియా: తరచూ జలుబు, పసుపు రంగులో గల్ల (కళ్లె) పడటం, ఉదయం దగ్గురావడం, వేడిని తట్టుకోలేకపోవడం, జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, దగ్గుతో తెమడ పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో రోజుకు రెండుసార్లు వాడవచ్చు. సిలిసియా: ముక్కులు బిగుసుకుపోవడం, చలిగా ఉండటం, ఒళ్లంతా వణుకుతో జ్వరం, కాళ్లూ-చేతులు చల్లబడటం, ఎక్కువ చెమట వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. పల్సటిల్లా: రోజు విడిచి రోజు జ్వరం రావడం, చలి తర్వాత వేడిగా అనిపించడం, దాహం లేకపోవడం, జలుబు వల్ల వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి శారీరక లక్షణాలతో పాటు సున్నిత స్వభావం కలిగి ఉండటం వంటి లక్షణాలు న్నవారికి ఈ మందును 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు. కాలీ సల్ఫ్: రాత్రివేళల్లో తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) రావడం, తరచూ జ్వరం తిరగబెడుతుండటం, నాలుక పసుపురంగులో ఉండటం, త్వరగా కోపం రావడం, చిరాకుగా ఉండటం, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో వారం రోజుల పాటు వాడాలి. అలోయేస్: నీళ్ల విరేచనాలతో జ్వరం రావడంతో పాటు వేడిని తట్టుకోలేకపోవడం, అందరిపై ఆధిపత్యధోరణి వంటి లక్షణాలు కలిగి ఉన్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో పై లక్షణాలతో జ్వరం వస్తే ఇది చాలా మంచి మందు. పోడోఫిల్లమ్: దాహం తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం, విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉండటం, ఫుడ్‌పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది. కోలోసింథిస్: కడుపునొప్పి రావడం, విరేచనాలు కావడం, ఏది తిన్నా /తాగినా విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. జలుబు నక్స్‌వామికా: తరచూ వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన విసుగు, చలిని తట్టుకోలేకపోవడం కనిపిస్తే నక్స్‌వామికా 30 పొటెన్సీలో తీసుకోండి. ఆర్సెనికమ్ ఆల్బమ్: తరచూ విపరీతంగా తుమ్ములు వస్తూ, దుమ్మూ-ధూళికి గురికాగానే అవి మరింత ఎక్కువ కావడం, అతిశుభ్రత, నిత్యం అపనమ్మకంతో పాటు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వంటి లక్షణాలుంటే 30 పొటెన్సీలో తీసుకోవాలి. బొవిస్టా: విపరీతమైన తుమ్ములు, జ్వరం వచ్చినట్లుగా ఉండటం, ఏ పనిపైనా ధ్యాస లేకపోవడం, కొంచెం అమాయకత్వం, వేడిని తట్టుకోలేకపోవడం, దాహం తక్కువగా ఉండటం లాంటి లక్షణాలుంటే దీన్ని 30 పొటెన్సీలో వాడుకోవచ్చు. సిలిసియా: జలుబు వల్ల తల బరువుగా ఉండటం, గళ్ల (కళ్లె) పసుపురంగులో పడటం, పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపే గుణం ఉండటం, మొహమాటం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. అల్లియమ్ సెపా: విపరీతమైన తుమ్ములతో పాటు కళ్ల నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం, తలనొప్పిగా ఉండటం, దగ్గు రావడం వంటి సమస్యలుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. తలనొప్పి నేట్రమ్ మూర్: ఎండలో ఎక్కువగా తిరిగితే వచ్చే తలనొప్పికి ఈ మందును వాడవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో పాటు ప్రతి చిన్న విషయానికీ కోపం రావడం, తలనొప్పి వల్ల ముఖం ఎర్రగా మారడం వంటి లక్షణాలున్నవారికి ఇది మంచి మందు. స్పైజీలియా: తలనొప్పి వల్ల కళ్లనొప్పి కూడా రావడం, కళ్లు బరువుగా అనిపించడం, జ్వరం రావడం, సూది మందుకు త్వరగా భయపడటం, ఎడమవైపు నొప్పి, ఎండలో తలనొప్పి, మైగ్రేన్ వంటి తలనొప్పికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. బ్రయోనియా ఆల్బ్: తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలపై సుత్తితో కొట్టిన భావన. చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. సాంగ్యునేరియా: కుడివైపు తలనొప్పి విపరీతంగా ఉండటం, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉంటూ, రాత్రివేళ తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు చక్కగా పనిచేస్తుంది. కడుపునొప్పి కడుపునొప్పి ఉన్నవారు, ఇతర లక్షణాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ మందులను వాడుకోవచ్చు. న్యాట్‌ఫాస్: కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎక్కువగా మసాలాలు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలతో పాటు మొహమాటం ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి మందు. నక్స్‌వామికా: మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన గ్యాస్ సమస్యకు ఇది మంచి మందు. కోపం ఎక్కువగా రావడం, టైమ్‌కు ఆహారం తీసుకోకపోవడం వంటి వారికి ఈ మందును 30 పొటెన్సీలో ఇవ్వడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. సీనా: కడుపులో నులిపురుగులు (వార్మ్స్ ఉండటం వల్ల వచ్చిన కడుపునొప్పికి ఇది మంచి మందు. కోపంతో ఉండే స్వభావం ఉన్నవారికి దీన్ని సూచించాలి. కొలోసింథ్: మహిళల్లో రుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. విపరీతమైన కడుపునొప్పితో పాటు, రక్తస్రావం ఎక్కువగా కనిపించేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వడదెబ్బ వేసవిలో వడదెబ్బ చాలా తరచూ కనిపించే సమస్య. దీనికోసం మందులివే... గ్లోనైన్: వేడిని తట్టుకోలేకపోవడం, రక్తపోటు ఎక్కువ కావడం, తలనొప్పిగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్రమ్ మూర్: వడదెబ్బకు లోనైన ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత లక్షణాలను సరిచూసుకుని ఈ మందువాడాలి. అవి... ఎవరితోనూ ఎక్కువగా మాటలాడకపోవడం, పనులపైనా ఎప్పుడూ అసంతృప్తితో ఉండటం, నీరసంగా ఉండటం, తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం వంటి సమస్యలున్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. జెల్సీమియమ్: వేడిని తట్టుకోలేకపోవడం, అతి భయం, అన్ని విషయాలకూ ఆతృత పడటం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం... వంటి లక్షణాలు ఉంటే ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్-కార్బ్: ఎండలోకి వెళ్తే దద్దుర్లలా కనిపించడం, కళ్లు తిరగడం, వాంతులు రావడం, ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. ఓపియమ్: అతిసున్నితత్వం, ఏ విషయంపైనైనా త్వరగా స్పందించడం వంటి లక్షణాలున్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో పాటు... ఎండలోకి వెళ్లి తిరిగి రాగానే నీరసంగా ఉండటం, అతినిద్ర, త్వరగా అలసిపోవడం, ఊబకాయం ఉన్నవారికి వడదెబ్బ రాకుండా నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. దీన్ని 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంఫర్: ఎండలోకి వెళ్లగానే కళ్లు తిరగడం, శరీరం, చేతులూ చల్లబడటం, చలికాలంలో హుషారుగా ఉండి, వేసవిలో నీరసంగా ఉండటం వంటి లక్షణాలుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. చర్మంపై కనిపించే అలర్జీలు కొందరికి పడని వస్తువులు తారసిల్లిన వెంటనే దాని గుణం చర్మంపై ప్రతిఫలిస్తుంది. అప్పుడు వాడాల్సిన మందులివి... సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది మంచి మందు. అకస్మాత్తుగా ఒంటిపై దద్దుర్లు రావడం, ఆర్టికేరియా ర్యాష్, దద్దుర్లు పెద్దవి కావడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి తీసుకోవాలి. నేట్-మూర్: ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. డల్కమారా: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. దద్దుర్లు పెద్దగా ఉండటం, వర్షంలో తడిసిన తర్వాత దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. గ్రాఫైటిస్: గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. త్వరగా ఏడ్వటం, సున్నితమైన స్వభావం, లావుగా ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. హెపార్ సల్ఫ్: చలికి తట్టుకోలేకపోవడం, దురద ఎక్కువగా ఉండటంతో పాటు దద్దుర్లు రావడం, తొందరపాటు ఎక్కువగా ఉండటం, విపరీతమైన కోపం రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది మంచి మందు. ఏయే దేశాల్లో ఉంది? ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రత్యామ్నాయ ఔషధంగా హోమియోవైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాలల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉంటోంది. అందులో ఫ్రాన్స్‌ది మొదటిస్థానం. ఇంగ్లండ్ రాజకుటుంబం హోమియోవైద్యాన్ని కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. పొటెన్సీ అంటే... హోమియో మందుల మోతాదును పొటెన్సీ అనే ప్రమాణం ద్వారా నిర్ణయిస్తారు. హోమియో మందుల్లో ఉన్న సామర్థ్యానికి (పవర్‌కు) పొటెన్సీ అన్నది ఒక సూచిక. హోమియో మందులో ప్రతి మందుకూ ఒక అత్యద్భుత శక్తి (డైనమిక్ పవర్) ఉంటుంది. ఏ జబ్బు తీవ్రతకు ఎంత మేరకు శక్తి కలిగిన మందు ఇవ్వాలన్నది హోమియో వైద్యులు నిర్ణయిస్తారు. జబ్బు తీవ్రతను బట్టి 200, 30, 1ఎమ్ అనే పొటెన్సీల్లో (మోతాదుల్లో) మందులు ఇస్తారు. రోగి చేయాల్సిన పథ్యం... హోమియో మందులు తీసుకునే వారు ఎలాంటి పథ్యాన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే రోగికి వచ్చిన జబ్బును బట్టి అతడిలోని వ్యాధిని తొలగించడానికి ఇచ్చే మందు ఒక అంతర్గత శక్తిలా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి ఆహారాలూ అవరోధించలేవు. కాబట్టి హోమియో మందులకు ఎలాంటి పథ్యనియమాలూ పాటించాల్సిన అవసరం లేదు. హోమియో మందులు ఎలా పనిచేస్తాయి? హోమియో మందు ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోడానికి హానీమన్ అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే చాలు. సింకోనా అనే మొక్క బెరడును తింటే వాంతులు అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని హనీమన్ పరిశీలించారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి హనీమన్ చాలా కొద్ది మోతాదులో సింకోనా బెరడును ఇచ్చారు. తత్ఫలితంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ వ్యక్తికి చలిజ్వరం తగ్గింది. ఏదైనా జబ్బుకు కారణమయ్యే అంశాన్ని చాలా కొద్ది మోతాదుల్లో ఇస్తే ఆ జబ్బు తగ్గుతుందనేది హోమియో ప్రధాన సిద్ధాంతం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని హానీమన్ ఎన్నో మొక్కలనుంచి, జంతువులనుంచి ఔషధగుణాలున్న రసాయనాలను సేకరించారు. అలాగే ఖనిజ లవణాలనుంచీ స్వీకరించి పరిశీలించారు. అలా ఎన్నో జబ్బులకు మందులను రూపొందించారు. కాబట్టి స్థూలంగా మనకు కనిపించే చక్కెర గోలీలు, వాహికగా పనిచే ఆల్కహాల్ ఒకటే అయినా... అందులో కలిపే మందు మాత్రం వేర్వేరుగా ఉంటుంది. హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు! హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. తరచూ అభిప్రాయాలు మారడం ఇందులో ఉండదు. హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం. హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం. హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహమంతటినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మందులతో ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు, పైగా వీటిని ఎన్ని రోజులు వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పని సరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు. కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియోమందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలనూ దేహంలో వదలవు. ఈ శాస్త్రం గురించి నిపుణులు రాసిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా అర్థమయ్యేరీతిలో రాసినవే ఇవన్నీ. త్వరగా తగ్గే అవకాశాలూ ఉంటాయి... సాధారణంగా హోమియో మందులు చాలా ఆలస్యంగా తమ ఫలితాలను కనబరుస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంతవరకూ ఇది నిజమే అయినా హోమియో చికిత్స ద్వారా కొన్ని వ్యాధుల విషయంలో చాలా త్వరగా గుణం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఈ ఆలస్యం జరగడానికి కారణం... చాలామంది చాలాకాలం పాటు అనేక వైద్య విధానాలను ప్రయత్నించి రోగాన్ని ముదరబెట్టుకుని, అప్పుడు హోమియో విధానానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో జబ్బు నయం కావడంలో ఆలస్యం జరగడం మామూలే. వ్యాధి అంతగా ముదరకముందే వస్తే నయం కావడం కూడా త్వరగానే జరుగుతుంది. జబ్బు దానంతట అదే నయం అయ్యిదంటే కాస్త ఆలోచించాల్సిందే... కొన్ని జబ్బులు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గుతాయని ఇంగ్లిష్ విధానంలో డాక్టర్లు చెబుతుంటారు. కానీ హోమియో విధానం ప్రకారం అది పూర్తిగా వాస్తవం కాదు. ఉదాహరణకు చిన్నప్పుడు వచ్చే ఉబ్బసం (ఆస్తమా) కొందరిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఇంగ్లిష్ మందుల ప్రక్రియలో చెబుతుంటారు. కానీ హోమియో వైద్య విధానం ప్రకారం అది తగ్గకుండా ఇంకొక అంచెకు చేరుకుంటుంది. అంటే... అది గ్యాస్ట్రిక్ సమస్యగానో లేదా హార్మోన్ల అసమతౌల్యతకో దారితీయవచ్చు. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది పూర్తిగా తొలగిపోయేలా చికిత్స జరగాలి. అందుకే హోమియో విధానంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు. వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి జబ్బు తగ్గేలా చేయడం కంటే... అసలు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి జబ్బులన్నవే మటుమాయం అయ్యేలా చేసే ప్రక్రియే హోమియో. హోమియో సమర్థంగా తగ్గించిన వ్యాధులివి... ట్యూబర్క్యులోసిస్, సిఫిలిస్, గనేరియా, సోరా (స్కేబిస్), క్యాన్సర్, కుష్టువ్యాధులను హోమియో మందులతో సమూలంగా తగ్గించవచ్చు. 19వ శతాబ్దంలో కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఇతర మందులతో నియంత్రించలేని దశలో హోమియో మందులతో తగ్గాయి. హోమియో - అపోహలు - వాస్తవాలు అపోహ: హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి. జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు పనిచేయవు. వాస్తవం: హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులను, స్వల్పకాలిక వ్యాధులను రెండింటినీ నయం చేస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, అతిసార వంటి వ్యాధులను సమర్థంగా నయం చేస్తుంది. అపోహ: హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి. వాస్తవం: స్వల్పకాలిక అనారోగ్యాలకు తక్షణ చర్య ఉండేలా, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతోనూ మందులను రూపొందిస్తారు. ఆస్థ్మా, బ్రాంకైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆస్టియోపోరోసిస్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరు తెలియడానికి కొంత కాలం పట్టే మాట నిజమే. ఇది కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికీ మారుతుంది. వారి వారి వ్యాధి నిరోధక శక్తి, ఒత్తిడిని తట్టుకునేస్థాయి, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు వంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అపోహ: హోమియోపతి మందుల తయారీలో స్టెరాయిడ్స్ వాడతారు. వాస్తవం: హోమియోపతి మందులను మొక్కలు, జంతువుల నుంచి సేకరించిన సహజమైన పదార్థాలు, ఖనిజాలతో తయారు చేస్తారు. మొక్కలలో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల సత్ఫలితాలే తప్ప ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవని నిర్ధారణ అయింది. అపోహ: గర్భిణులకు హోమియో మందుల వల్ల హాని కలుగుతుంది. వాస్తవం: హోమియోపతి మందులు గర్భిణికి చక్కటి ఔషధం అని చెప్పాలి. అల్లోపతి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే వారికి చక్కటి ప్రత్యామ్నాయం హోమియో మందులే. గర్భిణిలో తల తిరగడం, రక్తహీనత, వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం, వేవిళ్లు, గుండెలో మంట, అతిసార, రక్తపోటు, ఆందోళన, ఉద్వేగానికి లోనుకావడం వంటి సమస్యలకు హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా హోమియో మందుల వాడకం శ్రేయస్కరమే. అపోహ: హోమియో చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రక్రియలు ఉండవు, కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులకు హోమియోమందుల వల్ల ప్రయోజనం ఉండదు. వాస్తవం: హోమియో మందులతో క్యాన్సర్‌ని సమర్థంగా నిర్మూలించిన సంఘటనలు అనేకం. క్యాన్సర్ రావడానికి మూలకారణాన్ని తెలుసుకుని, ఆ కారణానికి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది. అపోహ: ఇన్ఫెక్షన్ తగ్గాలంటే యాంటీ బయాటిక్స్ తప్ప మరో మార్గం లేదు. వాస్తవం: యాంటీ బయాటిక్స్ ఇన్ఫెక్షన్ని అణచివేస్తాయి, ఈ ప్రక్రియలో వ్యాధి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం జరగదు. వ్యాధి కారక మైక్రోబ్స్‌ను చంపకపోగా వ్యాధి లక్షణాలు అణచివేయబడతాయి. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం, వికారం, అతిసార వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. హోమియో మందులు వ్యాధి కారక క్రిములను నిర్మూలించడంతోపాటు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఒకసారి హోమియో కోర్సు తీసుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ రావడానికి అవకాశాలు తక్కువ. అపోహ: హోమియోపతిలో మందులంటే చక్కెర గుళికలు మాత్రమే. వాస్తవం: హోమియోలోని చక్కెర గుళికలు మందును ఇముడ్చుకున్న రూపాలు మాత్రమే. హోమియో మందులలో మూడు వేల రకాల సమీకరణలుంటాయి. వ్యాధిని బట్టి ఏయే ఔషధాలను ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఆ మందును చక్కెర, పిండి పదార్థంతో కలిపి గుళికలుగా చేస్తారు. అపోహ: హోమియోపతిలో చక్కెర గుళికల మందులు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కాదు. వాస్తవం: హోమియో మందుల తయారీలో ఉపయోగించేది లాక్టోజ్ తియ్యదనమే, ఇందులో గ్లూకోజ్ ఉండదు. పైగా ఇందులో ఉండే చక్కెర అతి తక్కువ కాబట్టి ఇది రక్తంలో షుగర్‌లెవెల్స్ మీద ప్రభావం చూపదు. హోమియో వైద్యవిధానంలో ప్యాంక్రియాస్ గ్రంథిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే స్థితికి తీసుకురావడం సాధ్యమే. దీని ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. అపోహ: హోమియో మందులు వాడుతున్న కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీలను మానేయాల్సి ఉంటుంది. వాస్తవం: హోమియో మందు వేసుకోవడానికి 15 నిమిషాల ముందు, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే నియమం ఉంటుంది. అంతే తప్ప ఏదీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో పరిమితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అపోహ: హోమియో వైద్యంలో ఎటువంటి పరీక్షలు చేయకనే వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వాస్తవం: హోమియో వైద్యంలో సాధారణంగా రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మందును నిర్ధారణ చేస్తారు. ప్రతి చిన్న అనారోగ్యానికీ పరీక్షలు చేయించి నిర్ధారణ చేయడం ఉండదు. కానీ కొన్ని రోగాలకు రోగ తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయిస్తారు. హోమియో సిద్ధాంతాలూ... విధానాలు హోమియో వైద్యుడికి ఉన్న ఏకైక, అతి ముఖ్యమైన లక్ష్యం రోగిని అస్వస్థత నుంచి దూరం చేసి అతడికి పూర్తి ఆరోగ్యాన్ని అందించడమే... హోమియోపతి డాక్టర్లందరికీ హనీమన్ చెప్పిన మొదటి సూత్రం ఇది. ‘ఆర్గనాన్ మెడిసిన్’ అనే పుస్తకం ద్వారా హోమియోపతి వైద్య విధానంలోని సిద్ధాంతాలను వివరించారు. అందులోని సిద్ధాంతాలను ‘అఫోరిజమ్స్’ అంటారు. తొలి సిద్ధాంతం (అఫోరిజమ్) రోగికి ఒక జబ్బుకోసం మందు ఇస్తే... అది ఆ జబ్బును అణిచివేయవచ్చు. కానీ అది మరికొన్ని రుగ్మతలకు దారి తీసే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మందు తీసుకోవడం అంటే మరికొన్ని జబ్బులను ఆహ్వానించడం లాంటిదే. అందుకే ఈ ఆధునిక సమాజం ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తోంది. ఒక జబ్బుకు మందు వేయడం వల్ల అది మరో స్థాయి (నెక్ట్స్ లెవెల్)కి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. ఉదాహరణకు చర్మ వ్యాధులను ఆయింట్మెంట్ ద్వారా అణచివేస్తే అది శ్వాసకోశ వ్యాధులకూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులకూ, హార్మోన్ల స్థాయుల మార్పులకూ దారితీయవచ్చు. ఈ జబ్బులు వంశపారంపర్యమూ రావచ్చు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల వల్ల ఈ పరిణామాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ హోమియోపతి వైద్యవిధానం ద్వారా మనిషిలోని జబ్బును తగ్గించడం కంటే పూర్ణారోగ్యాన్ని బాగు చేయడానికి కృషి జరుగుతుంది. ఫలితంగా జబ్బూ తగ్గుతుంది. దాంతో అప్పటివరకూ ఉన్న ఆ వ్యాధితో పాటు దాని అనుబంధ వ్యాధులన్నింటినీ హోమియో నిర్మూలిస్తుంది. ఈ సిద్ధాంతాన్నే ‘సిమిలియా నిమిలిబస్ క్యూరెంటర్’ అంటారు. మనిషి తాలూకు వ్యాధి నిరోధకశక్తిని బాగు చేయడం వల్ల ఇలా అతడి ఆరోగ్యాన్ని కాపాడి, అతడు ఎల్లప్పుడూ పూర్తిగా ఫిట్‌గా ఉండేలా చేయవచ్చు. ఔషధం ఎంపిక ఇలా... మనిషిలోని వ్యాధి నిరోధక తత్వాన్ని ప్రేరేపించి, అతడు అన్ని జబ్బులకూ అతీతుడయ్యేలా చేయడానికి అతడి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మందు ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియనే ‘రిపార్టరైజేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఔషధాన్ని ఎంపిక చేయాలంటే మనిషి అన్ని లక్షణాలనూ, గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియను ‘కాన్స్టిట్యూషన్’ పద్ధతి అంటారు. ఏ మందు, ఏ కాన్‌స్టిట్యూషన్స్‌తో జతపడుతోంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా మందుకూ, కాన్‌స్టిట్యూషన్స్‌కూ లంకె కుదిరేలా పరిశీలించడాన్ని ‘సిమిలియమ్’ అంటారు. ఈ సిమిలియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రోగికి మళ్లీ జబ్బు రాకుండానూ, అదే సమయంలో అతడి వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర జబ్బులకు దారి తీయకుండానూ కాపాడవచ్చు. ఉదాహరణకు టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బులు. ఈ జబ్బుల విషయంలో ఇంగ్లిష్ మందుల రూపంలో ఉపయోగించే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తొలి దశలో జబ్బు తగ్గినా, వ్యాధి కారక క్రిములు ఆ యాంటీబయాటిక్ పట్ల నిరోధాన్ని (రెసిస్టెన్స్‌ను) పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల అసలా జబ్బు తగ్గకపోవచ్చు కూడా. కానీ హోమియోపతి వైద్య విధానం ప్రకారం కచ్చితమైన డ్రగ్ ఇవ్వడం వల్ల జబ్బు తగ్గి మళ్లీ రాకుండా చేయవచ్చు. అంతేకాదు అతి తక్కువ మోతాదులతో, నొప్పి లేని మందులు ఇవ్వడం అన్నది హోమియో విధానం తాలూకు ప్రత్యేకత. ఈ విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హనీమన్ సూచించారు. అందుకే అతి తక్కువ మోతాదులో శరీరంలోని జన్యుస్థాయికి వెళ్లి హోమియో మందులు పనిచేస్తాయి. వ్యక్తి తాలూకు మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకుని హోమియో విధానంలో మందును ఎంపిక చేయడం ఎందుకు జరుగుతుందంటే... శరీరంలో ‘మైండ్’ అన్నది కూడా ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడ నుంచి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచే కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగవిముక్తి జరగాలన్నది హోమియో విధానం సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు? ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే... అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలనూ శరీరం నుంచి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఈ ప్రక్రియతో సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ (సైడ్ఎఫెక్ట్స్) కలగవు. ప్రయాణాల్లో హోమియో... తరచూ ప్రయాణం చేసేవారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచూ ప్రయాణాలు చేసేవారు లేదా వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ కింది మందులను తమ వద్ద ఉంచుకోవడం వాళ్లకెంతో మేలు చేస్తుంది. కాకులస్ ఇండికస్: ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారూ, ప్రయాణం తర్వాత తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు... 200 పొటెన్సీలో ఈ మందు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నక్స్ వామికా: ప్రయాణాల్లో వచ్చే ఉదర సంబంధమైన సమస్యలకు ఇది మంచి మందు. ప్రయాణ సమయాల్లో దీన్ని 30 పొటెన్సీలో వరసగా మూడు రోజులు తీసుకోవడం మేలు. ఆర్జంటమ్-నైట్రికం: ప్రయాణం అంటే అతిగా భయపడేవారు, ప్రయాణాల్లో అతి జాగ్రత్త పాటిస్తూ బాధపడేవారికి ఈ మందు ఇవ్వవచ్చు. పెట్రోలియమ్: తరచూ కార్లలో ప్రయాణం చేసేవారికి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దీన్ని 200 పొటెన్సీలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పోడో ఫిల్లమ్: తరచూ ప్రయాణాలు చేసేవారికి విరేచనాలూ, కడుపునొప్పి కనిపిస్తే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును గంటలకోసారి చొప్పున తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణతులు, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల, మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ నొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. పార్శ్వపు తలనొప్పికి కారణాలు పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు. మైగ్రేన్ దశలు - లక్షణాలు సాధారణంగా 24 - 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది. ప్రొడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. ఆరా ఫేజ్: ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి. నొప్పిదశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సెన్సిటివ్‌గా అంటే చికాగ్గా అనిపిస్తుంది. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణ : రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్ఆర్ రక్తపోటును గమనించడం ఈఈజీ పరీక్ష సిటీ స్కాన్ (మెదడు) ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి. మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మానసిక ఆందోళనలు తగ్గించాలి. అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు రిలాక్సవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక ph: 7416107107 / 7416 102 102 www.starhomeo.com Email : info@starhomeopathy.com హోమియో వైద్యం మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులున్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నిషియా ఇవ్వాలి. తరచు ఎక్కువగా వస్తుంటే - నాట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నాట్రంమూర్, ట్యూబర్కిలినమ్. ప్రయాణాల వల్ల వస్తే - ఇగ్నిషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే - కాల్కేరియాఫాస్, నాట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. వాటిని నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. -
హోమియో వైద్యంతో పార్శ్వపు నొప్పి మాయం
ప్రతి వంద మందిలో 15 నుండి 20 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పార్శ ్వపు నొప్పితో (Migraine) బాధ పడుతున్నారా అని తెలుసుకోవటం ఎలా =నెలలో 5 కంటే ఎక్కువసార్లు తలనొప్పి రావటం =తలనొప్పి 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది =కనీసం రెండు సార్లు అయినా తలలో ఏదో ఒక వైపు నొప్పి రావటం =వాంతులు అవటం, శబ్దం లేక వెలుతురు భరించలేకపోవటం వంటి లక్షణాలు తలనొప్పితో పాటు కానీ తలనొప్పి ముందు కానీ ఉండడటం =AURAతో కూడిన తలనొప్పి- అంటే... తలనొప్పి వచ్చే ముందు... కళ్లు మసకబారటం, కళ్ల ముందు వెలుతురు కనిపించటం, మెరుపులు ప్రకాశవంతమైన జ్యోతుల లాంటివి కనిపించటం మొదలగు లక్షణాలను కలిపి అ్ఖఖఅ అని అంటారు. పార్శ్వపు నొప్పి అనగా చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం మరియు ఏదో ఒక వైపు తలనొప్పి రావటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇది మెడ వెనుక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసక బారటం, తల తిరగటం వంటి లక్షణాలతో తలనొప్పి వస్తుంది. కడుపులో వికారంగా ఉండటం లేదా వాంతులు కావటం వంటి లక్షణాలు పార్శ్వపునొప్పిలో సాధారణం. పార్శ్వపు నొప్పికి కారణమైన నిర్దిష్టమైన జీవప్రక్రియ వ్యవస్థ గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావటం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. పార్శ్వపు నొప్పి రావటానికి గల కారణాలు =శారీరక మరియు మానసిక ఒత్తిడి =నిద్ర లేకపోవటం =ఎక్కువసేపు ఆకలిగా ఉండటం మరియు సమయానికి భోజనం చేయక పోవటం =స్త్రీలలో హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెలసరి సమయంలోను, గర్భిణీ స్త్రీలలోను మరియు మెనోపాజ్ సమయంలో చూస్తూ ఉంటాము =అతి వెలుగు, గట్టి శబ్దాలు మరియు ఘాటైన సువాసనలు పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు =పొగతాగటం లేదా ఇంట్లో పొగతాగే వారుండటం =మద్యం సేవించటం లేదా ఇతర మత్తు పదార్థాలు కూడా పార్శ్వపునొప్పికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని రాకుండా చేయటం లేదా అదుపులో ఉంచటం చేయవచ్చు. లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలా రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. =పార్శ్వపునొప్పి వచ్చే ముందు కనిపించే లక్షణాలు (PRODROME & AURA) ఈ లక్షణాలు పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. =చిరాకు, నీరసం, అలసట, నిరుత్సాహం. =కొన్ని రకాల తినుబండారాలను ఎక్కువగా ఇష్టపడటం =వెలుతురు మరియు శబ్దాన్ని తట్టుకోలేకపోవటం =కళ్లు మసక బారటం, కళ్ల ముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించటం జరుగవచ్చు. వీటినే అ్ఖఖఅ అంటారు. 2. పార్శ్వపు నొప్పి సమయంలో వచ్చే లక్షణాలు (paInphase) =సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి =తలలో ఒక వైపు ఎక్కువగా తలనొప్పి ఉండటం =పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవటం =నొప్పి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు ఉండవచ్చు. =కడుపులో వికారం లేదా వాంతులు అవటం 3. పార్శ్వపునొప్పి వచ్చిన తరువాత లక్షణాలు =చిరాకు ఎక్కువగా ఉండటం నీరసంగా ఉండటం =వికారం, వాంతులు, విరోచనాలు కావటం హోమియో కేర్ ఇంటర్ నేషనల్ నందు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా మరియు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతనే కాకుండా పార్శ్వపునొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని మరియు వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్కే సొంతం. రోగ నిర్థారణ పరీక్షలు పార్శ్వపునొప్పిని నిర్థారించుకోవటానికి ఖచ్చితమైన రోగనిర్థారణ పరీక్షలు లేవు. రోగ లక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్థారించటం జరుగుతుంది. ఈసీజీ, సీటీ-బ్రెయిన్, ఎమ్మారై-బ్రెయిన్ మొదలగు పరీక్షలు చేయటం ద్వారా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు లేవని నిర్థారించుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్థారించుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
సర్వైకల్ స్పాండిలోసిస్... సులభ వైద్యం
సర్వైకల్ స్పాండిలోసిస్ ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఇది ప్రధానంగా వృత్తిపరమైన రుగ్మత (ఆక్యుపేషనల్ హజార్డ్). ఇటీవల ఈ సమస్య తరచూ ద్విచక్రవాహనాలు నడిపేవారిలో, కదలకుండా కంప్యూటర్ ముందుగాని, డెస్క్‌లో గాని ఎక్కువగా కూర్చుని ఉండేవారిలో ఈ డిస్క్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ పెద్దగా లేని వారిలో కూడా ఈ సమస్యలు చాలా తరచుగా గమనించవచ్చు. ఈ తరహా సమస్యలు అందరిలో కనిపిస్తున్నా స్త్రీలతో పోలిస్తే ఇవి పురుషుల్లోనే ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలలో మార్పులు రావడం అన్నది చాలా సాధారణంగా జరిగే స్వాభావిక మార్పు. అయితే ఈ మార్పుల కారణంగా డిస్క్‌ల మధ్యన ఉండే నరాల మీద ఒత్తిడి పెరుగుగుతుంది. దాంతో ఒకవేళ ఇలాంటి మార్పులు మెడ దగ్గర ఉండే వెన్నెముకల మధ్య సంభవించినప్పుడు మెడ పట్టేసినట్లు ఉండటం, తలనొప్పి, కళ్లు తిరగడం, భజాలు, చేతుల నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాల మీద ఒత్తిడి వల్ల తలతిరగడం, నడకలో తేడా వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. కారణాలు: ఎముకలు, ఎముకల చివరన ఉండే కార్టిలేజ్ అరిగిపోవడంతో ఎముకలు ఎగుడుదిగుడుగా మారతాయి. దాంతో వాటి మధ్యన ఉండే నరాలపై ఒత్తిడి పడటం, అవి నలగడం జరుగుతుంది. ఫలితంగా మెడ వెనకభాగంలో నొప్పి, మెడ తిప్పలేకపోవడం, చేతులు లాగినట్లుగా ఉండటం, మెడ నుంచి చేతుల చివరి భాగం వరకు నొప్పి, తిమ్మిర్లు పాకినట్లుగా రావడం, పైకి చూస్తే కళ్లు తిరగడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. తూలినట్లుగా నడవటం, కొన్ని సందర్భాల్లో మల, మూత్రాలపై నియంత్రణ కోల్పోవడం జరగవచ్చు. చేయకూడని పనులు: పరుగెత్తడం, ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, నిటారుగా కూర్చోవడం, డ్రైవింగ్ వంటి పనులు చేయకూడదు. నివారణ: మెడ కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు చేయాలి. వృత్తిపరంగా డెస్క్ ముందు కూర్చునేవారు సరైన భంగిమల్లో కూర్చోవాలి. మానసికమైన ఒత్తిడులు తగ్గించుకోవాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకమారు లేచి నడవటం, కాస్త రిలాక్స్ కావడం మంచిది. చికిత్స: హోమియోలో కాల్కేరియా గ్రూపు మందులైన కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, బ్రయోనియా, స్పైజిలియా, హైపరికం, జెల్సీమినియం, రుస్టాక్స్, యాసిడ్‌ఫాస్ వంటి మందులను వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మానసిక, శారీరక స్వభావాలను, లక్షణాలను బట్టి వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్