మూడొచ్చినప్పుడు మాడులోనొప్పి... సెక్సువల్ హెడేక్! | In the Pain ... Sexual headache! | Sakshi
Sakshi News home page

మూడొచ్చినప్పుడు మాడులోనొప్పి... సెక్సువల్ హెడేక్!

Published Mon, Oct 19 2015 11:58 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

In the Pain ... Sexual headache!

మెడి క్షనరీ
మంచి మూడ్‌లో ఉన్నప్పుడు కొందరికి అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులను సెక్సువల్ హెడేక్స్ అంటారు. చాలా అరుదుగా వచ్చే ఈ తలనొప్పులు సెక్స్ సమయంలో వచ్చి బాధిస్తుంటాయి. ఈ తలనొప్పులను వైద్యపరిభాషలో ‘కాయిటల్ సెఫలాల్జియా’  అంటారు. మళ్లీ ఇందులో రెండు రకాలు ఉన్నాయి. తలనొప్పులను వర్గీకరించే ‘ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ డిజార్డర్’ (ఐసీహెచ్‌డీ) ప్రకారం... మళ్లీ ఈ తలనొప్పుల్లో రెండు రకాలు ఉన్నాయి. అది స్ఖలనం ముందు వచ్చే తలనొప్పి. దీన్ని ప్రీ-ఆర్గాజమిక్ హెడేక్ అంటారు. ఇక రెండోది స్ఖలనం అయ్యే సమయంలో వచ్చే తలనొప్పి. దీన్ని ఆర్గాజమిక్ హెడేక్ అంటారు.

చాలా సందర్భాల్లో ఇది దానంతట అదే తగ్గుతుంది. ఒకవేళ ఆ తలనొప్పి అదేపనిగా కొనసాగుతుంటే... డాక్టర్లు మరేదైనా కారణం వల్ల ... అంటే ఇంట్రాక్రేనియల్ అన్యురిజమ్స్ (తలలోని రక్తనాళాలు ఉబ్బడం) లేదా మెదడులోని రక్తనాళం ఏదైనా తెగడం వల్ల అంతర్గత రక్తస్రావం, గుండెజబ్బులు మొదలైన అనేక కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తున్నాయేమోనని డాక్టర్లు పరిశీలిస్తారు. అలాంటి సమస్యలేమీ లేకపోతే ఇది నిరపాయకరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement