వైద్యం పేరుతో దారుణం | Atrocity in the name of healing | Sakshi
Sakshi News home page

వైద్యం పేరుతో దారుణం

Published Wed, Aug 31 2016 12:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Atrocity in the name of healing

- గిరిజన విద్యార్థిపై ఆర్‌ఎంపీ లైంగికదాడి
- ఆపై వీడియో చిత్రీకరించి బెదిరింపులు
- నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..
 
 పెన్‌పహాడ్:
వైద్యులు దేవుళ్లతో సమానమంటారు.. పవిత్రమైన వైద్యవృత్తిలో కొనసాగుతున్న ఓ ఆర్‌ఎంపీ కామాంధుడిగా మారాడు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన గిరిజన విద్యార్థిపై కన్నేశాడు. వైద్యం పేరుతో ఆ అమాయకురాలికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.. ఆపై వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడి పలుమార్లు లైంగికదాడి చేశాడు. నల్లగొండ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..సూర్యాపేట పట్టణం నల్ల చెరువు తండాకు చెందిన గుండగాని వెంకన్న ఆర్‌ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని రెండు నెలల క్రితం అనారోగ్యం బారినపడడంతో కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీ వెంకన్నను సంప్రదించారు. వైద్యం చేస్తూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి వశపర్చుకున్నాడు. అనంతరం వీడియో చిత్రీకరించి చెప్పినట్టు వినకుంటే బయటపెడతానని బెదిరించాడు. ఆపై వైద్యం పేరుతో తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆ విద్యార్థినిని కొద్ది రోజులుగా తన బంధువులైన న్యూబంజార హిల్స్ తండాలో ఉంచారు. ఆర్‌ఎంపీ మంగళవారం అక్కడికి కూడా వెళ్లి సదరు బాలిక ను బైక్‌పై దురాజ్‌పల్లికి తీసుకెళుతుండగా బంధువులు వెంబడించారు. గమనించిన ఆర్‌ఎంపీ విద్యార్థినిని అక్కడే వదిలేసి పరారయ్యూడు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రరుుంచారు. డీఎస్పీ సునితామోహన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉప్పల జానయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement