తలకు రంధ్రం పొడిచి.. నెత్తురు తోడేస్తారు!
తలకు రంధ్రం పొడిచి.. నెత్తురు తోడేస్తారు!
Published Tue, Oct 4 2016 5:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
ఆధునిక వైద్యవిధానాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ చైనాకు చెందిన డాక్టర్ జాన్ ఝాంగ్.. వాషింగ్టన్ లోని ఓ ఆసుపత్రిలో ముగ్గురి డీఎన్ఏలతో శిశువుకు ప్రాణంపోశారనే వార్తలు ఇటీవలే విన్నాం.(ముగ్గురికి జన్మించిన బిడ్డ!) కాగా, ఆ డాక్టర్ గారి స్వదేశంలో మాత్రం ఇప్పటికీ పాత మోటు వైద్యవిధానాలనే అవలంబిస్తూ కొందరు ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఆశ్రయించిన ఓ వర్థమాన నటి.. కఠినమైన పద్ధతుల్ని తట్టుకోలేక ఊపిరి వదిలేసిన వార్త ఆ మధ్య చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.(వికటించిన వైద్యం.. వర్ధమాన నటి మృతి). ఇక ఈ ఫొటోలో మీరు చూస్తున్నది అలాంటి చైనీస్ మోటు వైద్యవిధానమే. ఇంతకీ ఆయనకొచ్చిన జబ్బేమిటంటే..
తలనొప్పి! అవును. మామూలు తలనొప్పి! రూపాయో, అర్ధరూపాయో ఖరీదుచేసే ట్యాబ్లెట్ కు తగ్గే తలనొప్పి! గరం చాయ్ తాగి కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గే తలనొప్పి! 'ఒకవేళ అతనిది మైగ్రేన్ అయినా కూడా చికిత్స చేసుకోవాల్సింది మాత్రం ఇలా కదు'అని నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్యుడు.. రోగి నుదుటన సూదిలాంటి పరికరంతో 'టప్' మని పంక్చర్ చేయగానే.. తలలో నుంచి ట్యాప్ తిప్పినట్లు రక్తం ధారలా కారుతుంది. అక్కడి నరాల్లో రక్తాన్ని బటికి పోవడం ద్వారా తలనొప్పి తగ్గిపోతుంది. ఈ విధానాన్ని 'వెని పంక్చర్'అని వ్యవహరిస్తారు. నేరుగా వెయిన్స్(నరాలు)లోని రక్తాన్ని బయటికి తీసే ఈ విధానం.. మనందరికీ తెలిసిన 'ఆక్యుపంక్చర్'(సూదులతో గుచ్చే వైద్యం)ను పోలిఉంటుంది. చేయాల్సిన నరానికి కాకుండా వేరేదానికి పంక్చర్ చేసినా.. పంక్చర్ గాయానికి ఇన్ ఫెక్షన్ సోకినా.. రోగిప్రాణాలకు భరోసాలేదీ విధానంలో. సోషల్ మీడియాలో చాలామంది చూసిన ఈ వీడియో మీకోసం..
Advertisement
Advertisement