ఒక ఫోన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది.. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక ట్యాబ్ అంటే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏకంగా 6.74 అడుగుల ఫోన్ ఒకటి వెలుగులోకి వచ్చేసింది. అంటే సగటు మనిషి ఎత్తుకంటే ఎక్కువే.
బ్రిటీష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ.. ప్రపంచములోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ రూపొందించారు. దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది. యితడు రూపొందిన ఫోన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్. దీని ఎత్తు 6.74 అడుగులు. ఈ ఫోన్ తయారు చేయడానికి మైనీ గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ 'మాథ్యూ పెర్క్స్'తో జతకట్టాడు.
ఇదీ చదవండి: రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్
ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ తయారీకి సంబంధించిన వీడియోను కూడా అరుణ్ రూపేష్ మైనీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో ఫోన్ తయారు చేయడానికి సంబంధించిన విషయాలను పూర్తిగా చూడవచ్చు. మొత్తానికి భారీ ఐఫోన్ రూపొందించేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ భారీ ఫోన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
This scaled-up version of an iPhone 15 Pro Max was created by @mrwhosetheboss and @DIYPerks 📱 pic.twitter.com/vqhjMqTA0S
— Guinness World Records (@GWR) September 6, 2024
Comments
Please login to add a commentAdd a comment