సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో రెగ్యులర్ కోటా సీట్ల ఖాళీల భర్తీ కోసం ఈనెల 18వ తేదీ నుంచి మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న స్పెషల్ కోటా మొదటి దశ కౌన్సెలింగ్ ఆదివారంతో పూర్తయింది. రెండు దశల్లో జరిగిన రెగ్యులర్ కోటా కౌన్సెలింగ్, అలాగే ఆదివారంతో పూర్తయిన మొదటి దశ స్పెషల్ కోటా కౌన్సెలింగ్ తర్వాత వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో సుమారు 213 ఖాళీలు ఏర్పడినట్లు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి.శివాజీ తెలిపారు.
బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్‌లో 80, బీవీఎస్సీ – 08, బీఎస్సీ (హానర్స్) హారి్టకల్చర్ – 70, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ – 40, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 15 సీట్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. 18 నుంచి జరిగే మూడో దశ కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సులలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రిజి్రస్టార్ తెలిపారు. మూడో దశ కౌన్సెలింగ్ షెడ్యూలు, కోర్సుల్లో ఖాళీలు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.pjtau.edu.in లో పొందవచ్చని ఆయన వివరించారు. మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవేశాల్లో దళారుల ప్రమేయం ఉండదని, వారి మాయ మాటలు నమ్మి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment