సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా క్లినికల్ సైకాలజీ(Clinical Psychology) కోర్సులు ప్రారంభమవుతున్నాయి. రెండేళ్ల వ్యవధితో ఎం.ఫిల్, ఏడాది వ్యవధితో ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడంతో పాటు వారు పూర్తిగా కోలుకోవడంలో క్లినికల్ సైకాలజిస్ట్‌లు కీలకపాత్ర వహిస్తారు. కాగా, ఈ కోర్సుల కోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్(Satyakumar Yadav)తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment