satyakumar
-
డయేరియా ఉంది..కానీ మరణాలకు కారణం కాదు..
సాక్షి, నరసరావుపేట/దాచేపల్లి: ప్రజాసమస్యలు వెలుగులోకి రాకుండా ఏదోవిధంగా మాయచేయాలనే కూటమి సర్కారు పెద్దల ప్రయత్నాలు దారుణంగా మారాయి. మరణాలకు కారణాలను కూడా మార్చి చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా ప్రబలి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా అబద్ధాలతో మోసం చేయాలని చూస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగరపంచాయతీ అంజనాపురం కాలనీలో డయేరియాతో బుధవారం రాత్రి ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ కాలనీలో ఇద్దరు డయేరియాతో మరణించలేదని శుక్రవారం అక్కడ పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కాలనీలో మరణించిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అనే యువకుడు కూల్‌డ్రింక్ తాగి వికటించి మరణించాడని, వృద్ధుడు చినవీరయ్య కిడ్నీ సమస్యతో బాధపడి చనిపోయాడని మంత్రి చెప్పారు. మరోవైపు అంజనాపురం కాలనీలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందన్నారు. 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు. డయేరియా కారణంగానే ఇద్దరు మరణించారని గురువారం గుర్తించిన అధికారులు.. శుక్రవారం మంత్రి మాట మార్చడంతో అవాక్కయ్యారు. వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడు..రోజూ కాలేజీకి వెళ్లే తమ కుమారుడికి అనారోగ్యం ఏమీ లేదని, వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడని మృతుడు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు కృష్ణంరాజు, శివకుమారి చెప్పారు. తమ బిడ్డ కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని మంత్రి సత్యకుమార్ చెప్పడం దారుణమని వారు శుక్రవారం మీడియా ముందు అవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలతో చనిపోతే కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని ఏలా చెబుతారని ప్రశ్నించారు. తమ ఇంటికి వచ్చి తమతో మాట్లాడకుండానే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. తమ కుమారుడు బుధవారం రాత్రి 9 గంటలకు వాంతులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విరేచనాలు కావటంతో నీరసించి కాళ్లు పట్టుకుపోయాయని చెప్పారు. నారాయణపురం ఆస్పత్రి నుంచి పిడుగురాళ్ల తీసుకెళితే ఆస్పత్రిలో చేర్చుకోలేదని, అక్కడినుంచి నరసరావుపేట వెళుతుండగా తమ కుమారుడు చనిపోయాడని కన్నీటితో తెలిపారు. కేవలం వాంతులు, విరేచనాల కారణంగానే తమ బిడ్డను పొగొట్టుకున్నామన్నారు. చికిత్సకి సంబంధించిన పేపర్లను తీసుకెళ్లిన అధికారులు వాటిని తిరిగి ఇవ్వలేదని తెలిపారు. చనిపోయిన తమ బిడ్డపై నిందలు వేయవద్దని, న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఇల్లు ఇస్తామని ఆశపెడుతున్నారు.. తన కుమారుడి చావును ప్రభుత్వం తప్పుదోవపట్టించి ఇంటిని నిర్మించి ఇస్తామని ఆశపెడుతున్నారని, తన బిడ్డ చావుకు న్యాయం కావాలని మీడియా ముందు కృష్ణంరాజు వాపోయిన వీడియో వైరల్ అవుతోంది. మృతుల ఇళ్లకు వెళ్లని మంత్రి ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్‌బాబుతో కలిసి కాలనీలో పర్యటించిన మంత్రి మృతుల ఇళ్లకు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ వైఫల్యంపై బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తారనే భయంతోనే వారి ఇళ్లకు వెళ్లలేదని తెలిసింది. మరణాలకు కారణాల గురించి తమను అడక్కుండానే మంత్రి ఇష్టం వచ్చినట్లు మీడియాతో వ్యాఖ్యానించి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన బోరుని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వ పాపాలే తమకు శాపాలుగా మారాయన్నారు. జగన్ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నట్లుగా డయేరియా మరణాలు సంభవించలేదని చెప్పారు. గత ఐదేళ్లలో 10,30,575 మంది అతిసారం బారినపడగా గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారవ్యాధి వ్యాప్తి చెందితే తాము ఒక్క మరణం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
మెడికల్ సీట్లు వదులుకోవడం హేయం
కాశీబుగ్గ: మెడికల్ సీట్లు వదులుకోవడం హేయమైన చర్య అని.. ఈ విషయంలో ఏకైక అత్యంత చెత్త ప్రభుత్వం చంద్రబాబుదేనని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు.చంద్రబాబు హామీలకు తాను గ్యారంటీ అన్న పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు గత సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారని, వాటిలో ఐదింటిని పూర్తి చేశారని గుర్తు చేశారు. ఫలితంగా 2023–24లో విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలో వైద్య కళాశాలలు ప్రారంభమై ఒకేసారి 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు.మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయి ఉంటే.. ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు సైతం ప్రారంభమై మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చి ఉండేవని అన్నారు. మరోవైపు ముందుగా నిర్దేశించుకున్నట్టు 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలలో ఏడు కాలేజీలు కూడా ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్లు దాదాపు 5వేలకు చేరేవన్నారు. -
సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోను గుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచానని, తనకే టికెట్ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. పైగా శ్రీరామ్, సూరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. టికెట్ విషయంలో పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. బల ప్రదర్శనకు కూడా సిద్ధ మయ్యారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గీ యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా బరి లో ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో కూ టమి భిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. యువగళంతో శ్రీరాంలో ఆశ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరదాపురం సూరి తన కాంట్రాక్టుల కారణంగా బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ తరఫున ధర్మవరం ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వచ్చారు. తొలి మూడేళ్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కేడర్‌ను బలోపేతం చేయడంలోనూ పరిటాల శ్రీరామ్ పూర్తిగా విఫలమైనట్లు చెబుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ బత్తలపల్లిలో శ్రీరామ్ చేయి పైకెత్తి గెలిపించాలని కోరడంతో ఆయనలో టికెట్ ఆశ మొదలైంది. అంతేకాకుండా రాప్తాడులో ఓడిపోయిన బాధతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించారు. మరోవైపు వరదాపురం సూరి చంద్ర బాబుతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు వదలకపోవడంతో ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే.. -
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. ఆదినారాయణపై కేసు నమోదు చేస్తాం: ఏఎస్పీ
సాక్షి, గుంటూరు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణపై కేసు నమోదు చేస్తామని ఏఎస్పీ అనిల్‌కుమార్ అన్నారు. ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ‘‘బహుజన పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యకుమార్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు ఉండబట్టే సమస్య వెంటనే సద్దుమణిగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించాం. సత్యకుమార్‌పై ఎలాంటి దాడి జరగలేదు’’ అని ఏఎస్పీ స్పష్టం చేశారు. కాగా, మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదవండి: ఎంత ఎబ్బెట్టుగా ఉందో.. ఇంతకీ లోకేష్ డైరీలో ఏముంది? -
మందడంలో బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి
సాక్షి, అమరావతి: మందడంలో బీజేపీ నేతలు వీరంగం సృష్టించారు. దీక్ష శిబిరం వద్ద దళితులపై బీజేపీ నేత సత్యకుమార్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సత్యకుమార్ అనుచరుల తీరుపై బహుజన పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యకుమార్ వాహనాన్ని అడ్డుకున్న బహుజన పరిరక్షణ సమితి నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహుజన పరిరక్షణ సమితి ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సత్యకుమార్ అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆడవాళ్లని చూడకుండా టెంట్లో నుంచి లాక్కొచ్చారన్నారు. బీజేపీ ముసుగులో టీడీపీ నాయకులు వచ్చి వీరంగం సృష్టించారని, ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వికేంద్రీకరణ మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఇదంతా చంద్రబాబు వెనుకుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ పిచ్చొడిలా మాట్లాడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. ‘‘సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు దీక్ష వద్దకు వచ్చి రెచ్చగొడుతున్నారు. సత్యకుమార్ అనుచరులు దళితులపై దాడి చేశారు’’ అని ఎంపీ సురేష్ నిప్పులు చెరిగారు. చదవండి: ఊహలే వార్తలా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
స్త్రీలోలుడిపై సీపీకి ఫిర్యాదు
*మరో ఇద్దరికి వల * యువకుడి రాసలీలలు *సీపీని కలిసిన బాధితులు విజయవాడ: ఒకరు మాజీ ప్రేమికురాలు.. మరొకరు భర్తను కాదని "సాంగత్యం' సాగిస్తున్న మహిళ.. తమతో కాకుండా మరో ఇద్దరితో అతడు ప్రేమాయణం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమను మోసం చేసిన వ్యక్తి మరో ఇద్దరి జీవితాలతో ఆటాడుకోవడానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతే మహిళా సంఘాలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. తమను మోసగిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తానని మహిళలకు పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని మల్లికార్జునపేటకు చెందిన సత్యకుమార్ దుర్గగుడిపై అమ్మవారి ఫొటోలు విక్రయిస్తుంటాడు. అదే ప్రాంతంలో అమ్మవారి ఫొటో ఫ్రేములు కట్టే వ్యక్తితో ఉన్న పరిచయం ఆధారంగా తరచూ అతను.. వారింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతని భార్యపై కన్నేశాడు. ఒకసారి భర్త లేని సమయంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆపై ఆమెను ఇతర ప్రాంతాలకు తిప్పి తన కోరికలు తీర్చుకున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో యువతితో ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా, మరొకరిని వివాహం చేసుకుంది. ఆమె భర్తకు విషయం చెప్పి కాపురాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత ఆమెతో కూడా ప్రేమను పంచుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ తన వాంఛ తీర్చుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఫ్రేములు కట్టే వ్యక్తి భార్యతో ఊరెళ్లి కొద్దిరోజులు గడిపిన తర్వాత తీసుకొచ్చి విజయవాడలో వదిలేశాడు. ఈ విషయం కాస్తా ప్రస్తుతం కాపురం చేస్తున్న మాజీ ప్రేమికురాలికి తెలిసి సత్యకుమార్‌ను నిలదీయగా.. చంపుతానని బెదిరించాడు. చేతనైంది చేసుకొమ్మన్నాడు. ఇతడి గురించి ఆరా తీసి మరో ఇద్దరు విద్యార్థినులతో ఇతడు సంబంధం నెరుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారిని ఇతడి బారి నుంచి రక్షించాలని నిర్ణయిం చుకున్నారు. అక్కడ మహిళా నేతలను ఆశ్రయించారు. ఆ మహిళ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును కలిశారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. మరో ఇద్దరు యువతులు మోసపోకుండా చూడాలన్నారు. వీరి విషయాన్ని సావధానంగా విన్న పోలీసు కమిషనర్.. తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్తో చెప్పారు. ఆ ఇద్దరు మోసపోకూడదనే.. తమలా మరో ఇద్దరు మోసపోకూడదనే నగర పోలీసు కమిషనర్‌ను కలిసినట్టు బాధిత మహిళలు విలేకరులకు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు.