AP VIT University Offers Non Engineering Courses with Merit Scholarships - Sakshi
Sakshi News home page

ఏపీ నాన్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వీఐటీ స్కాలర్‌షిప్

Published Thu, Feb 18 2021 7:19 PM | Last Updated on Thu, Feb 18 2021 7:49 PM

AP VIT University Provides Merit Scholarships For Non IT Students In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: నాన్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు వీఐటీ యూనివర్శిటి శుభవార్త అందించింది. తమ యూనివర్శిటీలో ఆర్ట్స్‌ బీబీఏ, లా, బీ.కమ్‌, బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే లక్ష్యంగా జీవీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నట్లు గురువారం వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు డా.శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక బాధ్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

జీవీ మెరిట్ స్కాలర్‌షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్‌కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం వందశాతం స్కాలర్‌షిప్ లభిస్తుందని వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ..  రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలన్నారు. అతను/ఆమె డిగ్రీ ప్రోగ్రాంలో అన్ని సంవత్సరాలకు 50 శాతం స్కాలర్‌షిప్ పొందుతారని తెలిపారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25 శాతం స్కాలర్‌షిప్ లభిస్తుంది దీంతో మొత్తం 75 శాతం స్కాలర్‌షిప్ అవుతుంది.

అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు..
⇔ బీబీఏలో జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్టెక్ కోర్సులు, 
⇔ న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను,
⇔ బి.కామ్ కోర్స్మూడేళ్ళతోపాటుసిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకుప్రాధమికంగా బోదించటం జరుగుతుంది.  

అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటాసైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది. ఈ రెండు మెరిట్ స్కాలర్‌షిప్‌లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది.  ఈ అర్హత కలిగి విద్యార్థిని/ విద్యార్థులు తేదీ 17.02.2021 నుంచి 31.05.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్  డా. ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in నుసందర్శించవచ్చని లేదా 7901091283కి కాల్ చేసి లేదా admission@vitap.ac.inకి ఈ-మెయిలు చేసి వివరాలను పొందవచ్చని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement