vit university
-
సీఎస్ఐఆర్, ఐఐసీటీల మధ్య పరిశోధన ఒప్పందం
సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్(ఎస్ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ -
యూఎస్ఏ, టాప్సైట్లతో వీఎస్‌బీ, ఆల్ఫాబీటాల ఒప్పందం
విఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ (వీఎస్‌బీ), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మరియు TOPXIGHT రీసెర్చ్ ల్యాబ్‌లతో అవగాహన ఒప్పందం (ఎంఒయూ) సంతకం కార్యక్రమం 2021 మార్చి 3న వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలోని విఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో వర్చువల్ విధానంలో జరిగింది. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మరియు TOPXIGHT రీసెర్చ్ ల్యాబ్‌లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటా రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు చెందిన ఆల్ఫాబెటా అనేక బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలకు ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుందని అన్నారు. ఫిన్‌టెక్ ద్వారా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిజినెస్ మోడల్స్, ఫైనాన్షియల్ మోడళ్లను మార్పు చెందుతాయని చెప్పారు. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన నిపుణుల కోసం భారీ డిమాండ్ ఉన్న ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతోంది. విఐటి-ఎపి విశ్వవిద్యాలయం ఫిన్టెక్లో స్పెషలైజేషన్‌తో బిబిఎ ప్రోగ్రాం ద్వారా ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఆల్ఫాబెటా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి నూతన టెక్నాలజీ ఉపయోగించుకొని నిజ జీవిత నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. "ఫిన్‌టెక్ ప్రాక్టీస్ 1, 2" అనే రెండు కోర్సులు పూర్తి చేసిన తర్వాత వారికి సర్టిఫికెట్ లభిస్తుంది. కోర్సు ముగిసేనాటికి, విద్యార్థులు సమకాలీన సమస్యలపై పరిశోధన చేయగలరు, కొత్త వ్యాపార/ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేయగలరు మరియు పేటెంట్లను సంపాదించగలరు. బీబీఏ ఫిన్‌టెక్ పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చెయిన్ ఎక్స్పర్ట్, బ్లాక్‌చెయిన్ యాప్ డెవలపర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్ - ఫైనాన్స్, బిజినెస్ అనలిస్ట్, ప్రాసెస్ అనలిస్ట్, కంప్లైయెన్స్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాల్లో బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి ప్రవేశించవచ్చు. ఫిన్‌టెక్ అర్హత ఉన్న రంగాలు - పర్సనల్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మార్కెట్స్, లెండింగ్, బిల్లింగ్ / చెల్లింపులు, రెగ్‌టెక్, బ్లాక్‌చెయిన్ / లెడ్జర్, క్రిప్టోగ్రఫీ. ఫిన్‌టెక్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, నేడు అమెజాన్ ఆన్లైన్ పుస్తక విక్రేత కంటే చాలా ఎక్కువ సేవలను , పేటీఎం మొబైల్ వాలెట్ కంటే చాలా ఎక్కువ సేవలను అందిస్తుంది. ఫిన్‌టెక్ నిపుణులు భవిష్యత్ లో దిశ నిర్దేశకులుగా ఎదుగుతారని అభిప్రాయ పడ్డారు. వీఐటీ-ఏ.పి స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ డా. జయవేలు మాట్లాడుతూ వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఫిన్‌టెక్ ప్రత్యేకతలతో కోర్సులను అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కూడా అవగాహనా ఒప్పందాలను కలిగి ఉన్నామని తెలిపారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం, డియర్బోర్న్ మరియు అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఇక్కడ విద్యార్థులు భారతదేశంలో రెండు సంవత్సరాలు మరియు యుఎస్ఎలో రెండు సంవత్సరాలు చదువుకోవచ్చు మరియు యుఎస్ఎ నుండి డిగ్రీ పొందవచ్చు. బికామ్ (ఫైనాన్స్), విద్యార్థులు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టాక్సేషన్ వంటి వివిధ రంగాలలో నైపుణ్యం పొందగలుగుతారు. మా లోతైన విద్య మరియు విద్యా పాఠ్యాంశాలు విద్యార్థులకు వాణిజ్యంలో విస్తృత జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందిస్తాయి. మరియు బ్యాంకింగ్. విద్యార్థులు బికామ్ (ఫైనాన్స్) చదివితే సిఎ, సిఎస్, సిఎంఎ లేదా సిఎఫ్ఎలో చాలా తేలికగా ఉత్తీర్ణత సాధించగలరని తెలిపారు. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యు.ఎస్.ఏ సహా వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శివ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఆల్ఫాబెటా ప్లాట్‌ఫాం ఫిన్‌టెక్ రంగంలో వృద్ధి వ్యయం లేదా కార్మిక మధ్యవర్తిత్వం ద్వారానే కాకుండా, కృత్రిమ మేదస్సు, బ్లాక్‌చెయిన్, 5జీ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆవిష్కరణల చేయటానికి కూడా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఆల్ఫా బీటా ఇన్కార్పొరేషన్, యుఎస్ఏ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సత్యనారాయణన్ పళనియప్పన్ మాట్లాడుతూ ఫిన్‌టెక్ భారతదేశానికి పెద్ద ఆర్థిక వృద్ధి అందించే ఇంజిన్‌గా నిలుస్తుందని ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ కంపెనీలు రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో ఫిన్టెక్లో పెట్టుబడులను పెంచాలని యోచుస్తున్నాయని చెన్నై మరియు వైజాగ్‌లోని హబ్‌లతో, ఇప్పటికే ఫిన్ టెక్ రంగంలో ఆవిష్కరణలకు బహుమతులు ఇస్తున్నారని తెలియజేశారు. ఈ అవగాహనా ఒప్పంద వేడుకలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. సిఎల్వీ శివకుమార్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. -
నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఐటీ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నాన్ ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు వీఐటీ యూనివర్శిటి శుభవార్త అందించింది. తమ యూనివర్శిటీలో ఆర్ట్స్ బీబీఏ, లా, బీ.కమ్, బీఏ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే లక్ష్యంగా జీవీ మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు గురువారం వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు డా.శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక బాధ్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జీవీ మెరిట్ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం వందశాతం స్కాలర్షిప్ లభిస్తుందని వీఐటీ-ఏపీ వైస్ ఛాన్సలర్ డా.ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. వీఐటీ-ఏపీ రిజిస్ట్రార్ డా.సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ.. రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలన్నారు. అతను/ఆమె డిగ్రీ ప్రోగ్రాంలో అన్ని సంవత్సరాలకు 50 శాతం స్కాలర్షిప్ పొందుతారని తెలిపారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25 శాతం స్కాలర్షిప్ లభిస్తుంది దీంతో మొత్తం 75 శాతం స్కాలర్షిప్ అవుతుంది. అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు.. ⇔ బీబీఏలో జనరల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్‌టెక్ కోర్సులు, ⇔ న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను, ⇔ బి.కామ్ కోర్స్మూడేళ్ళతోపాటుసిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకుప్రాధమికంగా బోదించటం జరుగుతుంది. అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటాసైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది. ఈ రెండు మెరిట్ స్కాలర్షిప్లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని యూనివర్శిటీ యాజమాన్యం పేర్కొంది. ఈ అర్హత కలిగి విద్యార్థిని/ విద్యార్థులు తేదీ 17.02.2021 నుంచి 31.05.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్ డా. ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు కోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in నుసందర్శించవచ్చని లేదా 7901091283కి కాల్ చేసి లేదా admission@vitap.ac.inకి ఈ-మెయిలు చేసి వివరాలను పొందవచ్చని చెప్పారు. -
మంత్రిగా శంకుస్థాపన.. ఉప రాష్ట్రపతిగా ప్రారంభం
సాక్షి, అమరావతి: విట్ అమరావతి యూనివర్సిటీలో రెండు బ్లాక్‌లను మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజినీ నాయుడు బ్లాక్‌లను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేవుడు అవకాశం ఇస్తే, నా బాల్యాన్ని తిరిగి ఇవ్వమని కోరుకుంటానన్నారు. అపుడు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేయగా.. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా ప్రారంభిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. వసతులు, వనరులు కల్పించడమమే కాదు.. విద్యా బుద్దులు కూడా అదేస్థాయిలో విట్ యూనివర్సిటీ అందిస్తుందని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో గొప్ప కంపెనీలకు సీఈఓ లుగా దక్షిణ భారతానికి చెందిన వారు ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా దేశంలోని యూనివర్సిటీలు మారాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయి ర్యాంకింగ్స్‌లో విట్ వర్సిటీ ముందు వరుసలో ఉండడం అభినందనీయమన్నారు. నాలెడ్జి, హెల్త్ హబ్‌గా అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉండబోతోందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో తామే ముందున్నామన్నారు. ఆస్తులు మనకు తోడుగా ఉండవు.. చదువే మనకు అన్నీ ఇస్తుందని ఉదహరించారు. ఒక్క సంవత్సరంలో ఈ స్థాయిలో నిర్మాణాలు చేయడం గొప్ప విషయమన్నారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ను బ్రౌన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేశానని, ఇప్పుడు అమరావతిని గ్రీన్, బ్లూ సిటీగా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రపంచలోని బెస్ట్ యూనివర్సిటీలన్నీ అమరావతికి వస్తాయని, నాలెడ్జి, హెల్త్ హబ్‌గా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. విట్ చైర్మన్ విశ్వనాథన్ మాట్లాడుతూ గత ఏడాది అమరావతిలో విట్ వర్సిటీకి శంకుస్థాపన చేశామని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇంత తక్కువ సమయంలో యూనివర్సిటీని ప్రారంభించగలిగామని చెప్పారు. అమరావతి విట్ యూనివర్సిటీని దేశంలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో విట్ అమరావతి అద్భుతమైన యూనివర్సిటీగా రూపొందుతుందన్నారు. రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు హాజరయ్యారు. -
వీఐటీ వర్సిటీ రూ. కోటి సాయం
హుద్‌హుద్ బాధితులకు వీఐటీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వర్సిటీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా రూ. కోటిని సేకరించారు. వర్సిటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అక్టోబర్ 30న సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ. కోటి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. -
ఆటోడ్రైవర్లకు వీఐటీ గుర్తింపు కార్డులు
వేలూరు, న్యూస్‌లైన్: విద్యార్థులు క్షేమ ప్రయాణం కోసం వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 835 మంది ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇండియాలో ఉన్న నెంబర్ వన్ యూనివర్సిటీల్లో వీఐటీ ఒక్కటని, యూనివర్సిటీ నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల వీఐటికీ కొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. అలాగే యూనివ ర్సిటీకి వచ్చే ఉద్యోగులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సైతం ఎక్కువగా ఆటోలోనే వస్తుంటారన్నారు. వీరి క్షేమ ప్రయాణం కోసమే ఆటోలు నడిపే 835 మంది డ్రైవర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గుర్తింపు కార్డులో డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నెంబర్ వివరాలు ఉంటాయన్నారు. దీనివల్ల యూని వర్సిటీకి వచ్చి వెళ్లే వారి బ్యాగులు పోయినా తిరిగి వాటిని పొందేందుకు ఎంతగానో వీలుగా ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి ఈ గుర్తింపు కార్డులున్న ఆటోలను మాత్రమే యూనివర్సిటీలోనికి అనుమతిస్తామన్నారు. వీఐటీ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఇకపై వీఐటీ సిబ్బంది ఒకరిని బస్టాండ్ లేక కాట్పాడి రైల్యేస్టేషన్ వరకు తోడుగా పంపుతామని, సొంత గ్రామాలనుంచి యూనివర్శిటీకి వచ్చే సమయంలో కూడా రైల్యేస్టేషన్ వరకు తోడుగా ఒకరిని పంపుతామన్నారు.వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, జీవీ సెల్వం, కాట్పాడి ఆర్టీవో కణి, ఇన్స్పెక్టర్ మహేంద్రన్, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. -
ఫ్యాషన్ షో అదుర్స్
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయి రివేరా-2014 గురువారం ప్రారంభమైంది. అందులో భాగంగా శుక్రవారం వర్సిటీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో సరికొత్త డిజైన్ల దుస్తులు ధరించిన విద్యార్థినులు ఆకట్టుకున్నారు. వైవిధ్యంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. వేలూరు, న్యూస్‌లైన్: వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థులచే ఫ్యాషన్ షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్ఐఎఫ్టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీ య, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగ దు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఐఎస్వో 2009 సర్టిఫికెట్లు పొందిన ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్స రం సుమారు 24 వేల విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థులను ప్రొత్సహించేం దుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఫ్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్‌లర్ రాజు, త్రొ చాన్స్‌లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
వీఐటీలో ఎగ్జిబిషన్ ప్రారంభం
వేలూరు, న్యూస్‌లైన్: వీఐటీ యూనివర్సిటీలో సౌత్ రాష్ట్రాలకు చెందిన మూడవ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ పరిశోధనలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుంచే పరిశోధనలు తయారు చేయడానికి సిద్ధం కావాలన్నారు. పాఠశాల స్థాయిలో పరిశోధ నలకు అవసరమైన అన్ని వసతులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్ జన్సన్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు సూట్‌కేసులోనే బుల్లెట్ తయారు చేసి ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ పరిశోధన పలువురిని ఆకట్టుకుంది. అలాగే చెన్నై కీల్పాక్కంకు చెందిన పాఠశాల విద్యార్థులు బ్యాటరీతో నడిచే మినీవిమానం, రాణిపేట మహర్షి పాఠశాల విద్యార్థులు రైలు పట్టాలతో విద్యుత్ తయారు చేయడంపై ఎగ్జిబిషన్లో ఉంచారు. ఐదు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు వివిధ పరిశోధనలు తయారు చేశారని వీటిని ప్రతినిధులచే పరిశీలించి వీటికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామని చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. ఆయనతోపాటు పరిశీలించిన వారు వీఐటీ వైస్ చాన్స్‌లర్ రాజు, ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, ప్రొఫెసర్ నారాయణన్, వీఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు