
వీఐటీ వర్సిటీ రూ. కోటి సాయం
హుద్‌హుద్ బాధితులకు వీఐటీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. వర్సిటీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు సంయుక్తంగా రూ. కోటిని సేకరించారు. వర్సిటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అక్టోబర్ 30న సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ. కోటి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు.