ఫ్యాషన్ షో అదుర్స్ | fashion show vit university | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ షో అదుర్స్

Published Sat, Feb 8 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

ఫ్యాషన్ షో అదుర్స్

ఫ్యాషన్ షో అదుర్స్

 వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయి రివేరా-2014 గురువారం ప్రారంభమైంది. అందులో భాగంగా శుక్రవారం వర్సిటీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అందులో సరికొత్త డిజైన్ల దుస్తులు ధరించిన విద్యార్థినులు ఆకట్టుకున్నారు. వైవిధ్యంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
                                   
 వేలూరు, న్యూస్‌లైన్:
 వీఐటీ యూనివర్సిటీలోని రివేరా-2014 అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి విద్యార్థులచే ఫ్యాషన్ షో జరిగింది. ఈ పోటీల్లో 400 యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రకరకాల దుస్తులు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతల నడుమ జరిగిన ఈ పోటీల్లో చెన్నై ఎన్‌ఐఎఫ్‌టీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీ య, తృతీయ స్థానాల్లో  గెలుపొందిన విద్యార్థులకు నగ దు బహుమతితో పాటు సర్టిఫికెట్లును వీఐటీ యూనివర్సిటీ చాన్‌‌సలర్ విశ్వనాథన్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఐఎస్‌వో 2009 సర్టిఫికెట్లు పొందిన  ఈ అంతర్జాతీయ రివేరా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు జరుగుతాయన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్స రం సుమారు 24 వేల  విద్యార్థులు ఈ పోటీల్లో కలుసుకోవడం అభినందనీయమన్నారు.
 
 విద్యార్థులను ప్రొత్సహించేం దుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఫ్యాషన్ షోలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ పోటీలు ఈనెల 9వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వివిధ పోటీలు నిర్వహించి సుమారు *2 కోట్లు విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, వైస్ చాన్స్‌లర్ రాజు, త్రొ చాన్స్‌లర్ నారాయణన్, ప్రొఫెసర్లు, వివిధ యూనివర్సిటీ చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement