వేలూరు, న్యూస్‌లైన్: విద్యార్థులు క్షేమ ప్రయాణం కోసం వీఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 835 మంది ఆటోడ్రైవర్‌లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆటోడ్రైవర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇండియాలో ఉన్న నెంబర్ వన్ యూనివర్సిటీల్లో వీఐటీ ఒక్కటని, యూనివర్సిటీ నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
వీటి వల్ల వీఐటికీ కొత్తగా వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. అలాగే యూనివ ర్సిటీకి వచ్చే ఉద్యోగులు, ప్రొఫెసర్‌లు, విద్యార్థులు సైతం ఎక్కువగా ఆటోలోనే వస్తుంటారన్నారు. వీరి క్షేమ ప్రయాణం కోసమే ఆటోలు నడిపే 835 మంది డ్రైవర్‌లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ గుర్తింపు కార్డులో డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నెంబర్ వివరాలు ఉంటాయన్నారు. దీనివల్ల యూని వర్సిటీకి వచ్చి వెళ్లే వారి బ్యాగులు పోయినా తిరిగి వాటిని పొందేందుకు ఎంతగానో వీలుగా ఉంటుందన్నారు.
అలాగే ఏప్రిల్ నుంచి ఈ గుర్తింపు కార్డులున్న ఆటోలను మాత్రమే యూనివర్సిటీలోనికి అనుమతిస్తామన్నారు. వీఐటీ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఇకపై వీఐటీ సిబ్బంది ఒకరిని బస్టాండ్ లేక కాట్పాడి రైల్యేస్టేషన్ వరకు తోడుగా పంపుతామని, సొంత గ్రామాలనుంచి యూనివర్శిటీకి వచ్చే సమయంలో కూడా రైల్యేస్టేషన్ వరకు తోడుగా ఒకరిని పంపుతామన్నారు.వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్, జీవీ సెల్వం, కాట్పాడి ఆర్‌టీవో కణి, ఇన్‌స్పెక్టర్ మహేంద్రన్, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్లకు వీఐటీ గుర్తింపు కార్డులు
Published Fri, Mar 28 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM
Advertisement
Advertisement