సాక్షి, హైదరాబాద్: నవంబర్ 8న జరగనున్న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్ధాయి ఎన్‌టీఏఎస్‌ఈ), నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)లకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు బుధవారం ప్రభుత్వ పరీక్షల సంచాలకులు యం.ఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కార్యాలయం వెబ్ సైట్ www.bseap.org నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు.
ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో టీచర్ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-9440365510 నంబర్‌ను సంప్రదించవచ్చు.
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో...
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్రమహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఎడ్‌సెట్-2015 రాయకున్నా ఓసీలు 50 శాతం, బీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు 9000596158 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్ పరీక్ష హాల్ టికెట్లు
Published Thu, Oct 29 2015 8:25 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement