మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్
పోస్టులు: 1. మేనేజర్, 2. అసిస్టెంట్ మేనేజర్, 3. అసిస్టెంట్ ఆఫీసర్
4. ఫోర్‌మెన్, 5. టెక్నికల్ అసిస్టెంట్స్, 6. టెక్నీషియన్
7. మెకానిక్, 8. డ్రైవర్, 9. స్టెనోగ్రాఫర్
నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, అనుభవం ఉండాలి
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 22
వెబ్‌సైట్: http://mecl.gov.in/
ఓఎన్‌జీసీ పోస్టులు:
అసిస్టెంట్ టెక్నీషియన్
విభాగాలు: ఎలక్ట్రికల్/మెకానికల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/బాయిలర్/సివిల్
మెరైన్ రేడియో అసిస్టెంట్ గ్రేడ్-3
అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్)
అసిస్టెంట్ గ్రేడ్-3
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్
(బాయిలర్/ప్రొడక్షన్ /సిమెంటింగ్)
జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్
జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 15
వెబ్‌సైట్: http://www.ongcindia.com/
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్
కోర్సు: పీహెచ్‌డీ
విభాగం: ఎడ్యుకేషన్
వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు
అర్హతలు: ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఎడ్/ఎంఫిల్ ఉండాలి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 4
వెబ్‌సైట్: http//cie.du.ac.in
ఎడ్యూ న్యూస్
మహీంద్రా +ఈసీపీ+జేఎన్‌టీయూల..
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రామ్
మహీంద్రా గ్రూప్ ఉన్నత విద్యా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఫ్రాన్స్‌లోని ప్రాచీన ఇంజనీరింగ్ విద్యాసంస్థ ఇకోల్ సెంట్రలీ పారిస్(ఈసీపీ), హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)ల ఉమ్మడి సహకారంతో మహీంద్రా ఇకోల్ సెంట్రలీ(ఎంఈసీ) పేరిట ఇంజనీరింగ్ విద్యాసంస్థను ఏర్పాటు చేసింది. ఎంఈసీ పైలట్ బ్యాచ్ వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సంస్థ హైదరాబాద్ క్యాంపస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేయనుంది. ఈ ప్రోగ్రామ్‌లో బీటెక్, ఎంటెక్ డిగ్రీలు కలిసి ఉంటాయి. పైలట్ బ్యాచ్‌లో 180 సీట్లు ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు(శాట్) స్కోర్, జాతీయ విద్యార్థులు జేఈఈ(మెయిన్)-2014 ర్యాంక్ ద్వారా ఈ ఐదేళ్ల ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందొచ్చు. అర్హులైన అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు హాజరై, బ్రాంచ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. భారత విద్యార్థులు ఏడాది ఫీజు రూ.4 లక్షలు, అంతర్జాతీయ విద్యార్థులైతే 8 వేల డాలర్లు చెల్లించాలి. ఎంఈసీ ఇచ్చే డిగ్రీకి ఫ్రెంచ్ బోర్డు ఆఫ్ ఇంజనీర్స్ గుర్తింపు ఉంటుంది. దీనిద్వారా భారత్‌లోని ఫ్రెంచ్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. నేచురల్ సెన్సైస్, హ్యుమానిటీస్, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, లాంగ్వేజ్ అండ్ కల్చర్, సాఫ్ట్‌స్కిల్స్ వంటి వాటిపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానం కల్పించేలా కరిక్యులమ్‌ను రూపొందించారు.
విద్య- ఉద్యోగం: జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
Published Wed, Jun 25 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
Advertisement
Advertisement