8 నుంచి తెలుగు వర్సిటీ దరఖాస్తులు | Telugu varsity applications to be started from May 8 | Sakshi
Sakshi News home page

8 నుంచి తెలుగు వర్సిటీ దరఖాస్తులు

Published Tue, May 6 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

Telugu varsity applications to be started from May 8

హైదరాబాద్,న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు లభ్యమవుతాయి. వీటిని వర్సిటీ వెబ్ సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుయూనివర్సిటీ.ఏసి.ఇన్) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను మే 30లోగా సమర్పించాలి. 2014-15వ విద్యా సంవత్సరానికి వర్సిటీలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, జ్యోతిషం, జర్నలిజం, సంగీతం, నృత్యం, రంగస్థల కళలు, జానపద కళలు, చిత్రలేఖన, శిల్పకళలతో పాటు కొత్తగా ఇంద్రజాలంలో కోర్సును కూడా ప్రారంభించారు. ఈ మేరకు వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సోమవారం వివరాలను వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement