ఇగ్నో కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం
Published Tue, Aug 9 2016 6:12 PM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్.రాజారావు తెలిపారు. ఈమేరకు మంగళవారం ఉషోదయా కూడలి వద్ద ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ ఇగ్నో విజయనగరం, శ్రీకాకుళం,ఉభయగోదావరి జిల్లాల పరిధి విశాఖ కేంద్రంగా 2011లో ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పుడు కొత్తగా పుదుచ్చేరి,యానం ప్రాంతాలలో విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 అధ్యయన కేంద్రాలు ఉన్నాయన్నారు. తమ అధ్యయన కేంద్రంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కొత్తగా డిప్లామో ఇన్ అక్వాకల్చర్, డిప్లామో ఇన్ డెయిరీ వంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అక్వాకల్చర్ కోర్సులో చేరే విద్యార్థులు ఇంటర్ పాసై ఉండాలన్నారు. కోర్సు ఆంగ్లమాధ్యమంలో మాత్రమే ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ. 6500లు నిర్ణయించడమైనదన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ కలదని తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం,ఆరిలోవ చినగదిలిలో డిప్లామో ఇన్ డెయిరీ కోర్సు పూర్తిగా తెలుగు మాధ్యమంలో ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. దీనికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులో 50శాతం రాయితీ ఉంటుందన్నారు. ఇంటర్ పాసై ఉండాలన్నారు. అదేవిధంగా yì గ్రీ,పీజీ, పీజీ డిప్లామో, డిప్లామో కోర్సులలో చేరగోరు అభ్యర్థులకు ఆగష్టు 17 చివరితేదీకాగా, ఆగష్టు 31వ తేదీ వరకు రూ. 300 అపరాధ రుసుముతో ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా డిగ్రీ కోర్సులలో చేరు ఎస్నీ,ఎస్టీ, ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన అభ్యర్ధులకు పూర్తిగా ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నుంచి నూతనంగా రాజాం జి.ఎం.ఆర్. గ్రూప్ కళాశాల, అమలాపురం కళాశాలలో రెండు అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ డి.ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సీఏ అభ్యర్ధులకు సీపీటీ ప్రవేశపరీక్ష ద్వార బికాం కోర్సు అందిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వార సీఏ అభ్యర్ధులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి అధ్యయన కేంద్రంలో 500 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దరఖాస్తుల కొరకు ఉషోదయా కూడిలలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, లేదా, ఇగ్నో అధ్యయన కేంద్రాలు కల్గిన విశాఖ,కాకినాడు, రాజమండ్రి, అమలాపురం, గాజువాక, విజయనగరం, ఎచ్చెర్ల, రాజాంలలో సంప్రదించి రూ 200 చెల్లించి ప్రాస్పెక్టస్ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరములకు 0891–2511200– 300– 400 ఫోన్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా కోరుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఇగ్నో సహాయ రిజిస్ట్రార్ లక్ష్మిపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement