ఆన్‌లైన్ విధానంలో ఎస్‌బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ | SBI clerk examination to be held in Online examination process | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ విధానంలో ఎస్‌బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్

Published Sat, Jul 19 2014 7:01 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM

ఆన్‌లైన్  విధానంలో ఎస్‌బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ - Sakshi

ఆన్‌లైన్ విధానంలో ఎస్‌బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్

నేను ఎస్‌బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాను. ఆన్‌లైన్  విధానంలో పరీక్ష ఎదుర్కోవడం ఇదే తొలిసారి. తగిన సూచనలివ్వండి.  - బి.శ్రీలత, మియాపూర్
   కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్‌‌డలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వీటిని పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థులకు తెలియ జేస్తారు. లాగిన్ అయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై పరీక్షకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవాలి. ‘ఐ యామ్ రెడీ’ అనే బటన్‌పై  క్లిక్ చేయగానే ప్రశ్నాపత్రం వస్తుంది. అప్పటి నుంచి నిర్ణీత పరీక్షా సమయం ప్రారంభమవుతుంది. స్క్రీ న్‌పై సమయం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ అభ్యర్థులు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 5 ఆప్షన్లుంటాయి. స్క్రీన్‌పై ఒకసారి ఒకే ప్రశ్న కనిపిస్తుంది.
 -    సరైన సమాధానంగా భావించిన ఆప్షన్‌ైపై అభ్యర్థి మౌస్‌తో క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ ఆప్షన్ ప్రముఖంగా కనిపిస్తుంది. సమాధానాన్ని గుర్తించిన తర్వాత అభ్యర్థి ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేసిన సమాధానం సేవ్ అయి, స్క్రీన్‌పై తర్వాతి ప్రశ్న  వస్తుంది. ఏదైనా ప్రశ్నను వదిలేయాలంటే ఆ ప్రశ్నకు సంబంధించిన ఏ ఆప్షన్‌పైనా క్లిక్ చేయకూడదు. కచ్చితమైన నిర్ధారణకు రాని సందర్భాల్లో ‘రివ్యూ లేటర్’ బటన్‌ను ఉపయోగించి పరీక్ష చివర్లో సమయం లభిస్తే సమాధానాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. రివ్యూ కోసం పెట్టుకున్న ప్రశ్నలకు ఒకవేళ సమాధానాన్ని మార్చ లేకపోతే మూల్యాంకనంలో ముందు గుర్తించిన జవాబునే పరిగణనలోకి తీసుకుంటారు.
 -    సమాధానాలను గుర్తించిన, గుర్తించని ప్రశ్నలు వాటి వరుస సంఖ్యల ఆధారంగా స్క్రీన్‌పై కుడిచేతి వైపున కనిపిస్తాయి. ప్రతి ప్రశ్నకు నిర్ధారితరంగు ఉంటుంది.
     తెలుపు రంగు - నాట్ విజిటెడ్  (అసలు చూడకుండా వదిలేసిన ప్రశ్న)
     ఎరుపు రంగు - నాట్ ఆన్సర్‌‌డ  (ప్రశ్నను చూసినప్పటికీ సమాధానం గుర్తించలేదు) ఆకుపచ్చ రంగు - ఆన్సర్‌‌డ (సమాధానం కచ్చితంగా గుర్తించింది)
 ఊదా రంగు (గజీౌ్ఛ్ట) - మార్‌‌కడ్ ఫర్ రివ్యూ లేటర్  (అన్ని ప్రశ్నలను గుర్తించిన తర్వాత మిగిలిన సమయంలో వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.)
 
  -    ఆన్‌లైన్ విధానంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకి సులభంగా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. వేగంగా, తేలికగా చేయగలిగే విభాగానికి సంబంధించిన ప్రశ్నలను ముందుగా ఎంచుకోవడం ఉత్తమం. చాలామంది అభ్యర్థులు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంటి విభాగాలకు ముందుగా జవాబులను గుర్తించి, రీజనింగ్, అరిథ్‌మెటిక్ లాంటి టాపిక్‌లకు చెందిన ప్రశ్నలను చివర్లో తీసుకుంటారు.
 -    {పశ్న పత్రం మొత్తాన్ని మౌస్‌తోనే సాల్వ్ చేయాలి. కీబోర్‌‌డ ఉపయోగం ఉండదు. రఫ్ వర్క్ చేసుకోవడానికి పరీక్షా కేంద్రంలో పేపర్లను అందజేస్తారు. నిర్ణీత సమయం పూర్తవగానే సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే పరీక్ష పూర్తవుతుంది.
 - ఎన్. విజయేందర్ రెడ్డి
 బ్యాంకింగ్ పరీక్షల శిక్షణా నిపుణులు
 
 ఎడ్యూ న్యూస్

 ఎడెక్స్ ద్వారా కోర్సులందించనున్న భారత విద్యా సంస్థలు
 మనదేశంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు నిపుణులైన ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెర మీదకొచ్చిందే ఎడెక్స్. ఇది ఒక ఆన్‌లైన్ కోర్సులు అందించే ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్‌ఫాం. ఎడెక్స్.. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందాల ద్వారా ఆన్‌లైన్‌లో వివిధ కోర్సులు అందిస్తోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన నిపుణులైన ఫ్యాకల్టీ లభిస్తారు. ఆన్‌లైన్ ద్వారా వారి పాఠాలను మనం చూడొచ్చు, వినొచ్చు. మనదేశానికి చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఎడెక్స్‌తో చేతులు కలిపాయి. అవి.. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. రాబోయే సంవత్సరాల్లో ఐఐఐటీ - బెంగళూరు.. ఎడెక్స్ ద్వారా డిగ్రీ కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే రెండేళ్లలో మొత్తం 12 కోర్సులను అందిస్తారు.
 
 మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానీ కూడా ఎడెక్స్ ద్వారా ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్ చేయనుంది.  టెక్నాలజీ, సైన్స్ మొదలైన సబ్జెక్టుల్లో కోర్సులను అభ్యసించవచ్చు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ పొందొచ్చు. ఎడెక్స్ ద్వారా పది ఆన్ క్యాంపస్ కోర్సులు అందించడానికి బిట్స్ పిలానీ రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టింది. వచ్చే మూడేళ్లలో మరో 60 కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరిన్ని వివరాలకు www.edx.org  చూడొచ్చు.
 
 ఐఐటీ - బాంబే, వాషింగ్టన్ యూనివర్సిటీల.. ఈ-ఎంబీఏ ప్రోగ్రామ్
 ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఐఐటీ-బాంబే, యూఎస్‌లోని వాషింగ్టన్  యూనివర్సిటీ-సెయింట్ లూయిస్ కలిసి ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈ-ఎంబీఏ) కోర్సును అందించనున్నాయి. 2015 ప్రారంభంలో ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. కోర్సు ఫీజు 55000 యూఎస్ డాలర్ల నుంచి 60000 యూఎస్ డాలర్ల వరకు ఉంటుంది. క్లాసులు ఐఐటీ - బాంబేలో ఉంటాయి. రెండు దేశాలకు చెందిన ఫ్యాకల్టీ పాఠాలు బోధిస్తారు. కోర్సు పూర్తయ్యాక జాయింట్ డిగ్రీ అందిస్తారు.
 
 నిఫ్ట్‌లో ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’ దరఖాస్తులకు చివరి తేది జూలై 31
 ఫ్యాషన్ అంటే ఆసక్తి.. డిజైనింగ్ రంగంలో కొంత అనుభవం ఉన్న ఔత్సాహికులకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) కోర్సులను ఆఫర్ చేస్తోంది. ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’లో భాగంగా ఏడాది, ఆరు నెలలు, 3 నెలల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 ఏడాది కోర్సులు
 కాంటెంపరరీ  టెక్స్‌టైల్స్ ఫర్ ఇంటీరియర్ స్పేసెస్, కాంటెంపరరీ ఎథ్నిక్ వేర్, ఫ్యాషన్, క్లాతింగ్ టెక్నాలజీ, ఇండియన్ ఫ్యాషన్ అప్పెరల్, బొటిక్ మేనేజ్‌మెంట్, టెక్స్‌టైల్ డిజైన్, అప్పెరల్ క్లాతింగ్. ప్రతి విభాగానికి 30 సీట్లు. ఫీజు రూ.60వేల నుంచి రూ.75 వేలు.
 
 ఆరు నెలల కోర్సులు
 అప్పెరల్ డిజైన్, డెవలప్‌మెంట్(మహిళలకు మాత్రమే) సీట్లు 30, ఫీజు రూ.35,000
 
 మూడు నెలల కోర్సులు
 గార్మెంట్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఇన్ ఉమెన్ వేర్, సిక్స్ సిగ్మా-బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్. ఒక్కో విభాగంలో 30 సీట్లు, ఫీజు రూ.30,000
 అర్హత: 10+2, 10+2+డిప్లొమా.
 దరఖాస్తుకు చివరి తేది: జూలై 31
 వివరాలకు: 040-23110841, 23110630
 వెబ్‌సైట్: www.nift.ac.in  
 
 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్  
 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) ఉత్తరప్రదేశ్‌లోని రియాండ్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆర్టిసన్ ట్రెయినీ, ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     ఆర్టిసన్ ట్రెయినీ: 129
 విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
 అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
 వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
     ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ: 14
 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్వూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 11
 వెబ్‌సైట్: http://ntpcrihand.co.in
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్   
 న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజమ్ (ఉర్దూ)
 సీట్ల సంఖ్య: 25
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉర్దూలో పరిజ్ఞానం ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 8
 వెబ్‌సైట్: www.iimc.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement