Online process
-
అన్నిటికీ తహ‘సీల్’దారే !
ములకలచెరువు: ములకలచెరువు తహసీల్దార్ పనితీరు వివాదాస్పదమవుతోంది. వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తున్నారు. భూములకు సంబంధించి విచారణ నివేదికలు, ఫైళ్లలో సంతకాలు లేకున్నా..ఆయనే నేరుగా అన్ని పనులను చక్కబెట్టేస్తున్నారు. ఫలితంగా అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. జరగాల్సింది ఇలా.. రైతులు భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్ఓ, ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తులోని భూములు వివాదాస్పదమైనవా, ఇంతకుమునుపు ఈ భూములు ఎవరి పేరు మీదైనా ఉన్నా యా, భాగపరిష్కారాలు అయ్యాయా లేదా.. అనే విచారణలు చేయాలి. వీఆర్ఓ క్షేత్రస్థాయిలో వన్‌బీలో రైతు భూమి వివరాలు పరిశీలించి నివేదిక తయారు చేస్తే ఆర్ఐ మరోసారి పరిశీలించి నిర్ధారించి సంతకం చేస్తారు. నివేదికను తహసీల్దార్‌కు పంపాక ఆయన సంతకం చేస్తే వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలను ఆన్లైన్ చేస్తారు. చేస్తున్నది ఇలా.. వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేకుండా తహసీల్దార్ వెబ్‌ల్యాండ్ దరఖాస్తులపై సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతోంది. తహసీల్దార్‌కు అనుకూలంగా కొందరు వీఆర్ఓలు సహకరిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆందోళన వీఆర్ఓలు, ఆర్ఐతో సంబంధం లేకుండా తహసీల్దార్ డైరెక్ట్‌గా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్లైన్ ప్రక్రియ కానిస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ముగ్గురు వీఆర్ఓలతో కలిసి తహసీల్దార్ ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని.. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భీతిల్లుతున్నారు. ఈ–పాస్ పుస్తకాలను తహసీల్దార్ చాంబర్‌లోని బీరువాలో పెట్టుకుని రైతులకు ఫోను ద్వారా సమాచారం అందించి పుస్తకాలను చేరవేస్తున్నట్లు సమాచారం. వెలుగు చూసిన దరఖాస్తులివీ ♦పెద్దపాళెం పంచాయతీకి చెందిన సి.నారాయణ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ కోసం 451 ఖాతా నంబరు ద్వారా జూలై 7వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 104ఏ, 106/4ఏ, 107బి, 108/1, 116ఏ, 118ఏ, 140/2, 142–4డి, 175–5, 207/2, 89ఏ, 95 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 2.3250 ఎకరాల భూమి ఉంది. ♦సోంపల్లె పంచాయతీకి చెందిన చిన్న కోటప్ప వెబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్లైన్ చేసుకోవడానికి 122 ఖాతా నంబరు ద్వారా జూన్ 18వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 1215/7, 1215–3డి, 1284–9ఏ, 291/2బి/1, 291/2బి/1, 618–1ఏ2 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 31.7500 ఎకరాల భూమి ఉంది. ♦దేవులచెరువుకు చెందిన వెంకటరమణారెడ్డి వైబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్లైన్ కోసం 859 ఖాతా నంబరు ద్వారా జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 757/5, 823, 826, 755/1 సర్వే నంబర్లలో అతని భూమి ఉంది. ♦నాయనచెరువుపల్లెకు చెందిన కే. రమణమ్మ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ చేసుకోవడానికి ఖాతా నంబరు 27 ద్వారా జూలై 2వ తేదీ దరఖాస్తు చేసుకుంది. 34–బి, 57/డి, 59 వై, 168/1, 170–ఈ, 14 ఎన్, 25 పి, 167–3హెచ్, 140ఎన్, 10–26ఏ సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ♦దేవులచెరువుకు చెందిన ఎం. నాగమ్మ 1180/2 సర్వే నంబరు ద్వారా 2.07 ఎకరాల విస్తీర్ణం ఆన్లైన్ కోసం జూలైలో దరఖాస్తు చేసుకుంది. ♦మొత్తం రైతుల వైబ్ల్యాండ్ దరఖాస్తుల్లో వీఆర్ఓ, ఆర్ఐ సంతకాలు లేవు. తహసీల్దార్ సంతకం మాత్రమే ఉంది. ఆ అధికారం నాకు ఉంది వెబ్‌ల్యాండ్‌లో డైరెక్ట్‌గా ఆన్లైన్ చేసే అధికారం తహసీల్దార్‌గా నాకు ఉంది. వీఆర్ ఓలు, ఆర్‌ఐకు తెలియకుండా భూములు, స్థలాలను ఇప్పటిదాకా ఆన్లైన్ చేయలేదు. – తహసీల్దార్ మహేశ్వరీబాయి అలా చేయడం తప్పు భూములు ఆన్లైన్లో నమోదు చేయాలంటే వీఆర్ఓ, ఆర్ఐ విచారణ నివేదికలు అవసరం. అవి లేకుండా తహసీల్దార్ నేరుగా నమోదుచేయడం జరగదు. అలా జరిగివుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. –మార్కండేయులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు -
థాంక్యూ వైఎస్ జగన్: పెటా
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ప్రశంసించింది. ఈ విధానం జంతు ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెటా ఇండియా ట్విటర్ ద్వారా తెలిపింది. పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై పెటా ప్రశంసల జల్లు కురిపించింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందిస్తూ.. ‘థాంక్యూ వైఎస్ జగన్’ అంటూ పెటా ఇండియా ట్వీట్ చేసింది. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం Thank you @ysjagan. We are sure this will help animals too!https://t.co/JUVcS9d4Zz — PETA India (@PetaIndia) June 8, 2020 -
వ్యర్థాల నిర్వహణకు ‘ఆన్లైన్’ వేదిక
సాక్షి, అమరావతి: ఇక నుంచి వ్యర్థాల నిర్వహణ కోసం పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేదు. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్లైన్లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ (ఏపీఈఎంసీ) వ్యర్థాల బదలాయింపునకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించనుంది. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. (త్వరలో 3,795 వీఆర్వో పోస్టుల భర్తీ) ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారు. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే ఇది మొదటిది కావడం గమనార్హం. (గ్యాంగ్ వార్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు ) -
పెన్షనర్ల ఆన్లైన్ కష్టాలు
కర్నూలు(కల్లూరు): ఈ నెలలో ఎనిమిదో తేదీ వచ్చినా ఇంకా ఆ గ్రామంలో సామాజిక పింఛను దారులకు పింఛను అందలేదు. ఇప్పటికీ ఆన్లైన్ (వెబ్సైట్) మోరాయిస్తుండటంతో పింఛను దారులు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో పెదపాడు గ్రామంలో ఇంకా 63 మంది లబ్ధిదారులకు పింఛను అందలేదు. దీంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో ఏర్పడిన సమస్య కారణంగా పింఛను అందజేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆన్లైన్ విధానంలో ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్
నేను ఎస్బీఐ క్లర్క్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నాను. ఆన్లైన్ విధానంలో పరీక్ష ఎదుర్కోవడం ఇదే తొలిసారి. తగిన సూచనలివ్వండి. - బి.శ్రీలత, మియాపూర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వీటిని పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థులకు తెలియ జేస్తారు. లాగిన్ అయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై పరీక్షకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవాలి. ‘ఐ యామ్ రెడీ’ అనే బటన్‌పై క్లిక్ చేయగానే ప్రశ్నాపత్రం వస్తుంది. అప్పటి నుంచి నిర్ణీత పరీక్షా సమయం ప్రారంభమవుతుంది. స్క్రీ న్పై సమయం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ అభ్యర్థులు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 5 ఆప్షన్లుంటాయి. స్క్రీన్‌పై ఒకసారి ఒకే ప్రశ్న కనిపిస్తుంది. - సరైన సమాధానంగా భావించిన ఆప్షన్ైపై అభ్యర్థి మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ ఆప్షన్ ప్రముఖంగా కనిపిస్తుంది. సమాధానాన్ని గుర్తించిన తర్వాత అభ్యర్థి ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేసిన సమాధానం సేవ్ అయి, స్క్రీన్‌పై తర్వాతి ప్రశ్న వస్తుంది. ఏదైనా ప్రశ్నను వదిలేయాలంటే ఆ ప్రశ్నకు సంబంధించిన ఏ ఆప్షన్పైనా క్లిక్ చేయకూడదు. కచ్చితమైన నిర్ధారణకు రాని సందర్భాల్లో ‘రివ్యూ లేటర్’ బటన్‌ను ఉపయోగించి పరీక్ష చివర్లో సమయం లభిస్తే సమాధానాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. రివ్యూ కోసం పెట్టుకున్న ప్రశ్నలకు ఒకవేళ సమాధానాన్ని మార్చ లేకపోతే మూల్యాంకనంలో ముందు గుర్తించిన జవాబునే పరిగణనలోకి తీసుకుంటారు. - సమాధానాలను గుర్తించిన, గుర్తించని ప్రశ్నలు వాటి వరుస సంఖ్యల ఆధారంగా స్క్రీన్‌పై కుడిచేతి వైపున కనిపిస్తాయి. ప్రతి ప్రశ్నకు నిర్ధారితరంగు ఉంటుంది. తెలుపు రంగు - నాట్ విజిటెడ్ (అసలు చూడకుండా వదిలేసిన ప్రశ్న) ఎరుపు రంగు - నాట్ ఆన్సర్‌డ (ప్రశ్నను చూసినప్పటికీ సమాధానం గుర్తించలేదు) ఆకుపచ్చ రంగు - ఆన్సర్‌డ (సమాధానం కచ్చితంగా గుర్తించింది) ఊదా రంగు (గజీౌ్ఛ్ట) - మార్కడ్ ఫర్ రివ్యూ లేటర్ (అన్ని ప్రశ్నలను గుర్తించిన తర్వాత మిగిలిన సమయంలో వీటికి సమాధానాలు గుర్తించవచ్చు.) - ఆన్లైన్ విధానంలో ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకి సులభంగా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది. వేగంగా, తేలికగా చేయగలిగే విభాగానికి సంబంధించిన ప్రశ్నలను ముందుగా ఎంచుకోవడం ఉత్తమం. చాలామంది అభ్యర్థులు జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంటి విభాగాలకు ముందుగా జవాబులను గుర్తించి, రీజనింగ్, అరిథ్‌మెటిక్ లాంటి టాపిక్‌లకు చెందిన ప్రశ్నలను చివర్లో తీసుకుంటారు. - {పశ్న పత్రం మొత్తాన్ని మౌస్‌తోనే సాల్వ్ చేయాలి. కీబోర్డ ఉపయోగం ఉండదు. రఫ్ వర్క్ చేసుకోవడానికి పరీక్షా కేంద్రంలో పేపర్లను అందజేస్తారు. నిర్ణీత సమయం పూర్తవగానే సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే పరీక్ష పూర్తవుతుంది. - ఎన్. విజయేందర్ రెడ్డి బ్యాంకింగ్ పరీక్షల శిక్షణా నిపుణులు ఎడ్యూ న్యూస్ ఎడెక్స్ ద్వారా కోర్సులందించనున్న భారత విద్యా సంస్థలు మనదేశంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలు నిపుణులైన ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెర మీదకొచ్చిందే ఎడెక్స్. ఇది ఒక ఆన్లైన్ కోర్సులు అందించే ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్లాట్‌ఫాం. ఎడెక్స్.. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందాల ద్వారా ఆన్లైన్లో వివిధ కోర్సులు అందిస్తోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనుభవజ్ఞులైన నిపుణులైన ఫ్యాకల్టీ లభిస్తారు. ఆన్లైన్ ద్వారా వారి పాఠాలను మనం చూడొచ్చు, వినొచ్చు. మనదేశానికి చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఎడెక్స్‌తో చేతులు కలిపాయి. అవి.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - పిలానీ. రాబోయే సంవత్సరాల్లో ఐఐఐటీ - బెంగళూరు.. ఎడెక్స్ ద్వారా డిగ్రీ కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే రెండేళ్లలో మొత్తం 12 కోర్సులను అందిస్తారు. మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానీ కూడా ఎడెక్స్ ద్వారా ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేయనుంది. టెక్నాలజీ, సైన్స్ మొదలైన సబ్జెక్టుల్లో కోర్సులను అభ్యసించవచ్చు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ పొందొచ్చు. ఎడెక్స్ ద్వారా పది ఆన్ క్యాంపస్ కోర్సులు అందించడానికి బిట్స్ పిలానీ రూ. 2 కోట్లు పెట్టుబడి పెట్టింది. వచ్చే మూడేళ్లలో మరో 60 కోర్సులను ఆఫర్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరిన్ని వివరాలకు www.edx.org చూడొచ్చు. ఐఐటీ - బాంబే, వాషింగ్టన్ యూనివర్సిటీల.. ఈ-ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. ఐఐటీ-బాంబే, యూఎస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ-సెయింట్ లూయిస్ కలిసి ఎగ్జిక్యూటివ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఈ-ఎంబీఏ) కోర్సును అందించనున్నాయి. 2015 ప్రారంభంలో ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సు వ్యవధి 18 నెలలు. కోర్సు ఫీజు 55000 యూఎస్ డాలర్ల నుంచి 60000 యూఎస్ డాలర్ల వరకు ఉంటుంది. క్లాసులు ఐఐటీ - బాంబేలో ఉంటాయి. రెండు దేశాలకు చెందిన ఫ్యాకల్టీ పాఠాలు బోధిస్తారు. కోర్సు పూర్తయ్యాక జాయింట్ డిగ్రీ అందిస్తారు. నిఫ్ట్‌లో ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’ దరఖాస్తులకు చివరి తేది జూలై 31 ఫ్యాషన్ అంటే ఆసక్తి.. డిజైనింగ్ రంగంలో కొంత అనుభవం ఉన్న ఔత్సాహికులకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) కోర్సులను ఆఫర్ చేస్తోంది. ‘కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్’లో భాగంగా ఏడాది, ఆరు నెలలు, 3 నెలల కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏడాది కోర్సులు కాంటెంపరరీ టెక్స్టైల్స్ ఫర్ ఇంటీరియర్ స్పేసెస్, కాంటెంపరరీ ఎథ్నిక్ వేర్, ఫ్యాషన్, క్లాతింగ్ టెక్నాలజీ, ఇండియన్ ఫ్యాషన్ అప్పెరల్, బొటిక్ మేనేజ్మెంట్, టెక్స్టైల్ డిజైన్, అప్పెరల్ క్లాతింగ్. ప్రతి విభాగానికి 30 సీట్లు. ఫీజు రూ.60వేల నుంచి రూ.75 వేలు. ఆరు నెలల కోర్సులు అప్పెరల్ డిజైన్, డెవలప్మెంట్(మహిళలకు మాత్రమే) సీట్లు 30, ఫీజు రూ.35,000 మూడు నెలల కోర్సులు గార్మెంట్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇన్ ఉమెన్ వేర్, సిక్స్ సిగ్మా-బ్లాక్ బెల్ట్ సర్టిఫికేషన్. ఒక్కో విభాగంలో 30 సీట్లు, ఫీజు రూ.30,000 అర్హత: 10+2, 10+2+డిప్లొమా. దరఖాస్తుకు చివరి తేది: జూలై 31 వివరాలకు: 040-23110841, 23110630 వెబ్సైట్: www.nift.ac.in నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఉత్తరప్రదేశ్‌లోని రియాండ్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆర్టిసన్ ట్రెయినీ, ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆర్టిసన్ ట్రెయినీ: 129 విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ: 14 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్వూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 11 వెబ్సైట్: http://ntpcrihand.co.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజమ్ (ఉర్దూ) సీట్ల సంఖ్య: 25 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఉర్దూలో పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 8 వెబ్సైట్: www.iimc.gov.in