సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ప్రశంసించింది. ఈ విధానం జంతు ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెటా ఇండియా ట్విటర్ ద్వారా తెలిపింది. పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై పెటా ప్రశంసల జల్లు కురిపించింది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తూ.. ‘థాంక్యూ వైఎస్ జగన్’ అంటూ పెటా ఇండియా ట్వీట్ చేసింది.
చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం
Thank you @ysjagan.
— PETA India (@PetaIndia) June 8, 2020
We are sure this will help animals too!https://t.co/JUVcS9d4Zz
Comments
Please login to add a commentAdd a comment