హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం? | The helmet is used in the manufacture of composite Metal? | Sakshi
Sakshi News home page

హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం?

Published Thu, Jan 22 2015 11:20 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం? - Sakshi

హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం?

ప్రకృతిలో బంగారం, ప్లాటినం లాంటి లోహాలు మాత్రమే స్వేచ్ఛాస్థితిలో లభిస్తాయి. మిగిలినవి ఆక్సైడ్‌లు, సల్ఫైడ్‌లు, కార్బొనేట్లు, బై కార్బొనేట్లు లాంటి సమ్మేళనాల రూపంలో లభిస్తాయి. వీటి నుంచి స్వచ్ఛమైన లోహాన్ని నిష్కర్షణ (వెలికితీసే పద్ధతి) చేసే ప్రక్రియల గురించి చర్చించేదే లోహశాస్త్రం.

లోహశాస్త్రం
ప్రకృతిలో లోహం లభించే వివిధ సమ్మేళనాలనే ‘ఖనిజాలు’ అంటారు. ఖనిజాలన్నింటిలో దేని నుంచి వ్యాపారాత్మకంగా లాభదాయకమైన పద్ధతిలో లోహాన్ని వెలికి తీయగలమో దాన్ని ‘ధాతువు’ అంటారు. అంటే ఖనిజాలన్నీ ధాతువులు కావు. ఉదాహరణకు అల్యూమినియం ఖనిజాలు - కోరండం, బాక్సైట్, క్రయొలైట్. వీటిలో బాక్సైట్ నుంచి మాత్రమే వ్యాపార సరళిలో అల్యూమినియం లోహాన్ని ఉత్పత్తి చేస్తారు. కాబట్టి అల్యూమినియం ధాతువు బాక్సైట్. ధాతువులో ఉండే మలినాలను ‘గాంగ్’ లేదా ‘మాట్రిక్స్’ అంటారు.
     
* ధాతువును గాలి లేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని భస్మీకరణం (Calcination) అంటారు. ఉదాహరణకు లైమ్‌స్టోన్ (ఇ్చఇై3)ను వేడిచేస్తే విఘటనం చెంది ఇై2 విడుదల చేస్తూ కాల్షియం ఆక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.
* ధాతువును గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయడాన్ని భర్జనం (Roasting) అంటారు.
* సాధారణంగా ధాతువు అనేది లోహం మాత్రమే కాకుండా రాళ్లు, ఇసుక, బంకమన్ను, మైకా, క్వార్‌‌ట ్జమొదలైన మలినాలతో కలిసి ఉంటుంది.
* ఒక ధాతువును ద్రవకారి (ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గించేది)ని కలిపి లేదా కలపకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా లేదా సల్ఫైడ్ ఖనిజాన్ని ద్రవస్థితిలో పొందడాన్ని ‘ప్రగలనం’ అంటారు.
* శుద్ధలోహం కంటే మిశ్రమలోహం ఉపయోగకర గుణాలు అధికం. ఉదాహరణకు స్వచ్ఛమైన బంగారానికి కొద్దిగా రాగిని కలిపితే దాని గట్టితనం పెరుగుతుంది.
 
మాదిరి ప్రశ్నలు
1.    అత్యంత సాగే గుణం ఉన్న లోహం ఏది?
     1) వెండి        2) బంగారం
     3) రాగి        4) ఇనుము

2.    కిందివాటిలో అల్యూమినియం ధాతువు ఏది?
     1) హెమటైట్    2) సిన్నబార్
     3) గెలీనా        4) బాక్సైట్
 
3.    జతపరచండి.
     లోహం          ఖనిజం
     ఎ) ఇనుము    1. గెలీనా
     బి) రాగి         2. సిన్నబార్
     సి) సీసం         3. మాగ్నటైట్
     డి) మెర్క్యురీ     4. మాలకైట్
         ఎ     బి     సి     డి
     1)    1     3     2     4
     2)     3     1     4     2
     3)     3     4     1     2
     4)     2     4     3     1
 
4.    ఇనుమును శుద్ధి చేసే బ్లాస్ట్ కొలిమిలో కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో ఐరన్ ఆక్సైడ్‌పై జరిగే ప్రక్రియ?
     1) ఆక్సీకరణం    2) క్షయకరణం
     3) జలవిశ్లేషణ    4) విద్యుద్విశ్లేషణ
 
5.    బ్లాస్ట్ కొలిమిలో ఉపయోగించే గరిష్ట ఉష్ణోగ్రత?
     1) 500 నిఇ     2) 1500 ఓ
     3) 1500 నిఇ    4) 750 నిఇ
 
6.    గుల్లబారి ఉండే ఇనుమును ఏమంటారు?
     1) పిగ్ ఐరన్     2) స్పాంజ్ ఐరన్
     3) కాస్ట్ ఐరన్    4) పోరస్ ఐరన్
 
7.    లైమ్‌స్టోన్‌లో లభించే ప్రధాన ఖనిజం?
     1) మెగ్నీషియం     2) సోడియం
     3) కాల్షియం    4) బేరియం
 
8.    పొటాషియంతో పాటు మెగ్నీషియం లభించే ఖనిజం?
     1) కార్నలైట్     2) హెమటైట్
     3) మాగ్నసైట్     4) మాగ్నటైట్
 
9.    జతపరచండి.
     ఎ) కార్బొనేట్ ఖనిజం    1. కార్నలైట్
     బి) సల్ఫైడ్ ఖనిజం    2. పిచ్ బ్లెండ్
     సి) ఆక్సైడ్ ఖనిజం    3. కాపర్ పెరైటీస్
     డి) క్లోరైడ్ ఖనిజం     4. లైమ్ స్టోన్
         ఎ     బి     సి     డి
     1)     2     1     3     4
     2)     1     3     2     4
     3)     4     3     2     1
     4)     3     2     4     1
 
10.    మోనోజైట్ ఇసుకలో ప్రధానంగా లభించేది?
     1) థోరియం    2) రేడియం
     3) ఫ్రాన్షియం    4) పొలోనియం
 
11.    ఇనుము రకాలలో అత్యంత శుద్ధమైంది?
     1) పోత ఇనుము    2) చేత ఇనుము
     3) స్పాంజ్ ఇనుము    4) దుక్క ఇనుము
 
12.    గాలి లేకుండా ధాతువును వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
     1) భర్జనం        2) భస్మీకరణం
     3) నిక్షాళనం    4) ప్రగలనం
 
13.    భూ పటలంలో పుష్కలంగా లభించే  లోహం ఏది?
     1) జింక్        2) ఇనుము
     3) అల్యూమినియం     4) రాగి
 
14.    తన ద్వారా విద్యుత్తును ప్రవహింపజేయ నివ్వనప్పటికీ (అథమ విద్యుత్ వాహకం) ఉష్ణాన్ని ప్రవహింపజేయనిచ్చేది (ఉష్ణవాహకం) ఏది?
     1) ఆస్బెస్టాస్    2) మైకా (అభ్రకం)
     3) సెల్యులాయిడ్    4) స్టీల్
 
15.    స్టెయిన్‌లెస్ స్టీల్ వేటి మిశ్రమ లోహం?
     1) ఐరన్         2) కార్బన్
     3) క్రోమియం    4) పైవన్నీ
 
16.    ఇత్తడి(బ్రాస్) ఏయే లోహాల మిశ్రమ లోహం?
     1) జింక్, రాగి    2) నికెల్, ఐరన్
     3) నికెల్, జింక్     4) నికెల్, రాగి
 
17.    కంచు (బ్రాంజ్) వేటి మిశ్రమ లోహం?
     1) కాపర్, టిన్     2) జింక్, రాగి
     3) నికెల్, జింక్     4) ఐరన్, కార్బన్
 
18.    సౌరశక్తి పానెల్‌లో ఉపయోగించే మూలకం ఏది?
     1) టైటానియం     2) ఐరన్
     3) సిలికాన్    4) టిన్
 
19.    గన్ మెటల్‌లో ఉండే లోహాలేవి?
     1) ఇనుము, నికెల్     2) ఇనుము, తగరం
     3) రాగి, తగరం    4) రాగి, జింక్
 
20.    పాదరసం ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహం?
     1) అమాల్గం    2) స్టీల్
     3) ఎమల్షన్    4) పాలీమర్
 
21.    మిశ్రమ లోహం అనేది?
     1) ద్రావణం    2) ఎమల్షన్
     3) కొల్లాయిడ్     4) పాలీమర్
 
22.    లోహంలో ధాతువుతో పాటు ఉండే మలినాలను ఏమంటారు?
     1) ఖనిజం    2) గాంగ్
     3) ద్రవకారి    4) ఫ్లక్స్
 
23.    ఇనుము సల్ఫైడ్ ధాతువు ఏది?
     1) మాగ్నటైట్     2) హెమటైట్
     3) ఐరన్ పెరైటీస్     4) మాలకైట్
 
24.    లోహ నిష్కర్షణలో ఉపయోగించే చార్‌‌జ అనేది?
     1) విద్యుదావేశ ఎలక్ట్రోడ్
     2) ధాతువు + కోక్
     3) ధాతువు + సున్నపురాయి + కోక్
     4) ధాతువు + సున్నపురాయి
 
25.    చేత ఇనుములో ఉండే కార్బన్ శాతం?
     1) 0.1%    2) 0.2%     3) 1%    4) 2%
 
26.    కిందివాటిలో సిల్వర్ అనుఘటకంగా లేని మిశ్రమ లోహం ఏది?
     1) హార్‌‌న సిల్వర్    2) జర్మన్ సిల్వర్
     3) రూబి సిల్వర్    4) స్టెర్లింగ్ సిల్వర్
 
27.    హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం?
     1) మాగ్నాలియం     2) క్రోమ్ స్టీల్
     3) మాంగనీస్ స్టీల్     4) నికెల్ స్టీల్

 28.    ముడి ఖనిజంలో లోహంతో పాటు ఇసుక, రాళ్లు, బంకమన్ను మొదలైన మలినాలతో ఉండే మిశ్రమాన్ని ఏమంటారు?
     1) ఫ్లక్స్        2) గాంగ్
     3) పోలింగ్     4) లోహ మలం
 
29.    జర్మన్ సిల్వర్‌లో ఉండే లోహాలేవి?
     1) కాపర్         2) నికెల్
     3) జింక్         4) పైవన్నీ
 
30.    కిందివాటిలో కాయినేజ్ లోహాలు ఏవి?
     1) కాపర్         2) బంగారం
     3) వెండి        4) పైవన్నీ
 
31.    బ్లేడ్ల తయారీలో వాడే స్టీల్ ఏది?
     1) క్రోమ్ స్టీల్    2) మాంగనీస్ స్టీల్
     3) ఇన్వార్ స్టీల్     4) టంగ్‌స్టన్ స్టీల్
 
32.    శస్త్ర చికిత్స సాధనాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
     1) స్టెయిన్‌లెస్ స్టీల్    2) మాంగనీస్ స్టీల్
     3) నిక్రోమ్    4) మాగ్నాలియం
 
33.    ఉక్కు (స్టీల్) తుప్పు పట్టకుండా నిరోధించేది?
     1) నికెల్         2) ఇనుము
     3) క్రోమియం    4) కార్బన్
 
34.    స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఎంతశాతం క్రోమియం ఉంటుంది?
     1) 5-8        2) 12-20
     3) 10-15        4) 1-5
 
35.    అయస్కాంతాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
     1) స్టీల్         2) నిక్రోమ్
     3) ఆల్నికో        4)స్టెయిన్‌లెస్ స్టీల్
 
36.    ఎమాల్గం ఏర్పరచని లోహం ఏది?
     1) ఐరన్         2) ప్లాటినం
     3) సోడియం    4) 1, 2
 
37.    వంటపాత్రల తయారీకి వాడే స్టీలు ఏది?
     1) ఎక్కువ కార్బన్ ఉన్న స్టీల్
     2) ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్
     3) ఇన్వార్ స్టీల్
     4) ఎక్కువ నికెల్ ఉన్న స్టీల్
 
38.    స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం?
     (పోలీస్ కానిస్టేబుల్-2011)
     1) ఇనుము + కార్బన్ + నికెల్
     2) ఇనుము + క్రోమియం + నికెల్
     3) ఇనుము + క్రోమియం + జింక్
     4) ఇనుము + లెడ్
 
39.    ఫ్యూజులు, నిరోధక తీగల తయారీలో వాడే మిశ్రమం?
     1) నిక్రోమ్    2) ఇన్వార్ స్టీల్
     3) బెల్ మెటల్     4) కంచు
 
40.    గేర్లు, బేరింగ్‌ల తయారీలో వాడే మిశ్రలోహం?
     1) గన్ మెటల్    2) ఎలక్ట్రాన్
     3) మాగ్నాలియం    4) బెల్ మెటల్
 
సమాధానాలు
     1) 2;     2) 4;     3) 3;    4) 2;
     5) 3;     6) 2;     7) 3;     8) 1;
     9) 3;     10) 1;     11) 2;     12) 2;
     13) 3;     14) 2;     15) 4;     16) 1;
     17) 1;     18) 3;     19) 3;     20) 1;
     21) 1;     22) 2;     23) 3;     24) 3;
     25) 2;     26) 2;     27) 3;     28) 2;
     29) 4;     30) 4;     31) 1;     32) 1;
     33) 3;     34) 2;     35) 3;     36) 4;
     37) 2;     38) 2;     39) 1;     40) 1.
 
- డాక్టర్ బి. రమేష్
సీనియర్ ఫ్యాకల్టీ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement