బొమ్మలతో పాఠాలు
లెక్కకు మించి పుస్తకాలు... వాటితో కుస్తీలు... పట్టుపట్టి బట్టీ పట్టించే కార్పొరేట్ స్కూళ్లతో పిల్లల చదువు యాంత్రికమవుతోంది. విద్యపై ఆసక్తి పోయి... మార్కుల కోసం చదువుకోవడమే సరిపోతోంది. ఇది చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటారు డాక్టర్ మధులిక. చదువంటే వారికి అర్థమయ్యేలా చెప్పడమేనంటారు. బోధనా పద్ధతుల్లో పీహెచ్‌డీ చేసిన మధులిక... పెయింటింగ్స్ ద్వారా టీచింగ్ చేస్తున్నారు. వీక్‌గా ఉన్న సబ్జెక్టుల్లో ఈ తరహా శిక్షణ ఇచ్చి వారిని బెస్ట్ స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దుతున్న ఆమె ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే చాలామంది విద్యార్థులకు పన్నెండేళ్లకు కూడా ఏబీసీడీలు రావడం లేదు. వారికి ఇంగ్లిష్ భూతంలా కనిపిస్తుంది. అలాంటి వారికి ఏ పద్ధతిలో చెబితో అర్థమవుతుందనేది చాలా రోజులు ఆలోచించా. అధ్యయనం చేశా. చివరకు ఇలా పెయింటింగ్‌తో టీచింగ్ విధానాన్ని ఎంచుకున్నా. అథ్య అనే యన్‌జీవో స్థాపించి.. దాని ద్వారా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ తరహా శిక్షణ ఇస్తున్నా.
ఎవరెవరు ఏ సబ్జెక్టుల్లో బలహీనమో తెలుసుకొని... అందులో వారిని నిష్ణాతులను చేయడమే నా లక్ష్యం. స్కూల్లో ఏడేళ్లు చదివితే గానీ రాని ఇంగ్లిష్‌ను పెయింటింగ్స్ ద్వారా ఒక్క ఏడాదిలో నేర్పిస్తున్నాం. అలా నేర్చుకున్న విద్యార్థులు జనవరిలో గోవాలో జరిగే స్టోరీ ఆఫ్ లైట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా వంద మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
పదిహేను రకాలు...
విద్యార్థులకు సులువుగా బోధించడం కోసమే 15 రకాల ఆర్ట్‌లు నేర్చుకున్నా. పెయింటింగ్స్ ద్వారా ఏ పాఠ్యాంశమైనా పిల్లలకు తేలికగా నేర్పించవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులకు ఈ తరహా బోధన బాగా ఉపయోగపడుతుంది. ఏటా 25 వేల మంది విద్యార్థులను మా అథ్య ద్వారా నిష్ణాతులుగా మార్చడానికి కృషి చేస్తున్నాం. ఇందు కోసం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం.
అన్నింటి కంటే ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. పాఠ్యాంశాలు చెప్పే విధానంలో మార్పు లేకపోవడంతో అయోమయంలో పడుతున్నారు. చెప్పింది అర్థంకాక బట్టీ విధానాన్ని అనుసరిస్తున్నారు. తీరా పరీక్షల సమయంలో గుర్తకురాక ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నా వంతు కృషిగా... పెయింటింగ్స్ ద్వారా బోధిస్తున్నా.
చిన్నారుల కేరింతలతో మాదాపూర్ హోటల్ నోవాటెల్ దద్దరిల్లింది. శనివారం ఇక్కడ నిర్వహించిన ‘కిడ్స్ కార్నివాల్’ విశేషంగా ఆకట్టుకుంది. ఫేస్ పెయింటింగ్, జంపింగ్, రన్నింగ్ తదితర అంశాల్లో బుడతలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎవరికెవరూ తీసిపోనంతగా టాలెంట్ చూపి అదరగొట్టారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా రకరకాల ఆటల్లో పార్టిసిపేట్ చేసి ఉల్లాసంగా గడిపారు.
మాదాపూర్