బ్యాంకు పరీక్షలు రాసే చాలా మంది అభ్యర్థు లకు బ్యాంకింగ్ అవేర్‌నెస్ టాపిక్ కొత్తదే. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. బ్యాంకులో అకౌంట్‌ను ఎలా ఓపెన్ చేయాలి? క్యాష్ డిపాజిట్‌కు ఏ స్లిప్‌ను ఉపయోగి స్తారు? అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత? బ్యాంకులో సాధారణంగా ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండాలి. వీటితోపాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థల వెబ్‌సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మేగజైన్లను క్రమంతప్పకుండా చదవడం ద్వారా ఈ వివరాలను సేకరించవచ్చు. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి.
నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతు న్నాను. బ్యాంకింగ్ ఎవేర్‌నెస్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది?
- ఎం.సందీప్, రాంనగర్
మీ సలహాలు, సందేహాలు
పంపాల్సిన ఈ-మెయిల్:
sakshieducation@gmail.com
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Thu, May 5 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement