కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో పాలిటీకి ఎలా సిద్ధమవ్వాలి? - సంధ్య, సామర్లకోట
ప్రిలిమ్స్‌లో పాలిటీలోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి ఉంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ వంటివి సిలబస్‌లో ఉన్నాయి. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకుని చదవాలి. ప్రశ్నలు కూడా వీటిపైనే ఉంటాయి. అందువల్ల సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి. వీటితోపాటు రాజ్యాంగ చరిత్ర, బ్రిటిషర్ల సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలను అధ్యయనం చేయాలి.
రిఫరెన్స్ బుక్స్
ఎన్‌సీఈఆర్‌టీ 10, 11, 12 తరగతుల సివిక్స్ టెక్ట్స్‌బుక్స్
ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి. బసు
ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం.భక్షి, గత ప్రశ్నపత్రాలు.