కాంపిటీటివ్ కౌన్సెలింగ్ | Competitive counseling | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

Published Wed, Sep 7 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

Competitive counseling

ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నోటిఫికేషన్‌కు సంబంధించి రాతపరీక్షలో సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌కు ఎలా సిద్ధమవ్వాలి? రిఫరెన్స్ పుస్తకాలు తెలియజేయండి?
 - ఎన్.హైమావతి, ఖమ్మం.
 
 పేపర్-2లోStrength of Material, Fluid Mechanics and Machinery సబ్జెక్టులు ఉన్నాయి. సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌ను బట్టి పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించొచ్చు. వీటిలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నుంచి 75 మార్కులకు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లో కొత్తగా ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, థియరీ ఆఫ్ ఫెయిల్యూర్, థిక్ సిలిండర్ తదితర అంశాలను చేర్చారు. ఇంజనీరింగ్ మెకానిక్స్‌లో ఫోర్స్, మూమెంట్స్ ఫ్రిక్షన్, ఈక్విలిబ్రియంలకు సంబంధించిన అంశాలను ముందుగా చదవాలి. దీనివల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లోని ఇతర అంశాలను తేలిగ్గా చదివి, అర్థం చేసుకోవచ్చు. ఫ్లూయిడ్ మెకానిక్స్‌పై పట్టు సాధిస్తే పేపర్-3లోనూ మంచి స్కోర్ సాధించవచ్చు. అందువల్ల దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి.

 రిఫరెన్స్ పుస్తకాలు:
 1. Strength of materials by S.Ramamrutham
2. Fluid mechanics and hydraulic machine by R.K.Bansal
  పేపర్-3లో సివిల్ వారికి దాదాపు పది సబ్జెక్టులు, మెకానికల్ వారికి 13 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 12-15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 రిఫరెన్స్ పుస్తకాలు:
 సివిల్ ఇంజనీరింగ్: R.S.Kurmi; Gupta and Gupta; R.Agor; Dr. P.Jayaram Reddy
 మెకానికల్ ఇంజనీరింగ్: R.K.Jain, R.K.Rajput, R.S.Kurmi, Handa and Handa
 పి.శ్రీనివాసులురెడ్డి
 సీఎండీ, వాణి ఇన్‌స్టిట్యూట్
 
 గ్రూప్స్ పరీక్షల్లో బయాలజీకి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి?
 - ఎస్. రాధిక, నెల్లూరు
 గ్రూప్-1, 2  తదితర సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచారు. దీనిలో భాగంగా జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్‌‌స, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స  రెండు అంశాలుగా ఉంటుందని గమనించాలి.  బయాలజీ విభాగం కోసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (బోటనీ, జువాలజీ) వరకు పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.  మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ, విస్తరణ, సాధారణ, ప్రత్యేక లక్షణాలు తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు విటమిన్‌‌స, హార్మోన్‌‌స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. టెక్నాలజీకి సంబంధించి జీవశాస్త్ర విభాగంలో ముఖ్యంగా మొక్కల్లో, జంతువుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా ఉంది? అది మానవ సంక్షేమానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే  అంశాలు ముఖ్యమైనవి. జెనిటిక్ ఇంజనీరింగ్, డీఎన్‌ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్టుట్యూబ్ బేబీ, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి  క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement