aee
-
ఏఈఈల జీతాల నిలిపివేత.. అలా ఎలా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో 500 మందికి పైగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఇటీవల నిర్వహించిన బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో.. వచ్చే నెలలో వారికి జీతాలు నిలిపివేయాలని డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆదేశించింది. కాగా, జీవో నంబర్ 193 ఆధారంగానే తమకు బదిలీలు నిర్వహించారని, జీతాలు నిలిపివేత సరికాదని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఇదే తరహాలో వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ తమ జీతాలను నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. జీతాలు నిలిపివేస్తే వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.నీటిపారుదల శాఖలో 1,578 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో 1,597 మంది లస్కర్లు, 281 హెల్పర్లు కలిపి.. మొత్తం 1,878 మందిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధిత ప్రాంత ఈఎన్సీ/సీఈల నేతృత్వంలో స్థానిక ఎస్ఈ, స్థానిక డీసీఈలతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.‘గురుకుల’ అభ్యర్థుల ఆందోళనలక్టీకాపూల్ (హైదరాబాద్): గురుకుల నియామక బోర్డు బోధన పోస్టులను నింపే క్రమంలో డిసెండింగ్ విధానం పాటించకపోవడం వల్ల ఒక్కొక్కరికి 2,3,4 పోస్టులు వచ్చాయని, దీని వల్ల 9 వేల పోస్టులలో 3 వేలు మిగిలిపోయాయని తెలంగాణ గురుకుల అభ్యర్థుల (1:2 జాబితా) ప్రతినిధులు ఎండీ ఉస్మాన్, రాజు, టి.ఉమాశంకర్‌లు పేర్కొన్నారు. పోస్టులు నింపే క్రమంలో ముందుగా పీజీటీ, టీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం తమకు న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ వద్ద అభ్యర్థులు బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామంటూ పట్టుపట్టారు. జీవో నం.81ని సడలించి తమకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.చదవండి: రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా! టీజీఎస్పీ సిబ్బంది సెలవుల్లో మార్పులు నిలిపివేత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సెలవుల్లో మార్పులు చేస్తూ ఈ నెల 10న ఇచ్చిన మెమోను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సెలవుల అంశంపై ఇచ్చిన ఉత్తర్వులు సిబ్బందిని అయోమయానికి గురిచేసినట్లు తన దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెటాలియన్లలో సిబ్బంది సమస్యలను తెలుసుకునేందుకు దర్బార్లు ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడాలని, ఆ సమస్యలు తన దృష్టికి తేవాలని అన్ని బెటాలియన్ల కమాండెంట్లను సంజయ్‌కుమార్ జైన్ ఆదేశించారు. బెటాలియన్లలో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సిబ్బంది వ్యక్తిగతంగా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తేవొచ్చని తెలిపారు. అందుకు tgspcontrol@gmail.com లేదా గ్రీవెన్స్ నంబర్ 8712658531కు తెలియజేయాలని స్పష్టం చేశారు. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
టీఎస్పీఎస్సీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ను సిట్ అధికారులు విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధితో రమేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ మద్దెల శ్రీనివాస్ కూతురు.. రమేష్ ద్వారా ఏఈఈ పరీక్ష రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని 75 లక్షలకు డీఈ రమేశ్ బేరం పెట్టినట్లు వెల్లడైంది.. ఏఈఈ పరీక్ష జనవరి 22న జరగ్గా.. పరీక్షకు నెలరోజుల ముందు రమేష్ శ్రీనివాస్‌ను కలిశాడు. పరీక్షకు ముందు ప్రజా ప్రతినిధి కూతురుకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తానని ప్రజాప్రతినిధి చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైస్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బు ఇవ్వలేదని తేలింది. మరోవైపు డీఈ రమేష్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్టుగా గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం ఆడినట్లు తెలిసింది. ఇక రమేష్ విచారణతో మరికొందరు మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
నీటిపారుదలశాఖ ఎఈఈ ఇంట్లో ఏసీబీ దాడులు
-
ఏఈఈ నగేష్ అనుమానాస్పద మృతి
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిధులు గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవీఎంసీ ఏఈఈ సనపల నగేష్(52) మృతి సంచలనంగా మారింది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తేలడం... శరీరంపై గాయాలుండడంతో ఎవరో హత్య చేశారని భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మృతుని కారులో లభించిన సూసైడ్ నోట్లో స్రైబర్ క్రైం ఎస్ఐ రవికుమార్ వేధిస్తున్నాడని నగేష్ ఆరోపిస్తున్నట్లు ఉండడం గమనార్హం. స్థానికులు, కంచరపాలెం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) సనపల నగేష్(52) మాధవదార సీతన్న గార్డెన్స్, నరసింహనగర్‌లో కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో చిన్న పని ఉందని నగేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తర్వాత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇంతలో గురువారం ఉదయం మురళీనగర్ బృందావన్ పార్క్ సమీపంలో రజకుల దుకాణం వద్ద ఏఈఈ నగష్ మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మృతదేహంపై గాయాలుండడంతో ఎవరో కొట్టి చంపి ఉంటారని నగేష్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి రజకుల దుకాణం వద్ద బల్లపై వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్ సీసా ఉండడంతో... ఎవరితోనైనా కలిసి మద్యం సేవించారా..? లేక విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతుని ఇంటి వద్ద కారులో సూసైట్ నోట్ లభించడం... అందులో సైబర్ క్రైం ఎస్ఐ రవికుమార్ వేధిస్తున్నారని ఆరోపించడంతో మరింత గందరగోళం నెలకొంది. కంచరపాలెం సీఐ భవానీ ప్రసాద్, ఎస్ఐ మురళి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. మృతుని ముఖంపై గాయాలున్నట్లు గుర్తించామని, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. సైబర్ క్రైం ఎస్ఐ నల్లి రవికుమార్ వేధిస్తున్నాడని సూసైడ్ నోట్లో చేసిన ఆరోపణలపై కూడా వాస్తవాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. నగేష్ మృతి విషయం తెలుసుకున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు, సహోద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. నగేష్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు కిరణ్ కుమార్ బీటెక్ చదువుతున్నాడు. కుమార్తె తేజ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. రూ.55వేలు కాజేశారని కేసు స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు 2016లో చేపట్టారు. ఆ సమయంలో జోన్ – 6లో ఏఈగా నగేష్ విధులు నిర్వహించారు. లబ్ధిదారుల సర్వే కోసం సహాయకులుగా కొందరు కళాశాల విద్యార్థులు వచ్చారు. అయితే వారు కొన్నాళ్లు ఇక్కడ పనిచేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వారే ఏఈ నగేష్‌కు కేటాయించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ సాయంతో జోన్ – 1లో కొందరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లుగా చూపించి సుమారు రూ.55వేలు కాజేసినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. అనంతరం దీనిపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో ఈ కేసు సైబర్ క్రైమ్‌కు బదిలీ అయిది. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ నెల 25న 41ఏ సీఆర్పీసీ నోటీసులు నగేష్‌కు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరైన నగేష్‌కు బెయిల్ మంజూరైనట్లు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను విచారించకుండా తననే ఇరికించారని నగేష్ తన సూసైడ్ నోట్లో సైబర్ క్రైం ఎస్ఐ నల్లి రవికుమార్‌పై ఆరోపణలు చేశారు. నన్ను ఇరికించాలని వేధిస్తున్నారు... మృతుడు నగేష్ కారులో ఒక సూసైడ్ నోట్ దొ రికింది. అందులో ఏముందంటే... ‘‘స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొ డ్లు నిర్మించే పథకంలో సహాయకులుగా కొందరు విద్యార్థులు నాతో కలిసి పనిచేశారు. వారు పలుమార్లు నా ఫోన్ తీసుకుని వినియోగించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో జాబితాలో లేని వ్యక్తుల పేరున బిల్లులు మంజూరైనట్లు గుర్తించిన జీవీఎంసీ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నన్ను పిలిచి విచారించారు. తనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. వారిలో సంపత్, అజయ్ ఉన్నారన్నారు. ఇందులో కీలకమైన సందీప్‌ను పిలిపించలేదు. సైబర్ క్రైమ్ ఎస్ఐ నల్లి రవికుమార్ ఏ1, ఏ2ల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నన్ను ఇరికించేందుకు యత్నిస్తున్నాడు... ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని’’ కోరారు. ఈ సూసైడ్ నోటు బుధవారం రాసినట్లు సంతకం చేసి, తేదీని పేర్కొన్నాడు. -
ఉన్నవారికే పనిలేదు...కొత్తగా ముగ్గురు!
రత్నగిరిపై కొత్తగా ఏఈఈలను నియమించిన సర్కారు కాంట్రాక్ట్ పద్ధతిని నెలకు రూ.30 వేల వేతనం ముగ్గురికీ ఏటా రూ.పది లక్షల అదనపు భారం అన్నవరం :తాదూర కంత లేదు..మెడకో డోలు అన్న చందంగా అన్నవరం దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకే పెద్దగా పనిలేని స్థితిలో మరో ముగ్గురు ఏఈఈలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ.30 వేలు వేతనం చెల్లించేలా కాంట్రాక్ట్ పద్ధతిపై ముగ్గురిని నియమించినట్టు ఈఓ కే నాగేశ్వరరావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ద్వారా వారిని ఎంపిక చేసిందని తెలిపారు. ఈ ముగ్గురిలో దేవరకొండ సత్యచైతన్య, గాలి సురేష్‌ను సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో, పీ వేంకటేశ్వర్లును ఎలక్ట్రికల్ విభాగంలో నియమించారు. ఖర్చు తప్ప ఒరిగేదేమిటి? దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ప్రస్తుతం ఒక ఈఈ, ఇద్దరు డీఈఈలు, ఐదుగురు ఏఈఈలు ఉన్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో చేపట్టిన నిర్మాణ పథకాలు పెద్దగా ఏమీ లేవు. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనులు మినహా తరువాత చేపట్టిన పనులంటూ ఏమీ లేవు. దేవస్థానం స్థలాల చుట్టూ గోడలు కట్టడం, చదును చేయడం వంటి పనులు మాత్రమే చేస్తున్నారు. సత్యగిరి మీద స్మార్త, ఆగమ పాఠశాల పనులు మాత్రం కొనసా...గుతూ ఉన్నాయి. యాగశాల, అన్నదాన భవనం, తదితర నిర్మాణాలలో కొన్ని దాతల కోసం ఎదురుచూస్తుండడంతోను, మరికొన్ని పనులకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరో ముగ్గురు ఏఈఈల వల్ల దేవస్థానానికి ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రశాంతంగా ఏఈఈ పరీక్ష
కాకినాడ సిటీ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS (ఏపీపీఎస్సీ) ద్వారా నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) రాత పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, అమలాపురంలలో 15 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. 5,621 మంది అభ్యర్థులకు గాను 4,182 మంది హాజరయ్యారు. కాకినాడలోని పలు సెంటర్లను జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, ఆర్డీఓ బి.ఆర్.అంబేడర్, ఏపీపీఎస్సీ సభ్యుడు కె.పద్మరాజు పరిశీలించారు. హాల్ టికెట్లలో పొరపాట్లు ఏఈఈ రాత ఈ పరీక్షలకు సంబంధించి పలువురు అభ్యర్థుల హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయి. కాకినాడలోని పలు సెంటర్లతో పాటు రామచంద్రపురం, రాజమండ్రిల్లో నిర్వహించిన కేంద్రాల్లో 12 మంది అభ్యర్థులకు ఇద్దరిద్దరికి ఒకే నంబర్ హాల్‌టికెట్లపై రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. మెకానికల్ సబ్జెక్టు అభ్యర్థులకు సివిల్ అని, సివిల్ అభ్యర్థులకు మెకానికల్ అని ఐదుగురికి వచ్చారు. దీంతో జిల్లా అధికారులు పొరపాట్లను గుర్తించి పబ్లిక్ సర్వీస్ కమిష¯ŒS ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ఒకే నంబర్ హాల్‌టికెట్ వచ్చిన అభ్యర్థులకు నంబర్ ’ఏ’ పెట్టి పరీక్షకు అనుమతించాలని, అలాగే సివిల్, మెకానికల్ అని హాల్ టికెట్ వచ్చిన తప్పులను అభ్యర్థులే సరిదిద్దుకొని డిక్లరేష¯ŒS తీసుకొని పరీక్షకు అనుమతించాలని సూచించడంతో ఆ మేరకు అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిపై జేసీ రాధాకృష్ణమూర్తిని వివరణ కోరగా కొందరి హాల్టికెట్లలో పొరబాట్లు వచ్చాయన్నారు. ఏపీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు అభ్యర్థులను పరీక్షకు అనుమతించామన్నారు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నోటిఫికేషన్‌కు సంబంధించి రాతపరీక్షలో సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌కు ఎలా సిద్ధమవ్వాలి? రిఫరెన్స్ పుస్తకాలు తెలియజేయండి? - ఎన్.హైమావతి, ఖమ్మం. పేపర్-2లోStrength of Material, Fluid Mechanics and Machinery సబ్జెక్టులు ఉన్నాయి. సివిల్, మెకానికల్ కామన్ పేపర్‌ను బట్టి పటిష్ట ప్రణాళిక ప్రకారం సిద్ధమైతే వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించొచ్చు. వీటిలో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నుంచి 75 మార్కులకు, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మెషినరీ నుంచి 75 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్‌లో కొత్తగా ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, థియరీ ఆఫ్ ఫెయిల్యూర్, థిక్ సిలిండర్ తదితర అంశాలను చేర్చారు. ఇంజనీరింగ్ మెకానిక్స్‌లో ఫోర్స్, మూమెంట్స్ ఫ్రిక్షన్, ఈక్విలిబ్రియంలకు సంబంధించిన అంశాలను ముందుగా చదవాలి. దీనివల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లోని ఇతర అంశాలను తేలిగ్గా చదివి, అర్థం చేసుకోవచ్చు. ఫ్లూయిడ్ మెకానిక్స్‌పై పట్టు సాధిస్తే పేపర్-3లోనూ మంచి స్కోర్ సాధించవచ్చు. అందువల్ల దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి. రిఫరెన్స్ పుస్తకాలు: 1. Strength of materials by S.Ramamrutham 2. Fluid mechanics and hydraulic machine by R.K.Bansal పేపర్-3లో సివిల్ వారికి దాదాపు పది సబ్జెక్టులు, మెకానికల్ వారికి 13 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 12-15 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్ పుస్తకాలు: సివిల్ ఇంజనీరింగ్: R.S.Kurmi; Gupta and Gupta; R.Agor; Dr. P.Jayaram Reddy మెకానికల్ ఇంజనీరింగ్: R.K.Jain, R.K.Rajput, R.S.Kurmi, Handa and Handa పి.శ్రీనివాసులురెడ్డి సీఎండీ, వాణి ఇన్స్టిట్యూట్ గ్రూప్స్ పరీక్షల్లో బయాలజీకి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి? - ఎస్. రాధిక, నెల్లూరు గ్రూప్-1, 2 తదితర సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచారు. దీనిలో భాగంగా జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స, ఎన్విరాన్మెంటల్ సైన్స రెండు అంశాలుగా ఉంటుందని గమనించాలి. బయాలజీ విభాగం కోసం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (బోటనీ, జువాలజీ) వరకు పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మొక్కలు, జంతువులు, వాటి వర్గీకరణ, విస్తరణ, సాధారణ, ప్రత్యేక లక్షణాలు తదితర అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు విటమిన్స, హార్మోన్స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. టెక్నాలజీకి సంబంధించి జీవశాస్త్ర విభాగంలో ముఖ్యంగా మొక్కల్లో, జంతువుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఏవిధంగా ఉంది? అది మానవ సంక్షేమానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే అంశాలు ముఖ్యమైనవి. జెనిటిక్ ఇంజనీరింగ్, డీఎన్ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్టుట్యూబ్ బేబీ, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. -
ఏఈఈ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం వద్దు
తెలంగాణ విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం మధ్యంతర ఉత్తర్వులు జారీ విచారణ ఈ నెల 20కి వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 20 వరకు తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని, విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ పోస్టుల నిబంధనల్లో చేసిన సవరణలతోపాటు జారీ అయిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని...అందువల్ల కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించి వాటిలో ఏదో ఒక జోన్లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి చదివిన వారినే స్థానికులుగా పరిగణిస్తున్నాయన్నారు. ఈ జోన్లలో భర్తీ కాని పోస్టులేవైనా మిగిలితే వాటిని ఆ జోన్లలో స్థానిక పోస్టులుగా పరిగణించి 70 శాతం స్థానికులకు, 30 శాతం స్థానికేతరులకు కేటాయించే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నాయని, కానీ నోటిఫికేషన్‌ను లోతుగా పరిశీలిస్తే 100 శాతం పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే పరిమితమయ్యేలా ఉందన్నారు. ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పార్లమెంటు మాత్రమే చేయాలి తప్ప, విద్యుత్ సంస్థలు కాదన్నారు. ప్రస్తుత విధానం వల్ల ఏఈఈ పోస్టులకు దేశంలో ఏ ఒక్కరూ అర్హులు కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిని ఎలా సమర్థించుకుంటారని తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ప్రశ్నించింది. అయితే తాము చట్ట విరుద్ధంగా ఏమీ చేయడం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించే రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని రామచంద్రరావు తెలిపారు. విద్యుత్ సంస్థ ఎక్కడ ఉంటుందో దాని పరిధిలోని అభ్యర్థులే పోస్టులకు అర్హులని, ఇది తాము కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానం కింద పోస్టులను భర్తీ చేశారని రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలపై సంతృప్తి చెందని ధర్మాసనం... 70 శాతం పోస్టులను స్థానికులకు రిజర్వ్ చేసినప్పుడు మిగలిన 30 శాతం పోస్టులను ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలవారికీ అందుబాటులో ఉంచాలని, ఇది తమ ప్రాథమిక అభిప్రాయమని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పోస్టుల భర్తీ ప్రక్రియ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా రాతపరీక్ష పూర్తయిందని... ఫలితాల వెల్లడికి 2-3 వారాలు పడుతుందని విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ప్రియాంకా సింగ్ తెలిపారు. దీంతో ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను 20న చేపడతామంటూ, అప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవద్దని విద్యుత్ సంస్థలను ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
కేటీఆర్ పరిశ్రమ స్థాపిస్తే ఉద్యోగాన్ని వదిలివెళ్తారా?
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ పరిశ్రమను స్థాపిస్తే ప్రభుత్వోద్యోగాన్ని వదిలి వెళ్తారా? తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, పరిశ్రమలేమిటి? మిషన్ కాకతీయతో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది?- టీఎస్పీఎస్సీ మొదటిసారి నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నల సరళి ఇది! ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులకు టీఎస్పీఎస్సీ బుధవారం ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను ఈ తరహా ప్రశ్నలడిగారు. మొత్తం 16 పోస్టులకు 32 మందికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో ప్రకటిస్తారు. జేఈఈ దరఖాస్తుల గడువు పెంపు డిసెంబర్ 31తో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును జనవరి 11వ తేదీ వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పొడగించింది. అభ్యర్థులు 11వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. టీఎస్ఐఐసీ ఎండీకి ఉద్యోగ రతన్ అవార్డు తెలంగాణ పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) వీసీ, ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డికి ఉద్యోగ రతన్ అవార్డు లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అందించిన ఈ అవార్డును బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన అందుకున్నారు. నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. -
30న ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు
- జనవరిలో మిగితా పోస్టులన్నింటికి వరుసగా నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 1:2 చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం బీసీ క్రీమీలేయర్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30వ తేదీన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) మెకానికల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించి, జనవరి నెలలో అన్ని రకాల పోస్టులకు ఇంటర్వ్యూలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ అధికారి పోస్టులకు మినహా ఇంటర్వ్యూలు ఉన్న మిగితా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణకు చర్యలు చేపడుతోంది. ఇక నీటి పారుదల, ఆయక ట్టు అభివృద్ధి శాఖలో ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఈనెల 30న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ జాబితాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వారికి 30వ తేదీన ఉదయం 9 గంటలకు కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్లు, ఖాళీల వివరాలు, చెక్ లిస్టులు, అటెస్టేషన్, ఇతర ఫారాలు అన్నింటిని ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత నుంచి తమ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటన్నింటిని ఫిల్ చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అంద జేయాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను రెండు సెట్ల జిరాక్స్ కాపీలను (అటెస్టెడ్) అందజేయాలని, బీసీలు అయితే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను అందజేయాలని కోరారు. అభ్యర్థులు ఉద్యోగం వస్తుందా? లేదా? అన్నది చూడకుండా నాన్ క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే ఆయా సర్టిఫికెట్లను తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. -
విద్య, ఉద్యోగ సమాచారం
దసరా తర్వాత ఏఈఈ ఇంటర్వ్యూలు! నేడు ప్రాథమిక కీ విడుదల సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి దసరా తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఈ పోస్టులకు ఆదివారం ఏర్పాటు చేసిన రాత పరీక్ష జరుగుతున్న తీరును టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఈఈ (మెకానికల్) ప్రాథమిక కీని ఈ నెల 19న (సోమవారం) విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్థులు తమ జవాబు పత్రాలను ప్రత్యేక లింకు ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు సంబంధించి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వాటి కీ, జవాబు పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడంలో కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 85%, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షకు 83%, ఏఈఈ రాత పరీక్షకు 63% మంది అభ్యర్థులు హాజరైనట్లు వివరించారు. ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆదివారం ముగిసింది. సీట్ అలాట్మెంట్ కార్డులను సంబంధింత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28లోపు సంబంధిత కళాశాలల్లో అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి. మొదటి, తుది దశ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 202 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 15,365 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఈ మేరకు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక ఫీజులతో కలిపి మొత్తం రూ. 16,500కు మించి ఒక్క పైసా కూడా కళాశాలల యాజమాన్యాలకు చెల్లించనవసరం లేదని కన్వీనర్ అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎవరైనా అదనంగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఓయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. 292 ఎంఈడీ సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్: ఎంఈడీ కౌన్సెలింగ్‌లో భాగంగా 4 వర్సిటీల పరిధిలోని 292 మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ) సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మిషన్స్ డెరైక్టర్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో దాదాపు 1,200 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అప్పటికప్పుడే సీట్లు భర్తీ చేశారు. మొత్తం 340 సీట్లలో 292 భర్తీ అయ్యాయి. ఈ నెల 31న తుది కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. -
ఏఈఈ, ఏవో పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 17, 18వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్‌లో 48 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు దాదాపు 18 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, 18న ఉదయం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు 17న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని... ఏఈఈ పోస్టులకు 18న ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం ఆప్షనల్ పేపర్ ఉంటుందని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్ తెలుగు, ఇంగ్లిషు రెండు మాధ్యమాల్లోనూ ఉంటుందని.. ఆప్షనల్ (సబ్జెక్టు) పేపర్ మాత్రం ఇంగ్లిషులోనే ఉంటుందని తెలిపారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష కేంద్రాన్ని ముందుగానే చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో రిజిస్ట్రేషన్, తనిఖీలకు సమయం పడుతుందని, అందువల్ల ముందుగానే పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఉదయం పరీక్షకు 8:30 నుంచి 9:15 లోపే, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి 1:45 లోపే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పకడ్బందీగా నిర్వహించేందుకు నలుగురు జోనల్ అధికారులను, 800 మంది ఇన్విజిలేటర్లను, 700 మంది సపోర్టింగ్ స్టాఫ్, 150 మంది కమిషన్ అబ్జర్వర్లు, 12 స్పెషల్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్సైట్లో (tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
ప్రారంభమైన AEE ఆన్లైన్ పరీక్ష
-
18న ఏఈఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
జోనల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాంనాథ్ కిషన్ కేయూ క్యాంపస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్‌ను ఈనెల 18న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నామని అటెస్ట్ జోనల్ కో-ఆర్డినేటర్, కేయూ ప్రొఫెసర్ రాంనాథ్కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుందన్నారు. వరంగల్ జోన్లో 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 2,860 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారన్నారు. మొదటి సెషన్ ఉదయం జరిగే పరీక్షకు అభ్యర్థుల ఉదయం 8-30గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారన్నారు. రెండో సెషనల్లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉదయం 9-15 గంటల తరువాత, మధ్యాహ్నం పరీక్షకు 1-45గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోరన్నారు. -
తెలుగులో ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు
హైదరాబాద్ : ఏఈఈ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్పీ ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి వెల్లడించారు. ఆదివారం జరగనున్న ఈ ఏఈఈ ఆన్లైన్ పరీక్షపై శుక్రవారం హైదరాబాద్‌లో టీఎస్పీఎస్పీ ఛైర్మన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ ప్రొ. గంటా చక్రపాణి తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి. -
మరో 495 ఏఈ పోస్టులు
-
మరో 495 ఏఈ పోస్టులు
నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ.. 1,058కి పెరిగిన పోస్టుల సంఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 495 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల 29న 563 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా 495 పోస్టులను అదే నోటిఫికేషన్ కింద చేర్చింది. దీంతో ఏఈ పోస్టుల సంఖ్య 1,058కి చేరింది. వివిధ శాఖల నుంచి వివరణల తరువాత ఈ పోస్టులను చేర్చినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ తెలిపారు. ఒకే నోటిఫికేషన్ కింద ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 25న పరీక్ష ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలను www.tspsc.gov.in లో పొందవచ్చన్నారు. పోస్టుల వివరాలు శాఖ పోస్టులు ఏఈ (సివిల్) ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 226 ఏఈ (మెకానికల్) ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ 26 ఏఈ (సివిల్) పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ 243 మొత్తం 495