సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ను సిట్ అధికారులు విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధితో రమేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ మద్దెల శ్రీనివాస్ కూతురు.. రమేష్ ద్వారా ఏఈఈ పరీక్ష రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని 75 లక్షలకు డీఈ రమేశ్ బేరం పెట్టినట్లు వెల్లడైంది..
ఏఈఈ పరీక్ష జనవరి 22న జరగ్గా.. పరీక్షకు నెలరోజుల ముందు రమేష్ శ్రీనివాస్‌ను కలిశాడు. పరీక్షకు ముందు ప్రజా ప్రతినిధి కూతురుకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తానని ప్రజాప్రతినిధి చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైస్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బు ఇవ్వలేదని తేలింది. మరోవైపు డీఈ రమేష్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్టుగా గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం ఆడినట్లు తెలిసింది. ఇక రమేష్ విచారణతో మరికొందరు మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!
Comments
Please login to add a commentAdd a comment