రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 495 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల 29న 563 ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా 495 పోస్టులను అదే నోటిఫికేషన్ కింద చేర్చింది. దీంతో ఏఈ పోస్టుల సంఖ్య 1,058కి చేరింది. వివిధ శాఖల నుంచి వివరణల తరువాత ఈ పోస్టులను చేర్చినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ తెలిపారు. ఒకే నోటిఫికేషన్ కింద ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 25న పరీక్ష ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలను www.tspsc.gov.in లో పొందవచ్చన్నారు.