18న ఏఈఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ | AEE computer based test on september 18 | Sakshi
Sakshi News home page

18న ఏఈఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

Published Fri, Sep 18 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

AEE computer based test on september 18

జోనల్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ రాంనాథ్ కిషన్
కేయూ క్యాంపస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ను ఈనెల 18న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నామని అటెస్ట్ జోనల్ కో-ఆర్డినేటర్, కేయూ ప్రొఫెసర్ రాంనాథ్‌కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుందన్నారు. వరంగల్ జోన్‌లో 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.

మొత్తం 2,860 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారన్నారు. మొదటి సెషన్ ఉదయం జరిగే పరీక్షకు అభ్యర్థుల ఉదయం 8-30గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారన్నారు. రెండో సెషనల్‌లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉదయం 9-15 గంటల తరువాత, మధ్యాహ్నం పరీక్షకు 1-45గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించబోరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement