సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ పరిశ్రమను స్థాపిస్తే ప్రభుత్వోద్యోగాన్ని వదిలి వెళ్తారా? తెలంగాణ ఏర్పడ్డాక కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, పరిశ్రమలేమిటి? మిషన్ కాకతీయతో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది?- టీఎస్‌పీఎస్సీ మొదటిసారి నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నల సరళి ఇది! ఇంజనీర్ (ఏఈఈ) పోస్టులకు టీఎస్‌పీఎస్సీ బుధవారం ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను ఈ తరహా ప్రశ్నలడిగారు. మొత్తం 16 పోస్టులకు 32 మందికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో ప్రకటిస్తారు.
జేఈఈ దరఖాస్తుల గడువు పెంపు
డిసెంబర్ 31తో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును జనవరి 11వ తేదీ వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పొడగించింది. అభ్యర్థులు 11వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
టీఎస్‌ఐఐసీ ఎండీకి ఉద్యోగ రతన్ అవార్డు
తెలంగాణ పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) వీసీ, ఎండీ ఇ.వి.నర్సింహారెడ్డికి ఉద్యోగ రతన్ అవార్డు లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అందించిన ఈ అవార్డును బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన అందుకున్నారు. నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ పరిశ్రమ స్థాపిస్తే ఉద్యోగాన్ని వదిలివెళ్తారా?
Published Thu, Dec 31 2015 2:21 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement