పోటీపరీక్షల కోణంలో కెమిస్ట్రీకి సంబంధించి జీవాణువులు, పాలిమర్లు, ఔషధాలు తదితర అంశాలను ఎలా అధ్యయనం చేయాలి?
- జి.ప్రసాద్, హైదరాబాద్.
జీవ వ్యవస్థ నిర్మాణం, పని చేయడంలో వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్‌లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలిమర్ల అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్‌లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాలపై అవగాహన పెంపొందించుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాలను కూడా తెలుసుకోవాలి.
మన ఉదరంలో బలమైన హైడ్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుపై పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు అన్నీ ఆమ్లాలే.
ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. వివిధ ఆమ్లాలు, క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను తెలుసుకోవాలి.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Tue, Oct 4 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
Advertisement