పోటీ పరీక్షల దృష్ట్యా ‘పంచవర్ష ప్రణాళికలు’ పాఠ్యాంశాన్ని ఎలా చదవాలి? - జి.రవీందర్, హైదరాబాద్.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ‘భారతదేశ ప్రణాళికలు’ అధ్యయనం చాలా కీలకమైంది. ప్రతి పరీక్షలోనూ ఈ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ముందుగా ప్రణాళికలు - వాటి కాల వ్యవధి తెలుసుకోవాలి. ప్రతి ప్రణాళికకు ఒక ప్రాధాన్యత ప్రకటిస్తారు. ప్రాధాన్యత, ఆ ప్రణాళికలో పొందుపర్చిన వివిధ అంశాలను అధ్యయనం చేయాలి.
ఉదా: మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, రెండో ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా 2వ ప్రణాళికలో మూడు భారీ ఇనుము-ఉక్కు కర్మాగారాలు నిర్మించారు. వాటిని ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు? ఏ దేశ ఆర్థిక సహాయం పొందారు? అనే అంశాలపై దృష్టి సారించాలి.
దేశ ఆర్ధిక పరిస్థితులు మారుతున్న తరుణంలో వాటికి అనుగుణంగా ప్రణాళిక లక్ష్యాలు, వృద్ధిరేట్లను మారుస్తున్నారు. వాటిని తెలుసుకుంటుండాలి. ప్రారంభంలో ప్రణాళికలు కేంద్రీకృత ధోరణులుగా ఉండేవి. ప్రస్తుతం వాటి స్వరూపం వికేంద్రీకరణ, సూచనాత్మక ప్రణాళికల వైపు మారింది. ఇలాంటి పదాలు - వాటి అర్థాలు, వాటి వెనుక ఉన్న వ్యూహాలు అధ్యయనం చేయాలి. వివిధ ప్రణాళికల రూపకల్పనలో తీసుకున్న వృద్ధి వ్యూహాలను అవగాహన చేసుకోవాలి.
ఉదా: మొదటి ప్రణాళిక ‘హారాడ్-డోమార్ మోడల్, రెండో ప్రణాళిక.. పీసీ మహలనోబిస్ మోడల్.
దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందిస్తుంది. వివిధ ప్రణాళికల వారీగా పథకాలు, వాటి ముఖ్య లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
Published Tue, Nov 4 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement