సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్రలో ఏ ప్రశ్నలు.. | Which questions will get from History of Civils 2013 prelims paper 1? | Sakshi
Sakshi News home page

సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్రలో ఏ ప్రశ్నలు..

Published Tue, Jul 22 2014 12:08 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM

సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్రలో ఏ ప్రశ్నలు.. - Sakshi

సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్రలో ఏ ప్రశ్నలు..

సివిల్స్ 2013 ప్రిలిమ్స్ పేపర్-1లో చరిత్ర నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో విశ్లేషణ ఇవ్వండి?       
- ఎం.రాధిక, మల్కాజ్‌గిరి
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: కొత్త సిలబస్ ప్రారంభమైన దగ్గర నుంచి (2011) చూస్తే ఇప్పటి వరకు చారిత్రక అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. 2013లో ప్రశ్నపత్రం సమతూకంగానే ఉంది. ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి దాదాపు 50 శాతం ప్రశ్నలు రాగా, మధ్య, ఆధునిక చరిత్ర నుంచి 50 శాతం వచ్చాయి.  గతంలో రాజకీయ చరిత్రకు సంబంధించి ఒకట్రెండు ప్రశ్నలు అడిగేవారు. ఈసారి ఆ విభాగాన్ని పక్కనపెట్టేశారు. ప్రాచీన భారత దేశ చరిత్ర నుంచి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, ఆర్కిటెక్చర్‌కు  సంబంధించిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చారు.
 Ex: Consider the following historical places:
     1. Ajanta Caves, 2. Lepakshi Temple, 3. Sanchi Stupa
     Which of the above places is/are also known for mural paintings?
     a) 1 only    b) 1 and 2 only
     c) 1, 2, and 3    d) None
 జవాబు: c
 -   గతంతో పోలిస్తే 2013లో అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయి. కొన్ని డెరైక్ట్‌గా వస్తే మరికొన్ని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వచ్చాయి.
 Ex: The Chinese traveller Yuan Chwang (Hiuen Tsang) who visited India recorded the general conditions and culture of India at that time. In this context, which of the following statements is/are correct?
 1.    The roads and river routes were completely immune from robbery.
 2.    As regards punishment for offences, or deals by fire, water and poison were the instruments for determining the innocence or guilt of person.
 3.    The tradesmen had to pay duties at ferries and barrier stations.
     Select the correct answer using the codes given below.
     a) 1 only    b) 2 and 3 only
     c) 1 and 3 only    d) 1, 2 and 3
 జవాబు: b
 ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ఓ అంశాన్ని విశ్లేషణాత్మక ధోరణితో చదవాల్సిందే. గతంలో హిస్టరీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అభ్యర్థిని తికమక పెట్టేవి. ప్రశ్నను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టేది. 2013లో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు.
 
 ఇన్‌పుట్స్: యాకూబ్ బాషా, సీనియర్ ఫ్యాకల్టీ
 బ్యాంక్స్ పీవోస్ పరీక్ష రాయాలనుకుంటున్నాను. ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? పరీక్ష ఎవరు నిర్వహిస్తారు? అర్హతలు.. పరీక్ష విధానం తెలియజేయండి?
- అపరాల స్వాతి, సైదాబాద్
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. దాని గ్రూప్ బ్యాంకులు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి ఏటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది. పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఖాళీలను బట్టి ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్న ఈ పరీక్ష స్కోర్.. మార్చి 31, 2016 వరకు చెల్లుతుంది.
 
 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు.
 వయసు: జూలై 1, 2014 నాటికి 20 - 30 ఏళ్లు (జూలై 2, 1984- జూలై 1, 1994 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్)లకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
 
 పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో భాగంగా.. రీజనింగ్ (50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్  (40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్  (50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (స్పెషల్ రిఫరెన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ) (40 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 మార్కులు)లపై ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధానాలకు ఇచ్చే మార్కుల నుంచి  0.25 మార్కుల కోత విధిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహాయించి మిగిలిన అన్ని విభాగాలను ఇంగ్లిష్ లేదా హిందీలో రాసుకోవచ్చు.
 
 ఇంటర్వ్యూ: పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి. ప్రతి రాష్ట్రంలో  ఒక బ్యాంక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. వీటికి కావాల్సిన సహాయాన్ని ఐబీపీఎస్ అందిస్తుంది.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
 దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులకు రూ.100, ఇతరులకు రూ.600.
 ఐబీపీఎస్ ఆధారంగా ఉద్యోగాలిస్తున్న బ్యాంకులివే..
 అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొ రేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవ ర్‌సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.
 ఆన్‌లైన్ దరఖాస్తులు: జూలై 22 - ఆగస్టు 11
 ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్ 11, 12, 18, 19; నవంబర్ 1, 2 తేదీల్లో..
 ఇంటర్వ్యూలు: జనవరి, 2015
 వెబ్‌సైట్:  www.ibps.in
 ఇన్‌పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి,
 సీనియర్ ఫ్యాకల్టీ, బ్యాంకింగ్
 
 జాబ్స్, అడ్మిషన్స్ అలర్‌‌ట్స
 షిిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టుల సంఖ్య: 40
 అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్  ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 24 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 11
 వెబ్‌సైట్: www.shipindia.com
 
 ఆయిల్ ఇండియా లిమిటెడ్
 ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్ట్: అటెండెంట్ - 7, అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 25,
 వెబ్‌సైట్: www.oil-india.com\
 
 ఎన్టీయార్ వర్సిటీ - బీయూఎంఎస్ ఎంట్రన్స్ టెస్ట్
 డాక్టర్ ఎన్టీయార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ బీయూఎంఎస్  ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది.
 బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ ఎంట్రన్స్ టెస్ట్ - 2014
 కాలపరిమితి: నాలుగేళ్లు, అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.  పదో తరగతిలో  ఉర్దూ/అరబిక్/పర్షియన్ లాంగ్వేజ్‌ను ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. వయసు: డిసెంబరు 31, 2014నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 8
 వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in/
 
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ హైదరాబాద్, పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
 అర్హతలు:  50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమాలో ప్రవేశానికి సంబంధిత రంగంలో మూడు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
 ఎంపిక: క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ స్కోరు ఆధారంగా.
 వెబ్‌సైట్: www.ipeindia.org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement