Ranbir Kapoor Jungle Proposal For Alia Bhatt Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor and Alia Bhatt: ఆలియాకు రణ్‌బీర్‌ ప్రపోజ్.. ఏడ్చేసిన నటి..!

Published Thu, Dec 29 2022 6:50 PM | Last Updated on Thu, Dec 29 2022 7:28 PM

Ranbir Kapoor jungle proposal for Alia Bhatt Photo goes viral - Sakshi

బాలీవుడ్‌ ‍రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ ‍కపూర్‌ గురించి పరిచయం ‍అక్కర్లేదు. అంతలా ఫేమస్ అయింది ఈ బాలీవుడ్ జంట. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు‌ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది? మొదట ఆలియా భట్‌ ప్రపోజ్ చేసిందా? లేదా రణ్‌బీర్‌ కపూర్‌ ప్రపోజ్ చేశాడా? అని అభిమానుల్లో ఓ చిన్న సందేహం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఆలియా భట్. 

(ఇది చదవండి: బేబీ ఆలియా భట్‌.. వావ్‌ ఎంత క్యూట్‌గా ఉందో..!)

గతంలో కాఫీ విత్‌ కరణ్ షోలో పాల్గొన్న ఆలియా భట్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కెన్యాలో జరిగిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం రణబీర్ కపూర్ ప్రపోజ్‌ చేసిన ఆ ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోలో రణ్‌బీర్‌ కపూర్‌ మోకాళ్లపై కూర్చుని ఆలియాకు సర్‌ప్రైజ్‌ షాక్ ఇచ్చాడు. దీంతో ఆలియా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఏడుస్తూ కనిపించింది.

అలియా మాట్లాడుతూ..  'రణ్‌బీర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని వివరించింది. చాలా అద్భుతమైన ప్రదేశంలో రణ్‌బీర్‌ నాకు ప్రపోజ్ చేశారు. అది కెన్యాలోని అడవుల్లోని ఓ అందమైన ప్రదేశం. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ మా గైడ్‌ ఆ ఫోటోలు తీసేలా రణ్‌బీర్‌ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత నేను ఇంకా షాక్‌తో ఉన్నా. చాలా భావోద్వేగానికి గురయ్యా. ఆ ఫోటో నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది ఆలియా భట్. 

(ఇది చదవండి: ఆలియా భట్ షాకింగ్ కండీషన్.. బేబీని చూడాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!)

అలియా, రణబీర్‌ల పెళ్లి:  అలియా, రణబీర్ ఐదేళ్ల పాటు డేటింగ్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో  సన్నిహితుల, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లోనే ఈ జంట ఓ పాప జన్మించింది. వీరి బేబీకి రాహ కపూర్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది అలియా భట్, రణబీర్ కపూర్‌ నటించిన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement