
ముంబై: క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’. ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్‌లుక్ పోస్టర్లను తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లలో పవర్‌ఫుల్ స్టన్నింగ్ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది. ఈ పోస్టర్లలో ఆలియా యంగర్‌లుక్‌తోపాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా కనిపిస్తున్న లుక్‌ను కూడా చూడొచ్చు.
సల్మాన్ ఖాన్‌తో అనుకున్న ‘ఇన్‌షా అల్లా’ సినిమా కొన్ని విభేదాల కారణంగా ఆగిపోవడంతో భన్సాలీ వెంటనే ఆలియాతో ‘గంగూబాయి ఖథియావాడి’. సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ముంబై మాఫియా రారాణి గంగూబాయి కతియావాడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హుస్సైన్ జెదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో గంగూభాయిగా టైటిల్ రోల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటికే ఆలియా సంతోషం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment