
ఆలియా భట్
ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ చిత్రీకరణలో ఆమె గాయపడ్డారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఆలియా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ‘త్వరగా కోలుకోండి’ అని సోషల్ మీడియాలో ప్రేమ పరామర్శలు పోస్ట్ చేశారు. ‘‘కంగారేం లేదు. నేను గాయపడలేదు’’ అని స్పష్టం చేశారు ఆలియా. ‘‘నేను సెట్లో గాయపడ్డాననే వార్తల్లో నిజం లేదు. పాత గాయమే మళ్లీ తిరగబెట్టింది. దాంతో ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాను’’ అని ఆలియా పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి...’, రణ్‌బీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’, రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సిని మాలు చేస్తున్నారు ఆలియా భట్.
Comments
Please login to add a commentAdd a comment