హమ్మయ్యా... ఆలియా! | Alia Bhatt discharged from hospital | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా... ఆలియా!

Published Thu, Jan 21 2021 12:42 AM | Last Updated on Thu, Jan 21 2021 12:52 AM

Alia Bhatt discharged from hospital - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఆస్పత్రిలో చేరారనే వార్త ఆమె అభిమానులను కలవరపెట్టింది. అస్వస్థతకు గురైన ఆమె ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడంతో ‘హమ్మయ్యా..!’ అనుకున్నారు ఫ్యాన్స్‌. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంలో నటిస్తున్నారు ఆలియా భట్‌. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్న ఆలియా హైపర్‌ అసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో వెంటనే ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన ఆలియా తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌ చరణ్‌కి జోడీగా ఆమె కనిపించనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement