రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్ | Alia Bhatt Revealed Rajamouli Advice To Select Movies | Sakshi
Sakshi News home page

Alia Bhatt: రాజమౌళి చెప్పారు.. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా

Published Thu, Mar 14 2024 7:31 PM | Last Updated on Thu, Mar 14 2024 7:59 PM

Alia Bhatt Revealed Rajamouli Advice To Select Movies - Sakshi

హీరోయిన్ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు హిందీ మూవీస్ చేసిన ఈమె.. 'ఆర్ఆర్ఆర్'లోనూ ఓ పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే అలియా-రాజమౌళికి గొడవైందని ఏవేవో అన్నారు. అయితే వాటిలో నిజానిజాలు పక్కనబెడితే.. తనకు రాజమౌళి ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నానని అలియా చెప్పుకొచ్చింది. అలా తన పద్ధతి పూర్తిగా మారిపోయిందని పేర్కొంది.

(ఇదీ చదవండి: బాధతో ఆ విషయం ఒప్పుకొంటున్నా: డైరెక్టర్ రాజమౌళి)

'సినిమాలని ఎంచుకునే విషయంలో మొదటి నుంచి ఒత్తిడికి గురవుతూ ఉండేదాన్ని. అదే విషయం రాజమౌళికి చెప్పాను. 'ఏది చేసినా సరే ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేక్షకులు మీ యాక్టింగ్‌ని మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారు. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏదీ లేదు' అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి నేను అదే పాటిస్తున్నాను'

'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేసేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా సరే ఓకే చెప్పాలని డిసైడ్ అయ్యాను' అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీలో 'జిగ్రా' అనే సినిమా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 27న ఇది థియేటర్లలోకి రానుంది. 

(ఇదీ చదవండి: మహేశ్‌ -రాజమౌళి సినిమా కథేంటో చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement