hospatalized
-
Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్‌లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.పాక్‌లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్‌లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్‌లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్‌లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్‌లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్‌వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న సత్పాల్ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్’ కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్‌వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి? -
అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్
రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ శిబు సోరెన్(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. 2005–10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత
సాక్షి, ఖమ్మం : వృక్ష ప్రేమికులు, పద్మశ్రీ వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ని శనివారం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వనజీవి రామయ్యకు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను వైద్యులను ఆదేశించారు. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి చెందిన రామయ్య.. వనజీవిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
హమ్మయ్యా... ఆలియా!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఆస్పత్రిలో చేరారనే వార్త ఆమె అభిమానులను కలవరపెట్టింది. అస్వస్థతకు గురైన ఆమె ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ‘హమ్మయ్యా..!’ అనుకున్నారు ఫ్యాన్స్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంలో నటిస్తున్నారు ఆలియా భట్. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్న ఆలియా హైపర్ అసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో వెంటనే ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన ఆలియా తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా ఆమె కనిపించనున్నారు. -
ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ..
ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ స్వల్ప అస్వస్థతకు లోనైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూబాయి కతియావాడి' చిత్రీకరణ సందర్భంగా ఆమె హైపరాసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గంగూబాయి చిత్ర యూనిట్ అందించిన సమాచారం ప్రకారం.. జనవరి 17న ముంబైలో జరిగిన షూటింగ్లో పాల్గొన్న ఆలియా.. స్వల్ప అస్వప్థతకు లోనుకావటంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం, అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, గంగూబాయి చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రాజ్, శాంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గల్లీబాయ్ హీరోయిన్.. గంగూబాయితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్రా', రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలావుండగా, ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేను ఆస్వాదించి ముంబైకి తిరిగి వచ్చింది. హాలిడేకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. -
మాజీ ఎంపీ రమ్యకు అస్వస్థత
బెంగళూరు: మాజీ ఎంపీ, సినీ నటి రమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం బెంగళూరు నగరంలోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే రమ్య అస్వస్థతకు గురయ్యారని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రమ్య పలు కన్నడ సినిమాల్లో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కర్ణాటక నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమ్య కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.