
మాజీ ఎంపీ రమ్యకు అస్వస్థత
బెంగళూరు: మాజీ ఎంపీ, సినీ నటి రమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం బెంగళూరు నగరంలోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫుడ్ పాయిజన్ కారణంగానే రమ్య అస్వస్థతకు గురయ్యారని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రమ్య పలు కన్నడ సినిమాల్లో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కర్ణాటక నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమ్య కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.