Vikram Hospital
-
నటి జయంతికి సీఎం పరామర్శ
సాక్షి, బెంగళూరు:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం సీనియర్ నటి జయంతిని పరామర్శించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతూ కొద్ది రోజుల క్రితం నగరంలోని విక్రమ్ ఆస్పత్రిలో చేరిన ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి చేరుకుని నటి జయంతిని పరామర్శించారు. ఆమెతో చాలాసేపు ముచ్చటించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించిన అనంతరం సీఎం మైసూరు బయలుదేరారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు, త్వరలో వెంటిలేటర్‌కు తీసివేస్తామని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ కేఎస్ సతీష్ మీడియాకు తెలిపారు. -
నిలకడగా నటి జయంతి ఆరోగ్యం
యశవంతపుర (బెంగళూరు): బహుభాషా నటి జయంతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న విక్రం ఆస్పత్రి వైద్యులు సతీశ్, విజయ చెప్పారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. వారు బుధవారం జయంతి తనయుడు కృష్ణకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో వెంటిలేటర్ తొలగించి ఆమెను సాధారణ వార్డుకు బదిలీ చేస్తామని తెలిపారు. -
మాజీ ఎంపీ రమ్యకు అస్వస్థత
బెంగళూరు: మాజీ ఎంపీ, సినీ నటి రమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రస్తుతం బెంగళూరు నగరంలోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే రమ్య అస్వస్థతకు గురయ్యారని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రమ్య పలు కన్నడ సినిమాల్లో నటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కర్ణాటక నుంచి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన రమ్య కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. -
ఆసుప్రతిలో చేరిన మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో సతమతమవుతున్న ఆయనను చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించినట్లు మాజీ సీఎం సన్నిహితులు తెలిపారు. మైసూర్, ఛిత్రదుర్గ జిల్లాల పర్యటనను ముగించుకున్న కుమారస్వామికి జ్వరంతో పాటు గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఈ క్రమంలో ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న కుమారస్వామికి ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈరోజు బ్లడ్ టెస్ట్ సహా అన్ని రకాల టెస్టులు చేశామని, ఎక్స్ రే తీశామని.. మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ తో మాజీ సీఎం ఇబ్బంది పడుతున్నారని విక్రమ్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సతీష్ మీడియాకు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లోనే కుమారస్వామిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. డాక్టర్ల సలహా మేరకు నాలుగైదు రోజులు తాను రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలలో పాల్గొనలేనని ఓ ప్రకటనలో కుమారస్వామి వెల్లడించారు.