
కోవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్స్‌తో బాలీవుడ్ మళ్లీ ట్రాక్‌లో పడే సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ముంబైలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, కొన్ని ప్రముఖ నిర్మాణసంస్థలు తమ సినిమాలకు సంబంధించిన క్రూ అందరికీ వ్యాక్సినేషన్ చేయించడం వంటి కారణాల వల్ల బీ టౌన్‌లో షూటింగ్స్ ప్లాన్ మొదలైంది. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ‘గంగూబాయి కతియావాడి’ టీమ్ షూట్‌కి రెడీ అయిందని సమాచారం.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల 15న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారట సంజయ్ లీలా భన్సాలీ. ఆగేది లేదోయీ అంటూ సినిమా ముగిసేవరకూ షూటింగ్ జరపాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదల తేదీపై ప్రభావం చూపుతుందా? అనేది వేచి చూడాల్సిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’, సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’ చిత్రబృందాలు కూడా వీలైనంత తొందరగా చిత్రీకరణను ప్రారంభించా లని ప్లాన్ చేస్తున్నాయి.
చదవండి : అలియా భట్, భన్సాలీలపై కేసు
గంగూబాయి చూపు ఓటీటీ వైపు?
Comments
Please login to add a commentAdd a comment